నీచల్ కులమ్(తమిళ) సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన సుమన్ సుమారు 45 ఏళ్లుగా నటుడిగా సత్తా చాటుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర నటుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. 90ల్లో అగ్ర హీరోగా రాణించిన సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతోనూ మెప్పించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో జైలు జీవితం గురించి, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నా కూతురు గోల్డ్ మెడలిస్ట్
'నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసు. ఆ కేసులో నా ప్రమేయం లేకపోయినా నన్ను లోపలేశారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత నాకు సపోర్ట్‌గా మాట్లాడారు. సుమన్ ఇలాంటి చీప్ పనులు చేయడని స్టేట్‌మంట్ ఇచ్చారు. అది నాకు బాగా సాయపడింది. నా కూతురు అఖిలజ ప్రత్యూష విషయానికి వస్తే తనకు యాక్టింగ్ మీద ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనిటిక్స్‌లో గోల్డ్ మెడల్ సంపాదించింది. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో ఇంటికి నా కూతురు కోడలిగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే పెళ్లిపై దృష్టి పెడతాం' అన్నారు సుమన్.
జైలు జీవితం గడిపిన సుమన్
కాగా 1985లో సుమన్ జైలుపాలయ్యారు. సుమన్ స్నేహితుడు దివాకర్‌కు క్యాసెట్ రెంట్‌కు ఇచ్చే షాపు ఉంది. ఆయన దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్లు తీసుకునేవారు. దివాకర్ తన స్నేహితుడే కావడంతో ఓసారి కారు అడిగితే ఇచ్చారు సుమన్. దాన్ని దివాకర్ నీలి చిత్రంలో వాడాడట. దీంతో ఇందులో సుమన్ హస్తం కూడా ఉందని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ అప్పటికే హీరోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమన్ జైలు నుంచి బయటకు వచ్చాక రచయిత డీవీ నరసరాజు మనవరాలు శిరీషను పెళ్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment