
హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని, అందుకు ఓ స్టార్ వెనకుండి సాయం చేస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వార్తపై తాజాగా త్రిష తల్లి ఉమ కృష్ణన్ స్పందించింది.
త్రిష రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసింది. అంతేకాక, ప్రస్తుతం తను సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టిందని, పలు భాషల్లో సినిమాలు చేసేందుకు సమాయత్తమవుతోందని చెప్పుకొచ్చింది. మరోవైపు త్రిష కూడా ఇలాంటి రూమర్లు ఎక్కడినుంచి వస్తాయని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు పాలిటిక్స్‌లోకి వెళ్లాలనే ఆలోచనే లేదని సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే త్రిష చివరగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.
చదవండి: ఆమె పార్టీకి బలం అవుతుందని నేను అనుకోవడం లేదు: మాజీ అధ్యక్షుడు
ఓటీటీలో రాజ్‌కుమార్ రావు హిట్, స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే!
Comments
Please login to add a commentAdd a comment