హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాట్సాప్ రాకతో సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడం, స్వీకరించడం సులువైంది. అయితే పంపిన సందేశంలో అక్షర దోషాలు, వాక్య నిర్మాణంలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు. దాన్ని తొలగించడమో లేదా కాపీ చేసుకుని సరిచేసి మరోసారి పంపాల్సిందే.
అయితే పంపిన సందేశాన్ని సరిదిద్దుకునే ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది. దీని వల్ల సమయమూ ఆదా అవుతుంది. ఆన్‌డ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్ వాట్సాప్ బీటా వెర్షన్ భవిష్యత్ అప్‌డేట్ కోసం ఈ ఎడిటింగ్ ఫీచర్‌పై కంపెనీ నిమగ్నమైంది.
ఇది వస్తే ఎడిటింగ్ ఫీచర్ కలిగిన తొలి మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలుస్తుంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ ఇంకా స్పష్టత లేదు. గ్రూప్స్ నుంచి నిష్క్రమించినా అడ్మిన్‌కు తప్ప ఇతర సభ్యులకు తెలియకుండా ఓ ఫీచర్‌నూ వాట్సాప్ రూపొందిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment