Shooting bandh
-
షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు ఫిలిం చాంబర్ సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రొడ్యుసర్స్ గిల్డ్ కూడ అంగీకారం చెప్పడంతో నేటి నుంచి షూటింగ్‌లు నిలిచిపోయాయి. తాజాగా షూటింగ్‌ల బంద్‌పై సీనియర్ నటుడు సమమన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదన్నారు. దీనివల్ల ఓటీటీకి ఏమౌతుందని, ఏం కాదంటూ వ్యాఖ్యానించారు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ‘ఇండస్ట్రీలోని సమస్యలను చర్చించుకోవడానికి షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవలానడం సబబు కాదు. క్రేజ్ ఉన్నప్పుడే హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే డిమాండ్ అండ్ సప్లై’ అన్నారు. అనంతరం షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలని నిర్మాతలకు సూచించారు. ‘షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలి. రెండు రోజుల చేసే వర్క్‌ని ఒక రోజులో చేయండి. అవసరం మేరకే కాల్షీట్ తీసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ కాల్షీట్ తీసుకోవాలి. వర్క్ ఫాస్ట్‌గా చేయాలి. అంతేకాని రేట్స్ తగ్గించకోండి. రెమ్యునరేషన్ తగ్గించుకోండనడం కరెక్ట్ కాదు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై వారు మాకు క్లోజ్ అని, మా ఫ్యామిలీ అంటూ కొందరు చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్లు వెళ్లి మాట్లాడండి. దీంట్లో రిలేషన్ షిప్ అనేది ఏం ఉండదు. డబ్బు ఇస్తున్నారు కదా తొందరగా రావాలని గట్టిగా చెప్పండి. మేనేజర్లు అక్కడ పెట్టడం కాదు. ఇవన్ని స్వయంగా నిర్మాతే చూసుకోవాలి. మా టైంలో అవుట్ డోర్ షూటింగ్ అంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసే వాళ్లం. అదే ఇప్పడు 9 గంటలకు వస్తున్నారు. 6 గంటలకే ప్యాకప్ చెప్పేస్తున్నారు. ఇలా అయితే ఖర్చు పెరగదా. ఒకప్పుడ. లేట్ అయితే అడగాలి. వర్క్ షాప్ చేయాలి. ఒకప్పుడ భయ్యర్ సినిమా కోనేవాడు. సినిమ ఫ్లాప్ అయితే అతడిని ఎవరు పట్టించుకోరు. రెట్స్ తగ్గించుకోమ్మంటున్నారు. మరి భయ్యర్ పరిస్థితేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. -
సోమవారం నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్
తెలుగు ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకే ఆదివారం ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశమైంది. ఈ సమావేశంలో గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు ఇచ్చింది. 24 క్రాఫ్ట్స్ లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేవరకు షూటింగ్స్ నిలివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వెల్లడించారు. రన్నింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా నిలివివేస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. సమస్యల పరిష్కారం దొరికేంత వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు. -
షూటింగ్ ఆపితే ఊరుకునేది లేదు: టియఫ్‌సీసీ చైర్మన్ ఆర్.కె.గౌడ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్స్ ఆపితే ఊరుకోబోమని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ (ఆర్.కె. గౌడ్) హెచ్చరించారు. షూటింగ్స్ నిలివేత అంశంపై మాట్లాడేందుకు శనివారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ.. స్వార్థం కోసమే ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ నిలిపివేస్తుందని ఆరోపించారు. ‘తెలంగాణలో 50 మంది వరకు నిర్మాతలున్నారు. చాలా మంది చిత్రీకరణ చేస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ అని గిల్డ్ నిర్మాతలు అంటున్నారు. ఎందుకు ఆపాలి? ఇదంతా వారి స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప చిత్ర పరిశ్రమకు ఉపయోగపడేది కాదు. చిత్ర పరిశ్రమ నలుగురిది కాదు.. అందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. బంద్ ప్రకటిస్తే వర్కర్స్కు ఇబ్బంది అవుతుంది. గిల్డ్ నిర్మాతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరికునేది లేదు. టికెట్ ధరలు పెంచుకుంది వారే.. ఇప్పుడు ధియేటర్ లకు ప్రేక్షకుల రావటం లేదని ఎడ్చేది వారే. ఆర్టిస్ట్ లకు రెమ్యూనిరేషన్ లు పెంచింది కూడా గిల్డ్ నిర్మాతలే. ఇంకొకరు ఎదగొద్దు అనేలా గిల్డ్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. గిల్డ్ నిర్మాతలే ఓటీటీలకు తమ సినిమాలను ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇవన్ని తప్పులు వారు చేసి..ఇప్పుడు షూటింగ్ బంద్ అంటే ఎలా? బంద్ చేస్తే ఊరుకునేదే లేదు’అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆర్.కె. గౌడ్ హెచ్చరించారు. టికెట్ రేట్లు తగ్గించి, పర్సంటేజ్ విధానం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ... కొంత మంది సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాతగా ఎదిగినవారే. నేను కూడా చాలా చిత్రాలు నిర్మించాను. కానీ సరైన థియేటర్స్ దొరక్క ఎంతో నష్టపోయాను. షూటింగ్స్ బంద్ చేయడానికి మీకు అధికారం లేదు. సామాన్యుడు ప్రస్తుతం సినిమా చూడాలంటే భయపడుతున్నాడు. కారణం టికెట్ల రేట్లు, తినుబండారాల రేట్లు పెంచడం. ముందు వీటిని తగ్గించండి. అంతే కానీ షూటింగ్స్ నిలిపేస్తే వచ్చేది ఏం లేదు. ఎవరైనా తమ షూటింగ్స్ ఆపారని మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రభుత్వం సపోర్ట్ తో వారిని ఎదుర్కొంటాం` అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రటరి సాగర్, హీరో సురేష్ బాబు, చెన్నారెడ్డి, కిషోర్, సతీష్, రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాన్..ఇంపాజిబుల్..కరోనాతో ఆగిన షూటింగ్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచిపోయింది. టామ్ క్రూజ్ నటిస్తున్న ఈ యాక్షన్ స్పై ఫిల్మ్‌కి క్రిస్టోఫర్ మెక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ యూకేలో జరుగుతోంది. అయితే రెగ్యులర్ కోవిడ్ టెస్టుల్లో భాగంగా చిత్రబృందానికి కరోనా పరీక్షలు చేయగా కొంతమందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 10మందికి పైనే ఉందని హాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్‌ను జూన్ 14 వరకు నిలిపి వేశారు. ఇక గత ఏడాది అక్టోబరులో కూడా ఈ చిత్రబృందంలో 12 మందికి కరోనా వచ్చి, షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా వల్ల మరోసారి షూటింగ్ ప్లాన్ ఇంపాజిబుల్ (అసాధ్యం) అయింది. ఈ ఏడాది విడుదల కావాల్సిన ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. -
సైఫ్, రాణి ముఖర్జీ కొత్త సినిమా షూటింగ్ పూర్తి
బంటీ ఔర్ బబ్లీకి క్రైం కామెడీ సినిమాకి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘బంటీ ఔర్బబ్లీ-2’. తాజాగా ఈ చిత్రం చివరి షూటింగ్ పూర్తైనట్లు యాష్ రాజ్ నిర్మాణ సంస్థ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్దాంత్ చతుర్వేది, షార్వారీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతులు రావటంతో చిత్రం బృందం ఈ సినిమాలోని చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ మూవీలోని ఓ సరదా పాటను చిత్రీకరించామని తెలిపింది. ఇందులో నటించిన సిద్దాంత్ చతుర్వేది, షార్వారీ కూడా తమ ట్విటర్లో సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు. 2005లో తెరకెక్కిన ‘బంటీ ఔర్ బబ్లీ’లో హీరో అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా అతిథి పాత్రలో కనిపించారు. అభిషేక్ స్థానంలో ప్రస్తుత సినిమాలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇక ఆయన యాష్ రాజ్ నిర్మాణ సంస్థలో విజయవంతమైన టైగర్ జిందా, సుల్తాన్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. And it’s a wrap! #BuntyAurBabli2 crew wraps up shooting of the film with a fun song while maintaining safety measures. pic.twitter.com/RXHzIYD12h — Yash Raj Films (@yrf) September 12, 2020 -
గుంగూబాయి కష్టాలు
గుంగూబాయి ఇరుకుల్లో పడిందని బీ టౌన్ టాక్. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ముంబై మాఫియా క్వీన్, గ్యాంగ్‌స్టర్‌గా చెప్పుకోబడిన గుంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. టైటిల్ పాత్రలో ఆలియాభట్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం 1970 కాలం నాటి ముంబైలోని కామాటిపుర సెట్‌ను ఓ స్టూడియోలో ఏర్పాటు చేశారు చిత్రబృందం. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్‌కు వీలుపడలేదు. కానీ స్టూడియో నిర్వాహకులకు మాత్రం అద్దె చెల్లిస్తూనే ఉన్నారట. ఒకవేళ వచ్చే నెల లాక్డౌన్ ఎత్తివేసినా షూటింగ్స్ వెంటనే స్టార్ట్ అవుతాయన్న గ్యారంటీ లేదు. పరిస్థితులు చక్కబడి చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం అయితే అప్పటివరకు అద్దె కట్టడం, ఒకవేళ వర్షాలు పడి సెట్ పాడైపోతే రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా అవుతుందట. అద్దె కట్టుకుంటూ వెళ్లి, చివరికి వర్షాలకు సెట్ పాడైపోతే మళ్లీ వెయ్యాల్సిందే. అందుకే సెట్‌ను ధ్వంసం చేసి, షూటింగ్ అవసరమనుకున్నప్పుడు సెట్‌ను వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అనుకుంటున్నారట భన్సాలీ. అప్పుడు అద్దె కూడా కట్టాల్సిన పని లేదన్నది ఆయన ఆలోచన అని బాలీవుడ్ వర్గాల కథనం. -
మార్పుని అలవాటు చేసుకోవాల్సిందే
కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ లాక్డౌన్ పరిస్థితుల వల్ల షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు రానా బదులిస్తూ – ‘‘భిన్న రకాలైన విషయాల పట్ల ఆసక్తికరంగా ఉండే నాలాంటి వ్యక్తులు లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఖాళీ సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటారు. నేను అదే చేస్తున్నాను. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. మాములు సమయాల్లో షూటింగ్స్ ఉంటాయి కాబట్టి పుస్తకాలు చదవడానికి పెద్దగా సమయం దొరికేది కాదు. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది. పుస్తకాలు చదివితే వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లుంటుంది. అది ఇప్పుడున్న ప్రపంచం కన్నా బాగుండొచ్చు (సరదాగా). అలాగే ఆత్మపరిశీలన చేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా కరోనా మహమ్మారి గురించి రానా మాట్లాడుతూ – ‘‘కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ కరోనా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఉండే మారే పరిస్థితులను మనం తప్పక అలవాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే కరోనా తర్వాత మన జీవన విధానంలో మార్పులు వస్తాయి. మనం మునుపటిలా ఉండలేం’’ అని పేర్కొన్నారు. -
భారతీయుడు ఆగలేదు
‘‘భారతీయుడు’ సినిమా ఆగిపోయింది’’ అనే వార్త కోలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను లైకా ఖండించింది. తాజాగా మరోసారి కూడా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ – ‘‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్ సుమారు 60 శాతం పూర్తయింది. ఇంత పూర్తి చేశాక సినిమాను ఎందుకు ఆపేస్తాం? లాక్ డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెడతాం’’ అని పేర్కొన్నారు. -
దసరాకు బ్యాచ్‌లర్
ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడట ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అఖిల్. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట. ఆల్రెడీ సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు ఓ నెల షూట్ జరిగితే మూవీకి ప్యాకప్ చెప్పేస్తారట టీమ్. లాక్డౌన్ పూర్తయిన వెంటనే చకచకా పనులు పూర్తి చేయడానికి ఇప్పుడే కొన్ని రీ–రికార్డింగ్, ఎడిటింగ్ పనులపై దృష్టిపెట్టింది ఈ చిత్రబృందం. -
పుష్ప కోసం హోమ్‌వర్క్
‘పుష్ప’ కోసం రాయలసీమ యాస నేర్చుకుంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రానికి ముత్తం శెట్టి మీడియా సహ నిర్మాత. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయలసీమ యాస మాట్లాడే పుష్పరాజ్ అనే పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు రష్మికా మందన్నా కూడా ఆ యాసపై పట్టు సాధించేందుకు హోమ్ వర్క్ చేస్తున్నారని తెలిసింది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకోవడానికి రష్మికకు మంచి సమయం దొరికినట్లయింది. రష్మికాయే కాదు.. ‘పుష్ప’ టీమ్ అంతా ఈ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌కు బాగా వినియోగించుకుంటోందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. -
ఆగస్ట్‌లో ఆరంభం
కెరీర్ ప్రారంభంలో కమల్ హాసన్, రజనీకాంత్ పలు సినిమాల్లో కలిసి నటించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే నటులుగా కాదు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా వేసవిలో ప్రారంభం కావాలి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ సినిమాను ఆగస్ట్ నెలలో ప్రారంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. మరి ఈ సినిమాకి కమల్ కేవలం నిర్మాతగానే ఉంటారా? అతిథి పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాలి. -
17 ఏళ్లు... 20 సినిమాలు
ఇటీవలే ‘అల..వైకుంఠపురములో...’తో సూపర్‌సక్సెస్ అందుకున్నారు అల్లు అర్జున్ (బన్ని). ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా కోసం చిత్తూరు యాసపై పట్టు సాధించే పనిలో బిజీగా ఉన్నారు బన్ని. ఇది తన కెరీర్లో 20వ చిత్రం. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలాగే బన్నీ సినీ కెరీర్లో 17 సంవత్సరాలు ముగిశాయి. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఆ తర్వాత ‘ఆర్య’, ‘దేశముదురు’, ‘పరుగు’, జులాయి, రేసుగుర్రం, సరైనోడు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీలో తనదైన ప్రతిభను చాటుకున్నారు. ‘‘పదిహేడేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, నా అభిమానులకు రుణపడి ఉంటాను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ గార్లతో పాటు ‘గంగోత్రి’ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అల్లుఅర్జున్. అలాగే ఈ 17ఏళ్ల కెరీర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు స్నేహా రెడ్డి (అల్లు అర్జున్ భార్య). -
కరోనా ఎఫెక్ట్ : బాలీవుడ్ తారలు ఏం చేస్తున్నారంటే
రేపటి సీన్ పేపర్ ఎక్కడ? లొకేషన్ ఏమిటి? కాల్షీట్ ఎన్నింటికి? ఈ హడావిడిలో ఉండే బాలీవుడ్ తారలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. కరోనాతో కలత పడ్డారు. షూటింగ్‌లకు ఫుల్స్టాప్ పెట్టి ఇళ్లకే పరిమితమయ్యారు. భారతదేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధి ఒకరి స్పర్శతో మరొకరికి వ్యాపిస్తుందని, నలుగురిలో కలవడం వల్ల మనకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తుండటంతో చాలామంది నటీనటులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నవారు ఊరికే ఉంటారా? ఏదో ఒక వ్యాపకంలో పడతారు. కొందరు బొమ్మలు వేస్తున్నారు. కొందరు పుస్తకాలు చదువుతున్నారు. కొందరు వ్యాయామాలు చేస్తున్నారు. మరికొందరు పిల్లలతో గడుపుతున్నారు. కుటుంబంతో ఉండటం కూడా బాగుంది అని భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇన్స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ తారలు తమ ‘నిర్బంధ వ్యాపకాలను’ అభిమానులతో పంచుకుంటున్నారు. కరిష్మా కపూర్ తన ఇంటి బాల్కనీలో చక్కటి ఫోజ్‌లో ఫొటో దిగి పోస్ట్ చేసింది. ‘ఈ సమయంలో మీరంతా ఆందోళన చెందుతూ ఉంటారు. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చికాకు పడుతుంటారు. అయితే ఇలా ఉన్నది మీరొక్కరే కాదు. ప్రపంచంలో అందరం ఉన్నాం. అందుకే ధైర్యంగా ఉందాం. ఆశావహంగా ఉందాం’ అని ఆమె రాసింది. ఇక ఆమె సోదరి కరీనా కపూర్ తన పాత అల్బమ్స్ తిరగేసే పనిలో పడింది. బుజ్జాయిగా ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ ‘ఎవరో దగ్గరికొస్తుంటే వద్దన్నట్టున్నా కదూ. ఈ కరోనా టైమ్‌కు సరిగ్గా సరిపోయే ఫోటో ఇది’ అని రాసింది. అలాగే ఆమె తన భర్త సైఫ్ అలీ ఖాన్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ‘ఒక వారం పాటు ‘బుక్’ అయ్యాడు’ అని కామెంట్ పెట్టింది. క్యాండిల్ లైట్ల వెలుతురులో పుస్తకాలు చదువుకుంటున్న సైఫ్ ఫొటోను చూసి చాలా మంది ముచ్చటపడుతున్నారు. బాల్కనీ నుంచి బయటకు మలైకా అరోరా తన పెంపుడు కుక్కతో కలిసి బాల్కనీలో కూచుని ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ‘ఇంట్లో ఉన్నాను. నా కొడుకు అర్హాన్ ఈ ఫొటో తీశాడు’ అని రాసుకుంది ఆమె. ఇక టాప్‌స్టార్ ఆలియా భట్ అయితే తాను చదువుతున్న పుస్తకం ఫొటో పెట్టి ‘స్టే హోమ్. ఫినిష్ ఏ బుక్’ అని రాసింది. ఆలియా భట్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఆమె తండ్రి మహేశ్ భట్ నుంచి వచ్చింది. మహేష్ భట్ ఎప్పుడు ఏ పుస్తకం కొన్నా దాని బిల్లు ఆలియా భట్టే చెల్లించాలని ఒక ఒప్పందం వారిద్దరి మధ్య ఉంది. మరోవైపు బొమ్మలు గీసే వాళ్లకు కూడా కొదవ లేదు. ‘అంధాధున్’, ‘డ్రీమ్‌గర్ల్’, ‘బాలా’ సినిమాలతో మంచి ఊపు మీదున్న ఆయుష్మాన్ ఖురానా తోచిన బొమ్మలు వేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ‘ఇంట్లో ఉండి మన టాలెంట్ అంతా చూపుదాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొందాం’ అని రాశాడతను. తండ్రీ కూతుళ్ల అల్లరి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంట్లో ఉండిపోయిన అక్షయ్ కుమార్ తన కూతురు నితారతో కలిసి అల్లరి చేస్తుంటే తాను రాయవలసిన పుస్తకం రాయలేకపోతున్నానని అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా ఒక సరదా ఫొటో పోస్ట్ చేసింది. ఫొటోలో ఆమె ల్యాప్‌టాప్ కనిపిస్తూ ఉండగా దూరంగా లాన్లో అక్షయ్ కుమార్ తన కుమార్తెతో ఆటలాడుతున్నాడు. దీపికా పడుకోన్ మాత్రం ఈ ఊహించని ఖాళీ సమయాన్ని తన దేహ సంరక్షణ కోసం కేటాయిస్తోంది. ‘సెల్ఫ్ కేరింగ్‌లో ఉన్నాను’ అంటూ ఆమె ఒక ఫొటో పోస్ట్ చేసింది. ‘వార్డ్రోబ్లను కూడా క్లియర్ చేస్తున్నాను’ అని మరో ఫొటో పెట్టింది. ప్రియాంక చోప్రా మాత్రం తన కుక్క జినోతో గడుపుతోంది. ‘ఇంట్లో ఉండటానికి మించిన క్షేమం ఇప్పుడు లేదు. నా కుక్క ‘జినో’తో ముద్దుముచ్చట్లు సాగుతున్నాయి. సంతోషంగా ఉంది’ అని రాసిందామె. జినో జర్మన్ షపర్డ్ అట. తొలి వివాహ దినోత్సవం సందర్భంగా భర్తకు ఆ కుక్కను కానుకగా ఇచ్చిందట. కత్రినా కైఫ్ ఈ ఖాళీ సమయాలలో గిటార్ మీటే పనిలో పడితే, యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రా పుస్తకాల పురుగుగా మారాడు. సల్మాన్ ఖాన్ బొమ్మలు వేసి వేళ్లకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాడు. మొత్తం మీద బాలీవుడ్ స్టార్లందరూ క్రమశిక్షణతో ఉంటూ తాము కరోనాను అంటించుకోకుండా, తమ వల్ల అది పది మందికి అంటకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మనందరం కూడా అత్యవసరం అనుకుంటే తప్ప కొన్నాళ్లు ఇల్లు కదలకుండా ఇంట్లో ఉంటూనే పని చేస్తూ కాస్త సరదా సమయాలను కూడా దొంగిలించుకుందాం. బుక్ రీడింగ్ – సిద్దార్థ్ మల్హోత్రా గిటార్ ప్లే – కత్రినా కైఫ్ పెట్‌తో – ప్రియాంకా చోప్రా ఎండ వేళ – మలైకా అరోరా జాన్వీ కపూర్ సైఫ్ పుస్తక పఠనం బాల్కనీలో కరిష్మా దీపికా పదుకోన్ ఫేస్ మసాజ్ పాత ఆల్బమ్‌లో... కరీనా కపూర్ కంగనా రనౌత్ -
యుద్ధానికి వెళ్లినట్లుంది
ఇటీవల మూడు హిందీ సినిమాలకు (జాన్ అబ్రహాం ‘ఎటాక్’, అజయ్‌దేవగన్ – సిద్దార్ధ్ మల్హోత్రా ‘థ్యాంక్ గాడ్’, అర్జున్ కపూర్ సరసన ఓ సినిమా) సైన్ చేసి, బాలీవుడ్ ట్రాక్‌పై స్పీడ్ పెంచారు రకుల్‌ప్రీత్ సింగ్. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమాల షూటింగ్స్ అన్నీ బంద్ అయిన సంగతి తెలిసిందే. సైన్ చేసిన సినిమాల షూటింగ్స్ అనుకున్న సమయానికి జరగకపోవడం వల్ల తన మూవీ కాల్షీట్లు క్లాష్ అవుతాయని కంగారు పడుతున్నారు రకుల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘కరోనా వైరస్ ప్రభావం లేకపోయినట్లయితే ఈ సమయంలో ప్రతిరోజూ నేను షూటింగ్స్‌లో పాల్గొనాల్సింది. కానీ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. బ్రేక్ తర్వాత ఒకేసారి షూటింగ్స్ మొదలైతే నా డేట్స్‌ను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడంలేదు. నా కెరీర్లో ఇది పెద్ద బ్రేక్. కరోనా వైరస్ ఇండస్ట్రీ మొత్తాన్ని కలవరపెడుతోంది. అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఏదో యుద్ధానికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతోంది’’ అన్నారు రకుల్. -
5,6 తేదీల్లో షూటింగులు రద్దు
తమిళ సినిమా: జనవరి 5, 6 తేదీల్లో కోలీవుడ్‌లో షూటింగులన్నీ రద్దు కానున్నాయి. ఏమిటి మళ్లీ ఏమొచ్చింది సమ్మెలు లాంటివి జరగడం లేదు కదా అనే ఆలోచనల్లోకి వెళ్లి పోతున్నారా? అలాంటిదేమీ లేదులెండి. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణ కార్యక్రమాలను ఇప్పటికే మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం పలు రకాలుగా నిధిని సేకరించే పనిలో ఆ సంఘ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే చెన్నైలో స్టార్ క్రికెట్‌ను నిర్వహించి కొంత నిధిని రాబట్టారు. తాజాగా ఈ సంఘం మలేషియలో ఆ దేశ ప్రభుత్వ భాగస్వామ్యంతో క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలతో పాటు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు భారీ ఎత్తున జనవరి 6వ తేదీన మలేషియాలోని బుకట్ జలీల్ ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వన టుడు కమలహసన్‌తో పాటు 200 మంది సినీకళాకారులు ఈ స్టార్ క్రీడా వినోదాల్లో పాల్గొననున్నారు.దీంతో జనవరి 5,6 తేదీల్లో షూటింగ్‌లను రద్దు చేయాలన్న నటీనటుల సంఘ నిర్ణయానికి నిర్మాతల సంఘం సినీ సమాఖ్యలు మద్దతు తెలపడంతో పాటు ఆ తేదీల్లో షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. -
నోట్ల రద్దుతో షూటింగులు బంద్
ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక పక్క అవినీతిపరుల గుండెల్లో బాంబు పేలుస్తుంటే, మరో పక్క సాధారణ ప్రజానికాన్ని ఇక్కట్లు పాలు చేసింది. ఇంకో పక్క దీని ప్రభావం చిత్ర పరిశ్రమపైనా పడిందని చెప్పక తప్పదు. కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం విడుదల విషయంలో కేసులు, కోర్టు గుమ్మాలను ఎక్కుతూ సమస్యలను ఎదుర్కుంటుంటే, మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు పెద్ద నోట్ల రద్దు అంశం చిత్ర విడుదల వాయిదాకు కారణమైంది. జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్ పతాకంపై టి.శివ నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గురువారం విడుదలకు సన్నాహాలు చేశారు. అరుుతే సింగారవేలన్ అనే డిస్ట్రిబ్యూటర్ చిత్ర విడుదలను నిషేధించాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కడవుల్ ఇరుక్కాన్ కెమారూ చిత్ర విడుదలను నిషేధించలేమని తీర్పులో స్పష్టం చేసిందని చిత్ర నిర్మాత టి.శివ తెలిపారు. దీంతో చిత్రం విడుదలవుతుందనుకున్న తరుణంలో ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఉరుము ఉరిమి వెన్ను మీద పడినట్లు కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం పరిస్థితి అయింది. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్ల వ్యాపార లావాదేవీలకు డబ్బులు చేతులు మారడానికి సమస్యలు ఎదురయ్యాయి. ప్రధాని ప్రకటనతో ప్రేక్షకుల చిల్లర సమస్య కారణంగా థియేటర్లకు వెళ్లడం మానేశారని, చాలా థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేసే పరిస్థితి నెలకొందని నిర్మాత టి.శివ పేర్కొన్నారు. దీంతో తమ చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్ర విడుదలను ఈ నెల 17కు వారుుదా వేసుకున్నట్లు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా చిత్ర షూటింగ్ సమయంలో సినీ కార్మికులకు ఏరోజుకారోజు బేటాలు, లొకేషన్సకు అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో పెద్ద నోట్లు చెలామణి కాకపోవడంతో పలు చిత్రాల షూటింగ్‌లు రెండు రోజులుగా రద్దు అయ్యాయి. -
నేటి నుంచి షూటింగులు బంద్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సోమవారం నుంచి షూటింగ్స్ జరపరాదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం నాడు తమ నిర్ణయాన్ని ఓ ప్రకటనలో తెలియజేసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్మాతలకు, ఫెడరేషన్ ప్రతినిథులకు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు కొమర వెంకటేశ్ పేర్కొన్నారు. నటీనటులెవరూ ఈ బంద్ కాలంలో చలన చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనరాదని, ఆ మేరకు సినీ కార్మికులకు సహకరించాలని కోరారు. బంద్ నిర్ణయాన్ని చిత్రపరిశ్రమకు సంబంధించిన వర్గీయులందరికీ ఫ్యాక్స్ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. గడచిన నాలుగు రోజులుగా తెలుగు చలన చిత్రాల షూటింగులు జరగడంలేదు. కేవలం ‘బాహుబలి’, గిన్నిస్ రికార్డ్ కోసం తీస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం’ చిత్రాలు ప్రత్యేక అనుమతితో మాత్రమే షూటింగ్ జరుపుకుంటూ వచ్చాయి. తాజా పరిణామాల వల్ల వీటికి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. షూటింగ్ నిలుపు చేయాల్సిందిగా ‘బాహుబలి’ చిత్రబృందానికి కూడా సమాచారం పంపుతున్నామని కొమర వెంకటేశ్ తెలిపారు.