
ఆలియాభట్
గుంగూబాయి ఇరుకుల్లో పడిందని బీ టౌన్ టాక్. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ముంబై మాఫియా క్వీన్, గ్యాంగ్‌స్టర్‌గా చెప్పుకోబడిన గుంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. టైటిల్ పాత్రలో ఆలియాభట్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం 1970 కాలం నాటి ముంబైలోని కామాటిపుర సెట్‌ను ఓ స్టూడియోలో ఏర్పాటు చేశారు చిత్రబృందం. లాక్‌డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్‌కు వీలుపడలేదు. కానీ స్టూడియో నిర్వాహకులకు మాత్రం అద్దె చెల్లిస్తూనే ఉన్నారట.
ఒకవేళ వచ్చే నెల లాక్‌డౌన్ ఎత్తివేసినా షూటింగ్స్ వెంటనే స్టార్ట్ అవుతాయన్న గ్యారంటీ లేదు. పరిస్థితులు చక్కబడి చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం అయితే అప్పటివరకు అద్దె కట్టడం, ఒకవేళ వర్షాలు పడి సెట్ పాడైపోతే రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా అవుతుందట. అద్దె కట్టుకుంటూ వెళ్లి, చివరికి వర్షాలకు సెట్ పాడైపోతే మళ్లీ వెయ్యాల్సిందే. అందుకే సెట్‌ను ధ్వంసం చేసి, షూటింగ్ అవసరమనుకున్నప్పుడు సెట్‌ను వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అనుకుంటున్నారట భన్సాలీ. అప్పుడు అద్దె కూడా కట్టాల్సిన పని లేదన్నది ఆయన ఆలోచన అని బాలీవుడ్ వర్గాల కథనం.
Comments
Please login to add a commentAdd a comment