సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన సోషల్ మీ డియా యాప్స్ వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 18న కేసు నమోదైనప్పటికీ ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో నగరానికి చెందిన ఎస్.శ్రీశైలం ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. ప్రముఖ సోషల్‌మీడియా యాప్స్‌తో పా టు వాటి నిర్వాహకులను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ తరహా కేసు న మోదు కావడం దేశంలో ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. గత డిసెంబర్ 12న పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందింది. అప్ప టి నుంచి దీనికి వ్యతిరేకంగా పలు సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చ గొట్టే.. జాతి వ్యతిరేక ప్రచారం విస్తృతంగా జరుగుతోందని ఆరోపిస్తూ శ్రీశైలం తొలుత హైదరాబాద్ నగర పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయా గ్రూ ప్‌ల్లో పాకిస్తాన్‌కు చెందిన వారు ఉన్నారన్నారు. అయితే దీని ఆధారంగా కేసు నమోదు కాకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
వివిధ గ్రూపుల కేంద్రంగా జరుగుతున్న ఈ విద్వేషపూరిత ప్రచారాలకు వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ వేదికలవుతున్నాయని న్యాయస్థానానికి విన్నవించారు. కొన్ని గ్రూపుల వివరాలను కోర్టు ముందుంచారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. దీం తో టిక్‌టాక్, ట్విట్టర్, వాట్సప్‌తో పాటు వాటి నిర్వాహకులు, యాజమాన్యాల పై క్రిమినల్ కేసు నమోదైంది. ‘కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశాం. దర్యాప్తులో వెలుగులోకొచ్చిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. దీనిపై శ్రీశైలం మీడియాతో మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు 1200 గ్రూప్‌లు ఏర్పాటు చేసి జాతికి వ్యతిరే కంగా పోస్ట్‌లు పెడుతున్నారని గుర్తించాం. ఈ గ్రూప్‌ల్లో పాకిస్తాన్‌కు చెందిన వారు వందల మంది ఉంటున్నారు. దీన్ని కోర్టులో నిరూపించాం. దాదాపు 42 సోషియల్ మీడియా యాప్‌లు దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. వాట్సాప్, టిక్‌టాక్, ట్విట్టర్‌లకు నోటీసులు ఇస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment