త్రిష ఆరోగ్యంపై వదంతులే!
హీరోయిన్ త్రిష అనారోగ్యానికి గురైయ్యారని, ఆమె ఆస్పత్రిలో చేరారనే ప్రచారం చిత్రపరిశ్రమలో కలకలానికి దారి తీసింది. మూడు పదుల వయసులోనూ.. నటిగా బిజీగా ఉన్న ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో మోహిని, గర్జన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కాగా మిగిలినవి కమర్షియల్ నాయకి పాత్రలు. వీటిలో ఒక మలయాళ చిత్రం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష అనారోగ్యానికి గురైయ్యారని, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు మంగళవారం గుప్పుమన్నాయి.
దీంతో పలువురు అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారు పత్రిక కార్యాలయాలు ఫోన్ చేసి వివరణ కోరడం జరిగింది. దీంతో కోలీవుడ్‌లో కలకలమే చెలరేగింది. అయితే అవన్నీ వదంతులేనని త్రిష తల్లి ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు. త్రిషపై వచ్చిన ప్రచారంలో నిజం లేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని, ప్రస్తుతం మలేషియాలో అరవిందస్వామికి జంటగా సతురంగవేట్టై–2 చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారని వెల్లడించారు.