Gangubai Kathiawadi
-
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అలానే మిగతా దక్షిణాది భాషల్లోని చిత్రాలు సైతం అవార్డులు గెలుచుకున్నాయి. 'పుష్ప' మూవీకిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అలానే 'ఆర్ఆర్ఆర్'కి ఏకంగా ఆరు పురస్కారాలు దక్కడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?) అయితే చాలామంది ఎవరెవరికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది చూస్తుంటే.. సినీ ప్రేమికులు మాత్రం ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందా అని తెగ వెతికేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మేం ఆ లిస్టుతో వచ్చేశాం. అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది తెలియాలంటే దిగువన లిస్ట్‌పై అలా ఓ లుక్కేసేయండి. నేషనల్ అవార్డ్ మూవీస్- ఓటీటీ ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (తెలుగు) పుష్ప - అమెజాన్ ప్రైమ్ (తెలుగు) రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ - జియో సినిమా (తెలుగు-హిందీ) ఉప్పెన - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు) కొండపొలం - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు) ద కశ్మీర్ ఫైల్స్ - జీ5 (తెలుగు డబ్బింగ్) చార్లి 777 - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) గంగూబాయి కతియావాడి - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) మిమీ - నెట్‌ఫ్లిక్స్ (హిందీ) #Home - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) షేర్షా - అమెజాన్ ప్రైమ్ (హిందీ) సర్దార్ ఉద్దామ్ సింగ్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ) కడైసి వివసయ్ - సోనీ లివ్ (తెలుగు డబ్బింగ్) నాయట్టు - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) -
2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?
2021 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. తెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకొని మొత్తంగా 11 పురస్కారాల్ని టాలీవుడ్ దక్కించుకుంది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. మరోవైపు ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’కు ఏకంగా ఆరు అవార్డులతో పతాకస్థాయిలో నిలిచింది. కానీ చాలామంది నెటిజన్లు 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించినవి కానీ ఇందులో RRR (2022 మార్చి) , రాకెట్రీ సినిమా (2022 జులై), గంగూబాయ్ కాఠియావాడి సినిమా (2022 ఫిబ్రవరి) నెలలో విడుదలయ్యాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను 6 అవార్డులు, గంగూబాయ్ కాఠియావాడి సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో రాకెట్రీ సినిమాకు దక్కింది. (ఇదీ చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ) దీనిపై సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ను పలువురు ప్రశ్నించారు. జాతీయ చలన చిత్ర అవార్డు నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 నడుమ ఈ సినిమాలన్నీ ప్రభుత్వ అనుమతి రూల్స్ ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ పొందాయి.. కాబట్టి ఈ విధంగా విడుదలైన సినిమాలను 2021 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలుగా పరిగణిస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ 2021 డిసెంబరులోనే సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, కాబట్టి ఆ చిత్రానికి 2021 సంవత్సరానికిగాను జాతీయ పురస్కారం దక్కినట్లు వచ్చినట్టు భావించవచ్చన్నారు. ఈ విధంగా విడుదలైన మిగిలిన చిత్రాలకూ కూడా ఇదే విధానం వర్తిస్తుందని నీర్జా శేఖర్ తెలిపారు. -
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాలేవో తెలుసా?
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రిలీజ్ చిత్రాలు సైతం నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతుండగా.. సినీ ప్రియులు ఎంచక్కా ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మడాక్ ఫిల్మ్స్ సంస్థ ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాల జాబితాను పోస్ట్ చేసింది. అందులో హాలీవుడ్ కాకుండా.. అత్యధిక గంటలు వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాలు ఉన్నాయి. (ఇది చదవండి: రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్న బోల్డ్ బ్యూటీ!) ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల జాబితాను ప్రకటించింది. మడాక్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్(హిందీ) తొలిస్థానంలో ఉండగా.. మిమి చిత్రం పదో స్థానంలో నిలిచింది. రెండు స్థానంలో ఆలియాభట్ మూవీ గంగుభాయ్ కతియావాడి, మూడోస్థానంలో 'చోర్ నికల్ కే భాగా' నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో డార్లింగ్స్, మిన్నల్ మురళి, హసీన్ దిల్రుబా, సూర్యవంశి, మిషన్ మజ్ను, భూల్ భూలయ్యా-2 చిత్రాలు ఉన్నాయి. హిందీలోనూ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మొదటిస్థానంలో నిలవడం టాలీవుడ్ సినిమాకే గర్వకారణం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !) View this post on Instagram A post shared by Maddock Films (@maddockfilms) -
అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!
దుబాయ్‌లో జరుగుతున్న ఐఫా-2023 అవార్డుల కార్యక్రమంలో ఆలియా భట్ మూవీ సత్తా చాటింది. ఆలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' అవార్డులు కొల్లగొట్టింది. ముంబయిలోని కామాటిపుర నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఐఫా అవార్డుల్లో మూడు విభాగాల్లో ఎంపికైంది. ఈ సినిమా తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా-2 రెండు అవార్డులు దక్కించుకుంది. (ఇది చదవండి: 15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి) దుబాయ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. దక్షిణాది నుంచి కమల్ హాసన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సల్మాన్‌ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి పాల్గొన్న ఈ వేడుకలో టెక్నికల్ అవార్డులను అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అవార్డులను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి దక్కించుకుంది. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) -
ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు
మనది పురుషాధిక్య సమాజం. అన్నింటిలోనూ వాళ్లే ముందుంటారు, వాళ్లదే పైచేయి. రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కార్యనిర్వాహణ కావచ్చు, చివరికి ఎంటర్టైన్మెంట్ రంగం కావచ్చు, మహిళ అందులో పావుగానే ఉండేది. కానీ కాలం మారుతుంది. గ్లోబలైజేషన్ ప్రభావం, చదువుతో వచ్చిన చైతన్యం కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, మార్పుకి దోహదపడుతున్నాయి. అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లో తాము కూడా ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారు. సినిమా రంగంలోనూ కూడా హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలు, హీరో లవర్ పాత్రలకే పరిమితం అనే భావన క్రియేట్ అయ్యింది. కానీ నెమ్మదిగా దానిలోనుంచి బయటపడుతున్నారు. మహిళ పాత్రకు ప్రాధాన్యత పెంచుతున్నారు. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరగడంతో ఆ దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహిళా సాధికారత నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి ఆదరణ పొందాయి. ఎంతో కొంత సమాజంపై ఆ ఇంపాక్ట్ ని చూపించాయి. ఇటీవల కాలంలో ఉమెన్ ఎంపావర్‌మెంట్ ప్రధానంగా వచ్చిన సినిమాలు, వాటి ప్రత్యేకతలేంటో ఓ లుక్కేద్దాం. తెలుగులో.. `అరుంధతి` నుంచి `యశోద` వరకు.. టాలీవుడ్లో అనుష్క, సమంత వంటి కథానాయికలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అంతకు ముందే విజయశాంతి(కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ), జయసుధ(శివరంజని), సౌందర్య(అమ్మోరు)మహిళా ప్రాధాన్యతతో కూడిన సినిమాలు చేశారు మెప్పించారు. మహిళా శక్తిని చాటారు. హీరోయిజంలో పడి ఇండస్ట్రీ కొట్టుకుపోతున్న క్రమంలో ఈ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్లో మహిళా సాధికారతని చెప్పే చిత్రాలు చేసి మెప్పించారు. ఇటీవల కాలంలో అనుష్క శెట్టి ఇందులో ముందు వరుసలో ఉంది. ఆమె ఇప్పటికే `అరుంధతి`, `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` వంటి చిత్రాలు చేసింది. `అరుంధతి`తో అనుష్క సంచలనం.. దుష్ట శక్తిని ఎదుర్కొని ప్రజలను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ(జేజమ్మ) చేసిన పోరాటం నేపథ్యంలో `అరుంధతి` సాగుతుంది. ఇందులో అనుష్క పాత్రనే నిర్ణయాత్మక పాత్రగా ఉంటుంది. తనే స్వతహాగా పోరాడుతుంది. ఆ పోరాటంలో తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ విజయం సాధిస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా వరకు మూఢ విశ్వాసం ఉన్నప్పటికీ ఓ మహిళా తిరుగుబాటు, పోరాట పటిమ అనే అంశం ఎంతో మంది ఆడవాళ్లని ఇన్స్పైర్ చేస్తుందని చెప్పొచ్చు. కోడి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత అనుష్క నుంచి `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` చిత్రాలొచ్చాయి. చరిత్ర నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి`సినిమాని రూపొందించారు. ఓ అమ్మాయి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే అబ్బాయిగా పెరిగిన ఓ అమ్మాయి.. చివరికి కష్ట కాలంలో రాజ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ఓ వీరుడిలా, ఓ యోధుడిలా పోరాడే ఇతివృత్తం ఇందులో ప్రధాన అంశం. మహిళల్లోని వీరత్వాన్ని చాటి చెప్పిందీ సినిమా. కమర్షియల్ ఇది పెద్దగా మెప్పించలేకపోయింది. అలాగే రాజకీయ క్రీడలో బలిపశువుగా మారిన భాగమతి దాన్నుంచి ఎలా బయటపడింది, రాజకీయ నాయకుల కుట్రలను ఎంత తెలివిగా దెబ్బకొట్టిందనే కాన్సెప్ట్ తో వచ్చిన `భాగమతి` సైతం ఆకట్టుకుంది. చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. కానీ అనుష్క నటించిన మరో సినిమా `సైలెంట్` మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమాల్లోనూ అంతర్లీనంగా ఉమెన్ ఎంపావర్‌మెంట్ అంశాన్ని మనం చూడొచ్చు. `యశోద`తో సమంత జోరు కమర్షియల్ హీరోయిన్గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన సమంత ఇటీవల `యశోద` సినిమాతో మెప్పించింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళా సాధికారత అనే అంశానికి సరైన అర్థాన్ని చెప్పింది. అద్దెగర్భం(సరోగసి) అనే అంశాన్ని తీసుకుని దర్శకుడు హరి-హరీష్ రూపొందించిన చిత్రమిది. ఇందులో అద్దెగర్భాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని కార్పొరేట్ మెడికల్ సంస్థలు నిర్వహిస్తున్న మాఫియాని, చీకటి కోణాలను వెలికితీసింది. సినిమా పరంగా ఇది ఫిక్షనల్‌గానే తీసినప్పటికీ, ప్రస్తుత సమాజంలోనూ ఇలాంటి అగడాలు జరుగుతున్నాయనేది ఈ సినిమా ద్వారా చెప్పారు. ఇందులో ఓ సాధారణ అమ్మాయిగా సమంత అద్దెగర్భం పొంది అందులో చీకటి కోణాలను బయటకు తీసిన తీరు, ఈ క్రమంలో వారితో పోరాడిన తీరు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ పాత్ర పొటెన్షియాలిటీని బయటపెడుతుంది. అంతిమంగా మహిళ శక్తిని చాటి చెబుతుంది. ఇది సమాజాన్ని ప్రభావితం చేసింది. దీంతోపాటు `ఓబేబీ` చిత్రంతోనూ సమంత పర్ఫెక్ట్ ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని ఆవిష్కరించింది. ఓ వృద్ధ మహిళ యంగ్ ఏజ్‌లో సాధించలేనివి.. యంగ్‌గా మారినప్పుడు వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇందులో సమంతతోపాటు లక్ష్మి నటన వాహ్ అనిపిస్తుంది. `మహానటి`, `మిస్ ఇండియా`తో కీర్తిసురేష్ సత్తా.. కీర్తిసురేష్ పాన్ ఇండియా ఇమేజ్‌ని, జాతీయ అవార్డుని తీసుకొచ్చిన చిత్రం `మహానటి`. అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారణంగా రూపొందిన బయోపిక్. ఇందులో ఆమె జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సావిత్రి స్టార్ హీరోలను మించిన స్థాయికి ఎదగడం, ఆ తర్వాత ప్రేమ పేరులో మోసానికి గురికావడం, తర్వాత తన జీవితాన్నే నాశనం చేసుకోవడం ఇందులో కన్‌క్లూజన్. కానీ విశేష అభిమానుల ఆరాధ్య నటిగా కీర్తించబడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ కంటే ఫెయిల్యూర్ని, ఆమె చేసిన తప్పులను ఆవిష్కరించిన చిత్రంగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరోవైపు `మిస్` ఇండియా`తో మహిళాసాధికారతకు అసలైన అర్థం చెప్పింది కీర్తిసురేష్. విదేశాల్లో మన ఇండియన్ టీని పరిచయం చేసి, అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్‌గా నిలవడమనేది ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. కానీ నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. మిస్టరీ థ్రిల్లర్ `పెంగ్విన్` సైతం మహిళలను ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే `గుడ్ లక్ సఖి`చిత్రంలోనూ ఓ పేద గిరిజన అమ్మాయి షూటర్‌గా రాణించేందుకు పడే కష్టం నేపథ్యం ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ సినిమాలు ఆడకపోవడంతో అంతగా ఇంపాక్ట్ ని చూపించలేకపోయాయి. కోలీవుడ్‌లో.. నయనతార ఉమెన్ ఎంపావర్‌మెంట్ కి ప్రతిబింబం.. స్టార్ హీరోయిన్ నయనతార మహిళ సాధికారతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆమె గ్లామర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తుంది. ఆమె మాత్రమే కాదు, ఆమె సినిమాలు సైతం ఇటీవల అలానే ఉంటున్నాయి. నయనతార `డోరా`, `కో కో కోకిల`, `వసంతకాలం`, `అమ్మోరు తల్లి`, `ఓ2`, `మయూరి` వంటి సినిమాలతో విజయాలు అందుకుంది. ఇందులో `డోరా`లో ఓ ఆత్మతో పోరాటం చేస్తుంది నయన్. అలాగే `కోలమావు కోకిల` చిత్రం.. నిజమైన ఉమెన్ఎంపావర్మెంట్ని చాటి చెబుతుంది. ఇందులో కుటుంబ బాధ్యతని తను మోయాల్సి రావడంతో జాబ్ చేయాల్సి వస్తుంది నయనతారకి. ఆమె కొకైన్ స్మగ్లింగ్ చేసే సంస్థలో పనిచేయాల్సి వస్తుంది. అయితే అందుకో చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ సవాళ్లని, అడ్డంకులను ఎదుర్కొని దాన్నుంచి బయటపడేందుకు నయనతార చేసిన పోరాటమే ఈ చిత్రం. ఆద్యంతం ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. నేటి సమాజంలోని సవాళ్లని ప్రతిబింబిస్తుంది. నయనతార రెండేళ్ల క్రితం నటించిన `నెట్రికన్` సైతం ఉమెన్ ఎంపావర్‌మెంట్ అంశంగానే రూపొందింది. ఓ కళ్లులేని లేడీ పోలీస్ ఆఫీసర్ ఓ సీరియల్ కిల్లర్‌ని పట్టుకునేందుకు చేసే పోరాటమే ఈ చిత్ర కథ. ఇందులో కళ్లు లేకుండా కూడా హంతకులను నయనతార పట్టుకోవడం అనే అంశం మహిళ ఎంత పవర్ఫుల్ అనేది చాటి చెబుతుంది. మగవారిని మించి మహిళ చేయగలదని నిరూపించింది. అలాగే తన కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో రూపొందిన `కనెక్ట్`, కొడుక్కి ఆక్సిజన్ అందేలా చేయడంకోసం తల్లి పడే ఆరాటం నేపథ్యంలో వచ్చిన `ఓ2`, అలాగే హర్రర్ మూవీ `ఐరా`, తోపాటు `మాయా` చిత్రాలతోనూ నయనతార ఆకట్టుకుంది. ఆయా చిత్రాల్లో మహిళా శక్తి సామర్థ్యాలను చాటి చెప్పింది. నయనతార నటించిన చాలా సినిమాలు విశేష ఆదరణ పొందడంతోపాటు మంచి కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఇందులో చాలా వరకు సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలుండటం విశేషం. `గార్గి`తో సాయిపల్లవి.. సాయిపల్లవి నటించే సినిమాల్లో కచ్చితంగా మహిళా సాధికారత అనే అంశం ఉండి తీరాల్సిందే. లేదంటే ఆమె నటించదు. హీరో సరసన చేసినా ఆమె పాత్ర బలంగా ఉండాల్సిందే. ఇక తనే మెయిన్ లీడ్‌గా చేసి మెప్పించిన చిత్రం `గార్గి` ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి, మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఓ టీచర్ ఒంటరిగా చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మరోవైపు తెలుగులో వచ్చిన `విరాటపర్వం`లోనూ ప్రేమ కోసం ఆమె చేసే పోరాటం సైతం మహిళా శక్తిని చాటుతుందని చెప్పొచ్చు. కోలీవుడ్‌లో ఐశ్వర్య రాజేష్ సైతం మహిళా శక్తిని చాటే చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. ఆమె స్పోర్ట్స్ డ్రామా `కౌసల్య కృష్ణమూర్తి`(కనా) ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని చాటింది. దీంతోపాటు ఇటీవల `డ్రైవర్ జమున`, `ది గ్రేట్ ఇండియన్ కిచెన్`, `రన్ బేబీ రన్`, `సొప్పన సుందరి` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ సినిమాల్లోనే మహిళ పాత్ర బలంగా ఉండేలా చూసుకుంటుంది. ఆయా సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండటం విశేషం. అలాగే అమలాపాల్ నటించిన `ఆడై`(ఆమె) చిత్రం సైతం మహిళా శక్తిని చాటింది. మలయాళంలో.. `జయ జయ జయ జయ హే`.. మలయాళంలో ఇటీవల కాలంలో మహిళా శక్తిని చాటిన చిత్రంగా `జయ జయ జయ జయ హే`నిలుస్తుంది. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శణ రాజేంద్రన్, బసిల్ జోసెఫ్ నటించారు. ఇది అత్తారింట్లో అవమానాలు, గృహహింసకు గురైన మహిళ తిరుగుబాటు నేపథ్యంలో రూపొందిన చిత్రం. జయ అనే అమ్మాయికి బాగా చదువుకుని గొప్పగా ఎదగాలని ఉంటుంది, కానీ పేరెంట్స్ చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేస్తారు. చదివిస్తానన్న మాటతో పెళ్లి చేసుకున్న భర్త ఆ తర్వాత దాని ఊసేత్తడు.పైగా రోజూ ఇంట్లో వేదింపులు. ఇక లాభం లేదని భావించిన జయ తిరగబడుతుంది. ఫోన్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇంట్లో ఎవరికి తెలియకుండా భర్తని కొడుతుంది. భర్త మొదట ఈ విషయాన్ని దాచినా తర్వాత బయటపడుతుంది. పెద్దల సమక్షంలో ఇద్దరు క్షమాపణలు చెప్పుకుని మారిపోతారు. అంతలోనే జయ గర్భం దాల్చేలా చేస్తాడు భర్త. అలా అయితే ఇంట్లో పడి ఉంటుందని వారి ప్లాన్. కానీ ఈ కుట్ర గురించి తెలిసిన జయకి రక్తపోటు పెరిగి అబార్షన్ అవుతుంది. ఆమెపై నిందలేయడంతో ఇంటికి దూరంగా సోదరుడితో కలిసి ఉంటుంది. విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లగా జడ్జ్ క్లాస్ పీకడంతో భర్త లో మార్పు వస్తుంది, ఆ తర్వాత జయని ప్రేమగా చూసుకుంటాడు. తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తాడు. దీంతో అతని వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా మారుతుంది. కుటుంబం, విలువులు అంటూ అన్నీ భరించిన భార్య.. అత్తింటి ఆగడాలు తట్టుకోలేక ఎదురుతిరిగి తనేంటో నిరూపించింది. తన శక్తిని చాటి చెప్పింది. మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమా ఇటీవల కాలంలో మలయాళంలో ఎంతో ప్రభావితం చేసిన చిత్రంగా నిలవడం విశేషం. వీటితోపాటు మాలీవుడ్‌లో మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చి మెప్పించాయి. అందులో ఒకటి `ఉయరే`. అనేక స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి ఓ సాధారణ అమ్మాయి పైలట్ కావడమనే కథతో ఈ చిత్రం రూపొంది ఆదరణ పొందింది. ఇందులో పార్వతి ప్రధాన పాత్రలో నటించింది. దీంతోపాటు కిడ్నాప్‌కి గురైన ఓ అమ్మాయి పడే వేదన, దాన్నుంచి ఆమె బయటపడేందుకు చేసే పోరాటం నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ `హెలెన్` మంచి ఆదరణ పొందింది. అలాగే ఇద్దరు అమ్మాయిల జర్నీ నేపథ్యంలో వచ్చిన `రాణి పద్మిని`, అమల అక్కినేని, మంజు వారియర్ నటించిన `కేరాఫ్ సైరా బాను` చిత్రాలు మహిళా శక్తిని చాటే కథాంశాలతో రూపొంది మెప్పించాయి. సమాజంపై ఎంతో కొంత ఇంపాక్ట్ ని చూపించాయి. బాలీవుడ్లో.. `డర్టీ పిక్చర్` టూ `మేరీకోమ్` టూ `గంగూబాయ్`.. బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల జోరు చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన `డర్టీ పిక్చర్స్` నుంచి మొన్న అలియాభట్ నటించిన `గంగూభాయ్` వరకు చాలా సినిమాలు వచ్చి విశేష ఆదరణ పొందాయి. కమర్షియల్ గానూ సత్తా చాటాయి. బాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాపై ఎంతో ఇంపాక్ట్ ని చూపించాయి. బాలీవుడ్లో అంతకు ముందు కూడా అనేక మహిళశక్తిని చాటే సినిమాలు వచ్చినా, `డర్టీ పిక్చర్స్` మాత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అసలైన ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని చాటి చెప్పింది. ఇందులో విద్యాబాలన్ తన నటనతో ఇరగదీసి జాతీయ అవార్డుని అందుకుంది. మరోవైపు రియల్ లైఫ్ బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా వచ్చిన `మేరీకోమ్`తో ప్రియాంక చోప్రా.. మహిళా శక్తిని నిరూపించింది. నిజమైన ఉమెన్ ఎంపావర్‌మెంట్ ని చాటి చెప్పింది. ఇండియన్ సినిమాపైనే బలమైన ప్రభావాన్ని చూపించడంతోపాటు ఎంతో మందిని ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. మరోవైపు మిడిల్ ఏజ్ మహిళ విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుని తను కూడా స్వతంత్రంగా నిలబడటమనే కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీదేవి `ఇంగ్లీష్ వింగ్లీష్` మహిళా శక్తికి, ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. ఈ సినిమా చాలా మందిని ప్రభావితం చేసింది. తొలి ఇండియన్ ఎయిర్ పైలట్‌గా.. తప్పిపోయిన భర్తని వెతికే క్రమంలో ఓ గర్భిణి పడే బాధల నేపథ్యంలో వచ్చిన విద్యా బాలన్ `కహాని`, ఓ లేడీ పోలీస్ అధికారి క్రైమ్‌ని అంతం చేసే ఇతివృత్తంతో వచ్చిన రాణి ముఖర్జీ `మార్దాని`, కార్గిల్ వార్(ఇండియా పాక్ వార్) సమయంలో ఆ వార్ ప్రాంతంలో ప్రయాణించిన తొలి ఇండియన్ ఎయిర్ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా` లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్. మహిళా శక్తిని చాటే చిత్రాలుగా నిలిచాయి. వీటితోపాటు తాప్సీ నటించిన `పింక్` చిత్రం ఇటీవల కాలంలో ఎంతో ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. అత్యంత చర్చనీయాంశంగానూ మారింది. అలాగే శ్రీదేవి `మామ్`, ఐశ్వర్య రాయ్ `సర్బ్జిత్`, తాప్సీ `తాప్పడ్` వంటి సినిమాలు కూడా మహిళా శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించిన చిత్రాలే. దీపికా పదుకొనె ప్రధాన పాత్రతో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హిస్టారికల్ మూవీ `పద్మావత్`, అలియాభట్ నటించిన `గంగూభాయ్` ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి ప్రతిరూపాలు. కథియవాడి ఏరియాలో వేశ్య వృత్తి చేసుకునే గంగూభాయ్.. లేడీ డాన్‌గా, రాజకీయాలను శాషించే స్థాయికి ఎదగడమనే కథాంశంతో వచ్చిన `గంగూభాయ్` సినిమా విశేషం ఆదరణ పొందింది. ఇలా ఇప్పటికే బాలీవుడ్లో మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తూ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇన్స్పైర్ చేస్తున్నాయి. మరిన్ని రూపుదిద్దుకుంటున్నాయి. -
ఫిలింఫేర్ అవార్డుల వేడుక.. ఆలియా సినిమాకు ఏకంగా 10 అవార్డులు!
ఫిలింఫేర్ అవార్డుల్లో గంగూబాయి కథియావాడి సత్తా చాటింది. ఏకంగా 10 విభాగాల్లో అవార్డులు ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత బదాయి దో సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న కేసరియా పాట రెండు అవార్డులు సాధించింది. ఉత్తమ నటిగా ఆలియా భట్, ఉత్తమ నటుడిగా రాజ్ కుమార్ రావు నిలిచారు. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం. ముంబైలో గురువారం రాత్రి జరిగిన 68వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, మనీశ్ పాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకకు ఆలియా భట్, పూజా హెగ్డే, దియా మీర్జా, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జాన్వీ కపూర్, కాజోల్.. తదితరులు సెలబ్రిటీలు హాజరయ్యారు. అవార్డులు అందుకుంది వీరే.. ► ఉత్తమ చిత్రం - గంగూబాయి కథియావాడి ► ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ చిత్రం(క్రిటిక్స్) - బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి) ► ఉత్తమ నటి - ఆలియా భట్ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ నటి (క్రిటిక్స్) - టబు (భూల్ భులాయా 2), భూమి పెడ్నేకర్ (బదాయి దో) ► ఉత్తమ నటుడు - రాజ్ కుమార్ రావు (బదాయి దో) ► ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - సంజయ్ మిశ్రా (వధ్) ► ఉత్తమ సహాయ నటుడు - అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జియో) ► ఉత్తమ సహాయ నటి -షీబా చద్దా (బదాయి దో) ► ఉత్తమ గీత రచయిత - అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట) ► ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట) ► ఉత్తమ నేపథ్య గాయని - కవిత సేత్ (జుగ్‌జుగ్ జియోలోని రంగిసారి.. పాట) ► ఉత్తమ కథ - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి (బదాయి దో) ► ఉత్తమ స్క్రీన్‌ప్లే - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి, హర్షవర్ధన్ కులకర్ణి (బదాయి దో) ► ఉత్తమ సంభాషణలు - ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ - సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ సినిమాటోగ్రఫీ - సుదీప్ చటర్జీ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - షీతల్ ఇక్బాల్ శర్మ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ సౌండ్ డిజైన్ - బిశ్వదీప్ దీపక్ చటర్జీ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ ఎడిటింగ్ - నీనద్ కలంకార్ (ఎన్ యాక్షన్ హీరో) ► ఉత్తమ యాక్షన్ - పర్వేజ్ షైఖ్ (విక్రమ్ వేద) ► ఉత్తమ వీఎఫ్ఎక్స్ - డీఎన్ఈజీ, రెడిఫైన్ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ కొరియోగ్రఫీ - కృతి మహేశ్ (డోలిడా- గంగూబాయ్ కథియావాడి) ► ఉత్తమ డెబ్యూ దర్శకుడు - జస్పల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వల్ (వధ్) ► ఉత్తమ డెబ్యూ హీరో - అంకుశ్ గదం (ఝండ్) ► ఉత్తమ డెబ్యూ హీరోయిన్ - ఆండ్రియా కెవిచుసా (అనేక్) ► జీవిత సాఫల్య పురస్కారం - ప్రేమ్ చోప్రా ► ఆర్డీ బర్మన్ అవార్డ్ - జాన్వీ శ్రీమంకర్ (డోలిడా- గంగూబాయి కథియావాడి) చదవండి: రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్ -
ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా
ఆస్కార్ నామినేషన్స్‌లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా కూడా ఆస్కార్ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డులకు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం కాంతార, ఆర్ఆర్ఆర్లతో పాటు ది కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్ రిమైండర్ రేసులో ఉన్నాయి. మార్చ్12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్ సినిమాల ఆస్కార్ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023 We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms — Hombale Films (@hombalefilms) January 10, 2023 -
గంగూబాయిలా మారిన నిహారిక కొణిదెల.. ఫోటోలు వైరల్
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక `ఒక మనసు` చిత్రంతో హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆలియా భట్ నటించిన గంగూబాయ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా బర్త్‌డే పార్టీకి వచ్చిన నిహారిక గంగూబాయిలా అచ్చం దించేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అల్లు అర్జున్ భార్య స్నేహా, శ్రీజ సహా పలువురు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Nihaa Konidela (@niharikakonidela) -
అత్యధికంగా వీక్షించిన టాప్ 10 సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Netflix Top 10 Most Watched Movies Web Series May 1st Week: కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో థియేటర్లు మూతపడ్డాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. థియేటర్లకు అల్టర్నేట్గా మాత్రమే కాకుండా విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే సినీ ప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. అలాగే ఈ ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు, సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్‌ఫ్లిక్స్. ఎప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది ఈ దిగ్గజ సంస్థ. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్ 10లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇందులో అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' మూవీ నుంచి రణ్వీర్ సింగ్ '83' వరకు పలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో చాలా కాలం తర్వాత తెలుగులో తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ కూడా ఉండటం విశేషం. మరీ ఈ లిస్ట్‌లో ఉన్న మూవీస్, సిరీస్‌లు చూశారో లేదో చెక్ చేసుకోండి. చదవండి: పగ, ప్రతీకారంతో రగిలిన కీర్తి సురేష్ 'చిన్ని' మూవీ రివ్యూ Nothing tops this week’s top 10 most watched titles 👇 Gangubai Kathiawadi Mai Bridgerton 365 Days: This Day The Marked Heart Dasvi Ozark Mishan Impossible Anatomy Of A Scandal ‘83 — Netflix India (@NetflixIndia) May 7, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆసక్తికర వీడియో షేర్ చేసిన కొత్త పెళ్లి కూతురు ఆలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ వికెండ్ను ఇంట్లోనే ఎంజాయ్ చేస్తుంది. షూటింగ్ సెలవు సందర్భంగా తన పెట్ క్యాట్‌తో కలిసి ఓటీటీలో గంగూబాయ్ కతియవాడి మూవీ చూస్తోన్న వీడియోను తాజాగా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆలియా ‘శనివారం గంగూ, ఎడ్వర్డ్స్‌తో ఇలా’ అంటూ తన టీవీ ఎరియా వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా రణ్‌బీర్ షూటింగ్లో భాగంగా ఇటీవల దుబాయ్ వెళ్లాడు. దీంతో కొత్త పెళ్లి కూతురైన ఆలియా ఒంటరిగా వీకెండ్‌ను ఇంట్లోనే ఇలా గడిపేయడంతో ఈ వీడియో ఆసక్తిని సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం గంగూబాయ్ కతియావాడి ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26న నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మాఫియా క్వీన్ గంగూబాయ్ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న థియేటర్లో రిలీజైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఈమూవీ రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇప్పుడు ఓటీటీలో సైతం ఈ మూవీ దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ నెటిఫ్లిక్స్‌లో అత్యథిక వ్యూస్ తెచ్చుకున్న నాన్ ఇంగ్లీష్ మూవీగా నిలిచింది. ఒక్క వీక్‌లోనే ఈమూవీని 13.81 మిలియన్ల గంటల టాపు వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో(కెనడా, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలో) ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 చిత్రాల్లో ప్రదర్శించబడింది. -
ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు..
Upcoming Theatre OTT Movies Web Series In April Last Week 2022: మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి పండుగల కనువిందు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వసూళ్ల పరంపర కొనసాగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత తాజాగా విడుదలయ్యే చిత్రాలపై పడింది సినీ ప్రియుల కన్ను. మూవీ లవర్స్ కోసమే అన్నట్లుగా ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఒక పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అలాగే ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా ! 1. ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందులోనూ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తోపాటు ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ అంటే.. ఆ అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు 'ఆచార్య'. 'ధర్మస్థలి' అనే ప్రాంతం చుట్టూ తిరిగే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 2. కణ్మనీ రాంబో ఖతీజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతారలతో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. చిరంజీవి 'ఆచార్య' సినిమా కంటే ఒక్క రోజు ముందుగా థియేటర్లలో తన ప్రేమాయణంతో సందడి చేయనున్నాడు ఈ హీరో. అంటే ఏప్రిల్ 28న ఈ మూవీ విడుదల కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్'ను తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా'గా రిలీజ్ చేస్తున్నారు. 3. రన్ వే 34 బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కలిసి నటించిన చిత్రం 'రన్ వే 34'. ఈ సినిమాతో సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు అజయ్ దేవగణ్. ఇందులో టాలీవుడ్ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ అలరించనున్నారు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్, అజయ్ దేవగణ్ పైలట్లుగా నటించగా, అమితాబ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా అలరించనున్నారు. 4. హీరోపంతీ 2 బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన తాజా చిత్రం హీరోపంతీ 2. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారా సుతారియా హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియద్వాలా నిర్మించారు. లైలా అనే విలన్ రోల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ తన యాక్టింగ్ మార్క్‌ను చూపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల విడుదలకు సిద్ధంగా ఉంది. ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్ గంగుబాయి కతియావాడి-ఏప్రిల్ 26 (తెలుగు) 365 డేస్: దిస్ డే-ఏప్రిల్ 27 (హాలీవుడ్) మిషన్ ఇంపాజిబుల్-ఏప్రిల్ 29 (తెలుగు) ఓ జార్క్-ఏప్రిల్ 29 (వెబ్ సిరీస్) ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్ క్వీన్స్-ఏప్రిల్ 29 (హాలీవుడ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనుపమ: నమస్తే అమెరికా-ఏప్రిల్ 25 (హిందీ) బ్యారీ-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) మిషన్ సిండ్రెల్లా-ఏప్రిల్ 29 (హిందీ) జీ5 నెవర్ కిస్ యువర్ బెస్ట్‌ఫ్రెండ్-ఏప్రిల్ 29 (హిందీ) అమెజాన్ ప్రైమ్ వీడియో అన్డన్-ఏప్రిల్ 29 (కార్టూన్ సిరీస్) వూట్ బేక్డ్-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) ది ఆఫర్-ఏప్రిల్ 28 (వెబ్ సిరీస్) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నెట్‌ఫ్లిక్స్‌లో గంగూబాయ్ కతియావాడి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం గంగూబాయ్ కతియావాడి. మాఫియా క్వీన్ గంగూబాయ్ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజైంది. తక్కువ కాలంలోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి గంగూబాయ్ కతియావాడి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినా, మరోసారి గంగూబాయ్ కతియావాడి చూడాలనుకున్నా మంగళవారం(ఏప్రిల్ 26) వరకు వెయిట్ చేయాల్సిందే! Dekho, dekho chaand Netflix pe aaraha hai 🌝#GangubaiKathiawadi arrives on April 26th 💃🏻❤️#GangubaiKathiawadiOnNetflix pic.twitter.com/YZVQvn4q3W — Netflix India (@NetflixIndia) April 20, 2022 చదవండి: Ram Charan - Jawans: జవాన్లతో రామ్‌చరణ్ ఫొటోలు ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో! -
ఈ 3 సినిమాల కోసం ఓటీటీల్లో ఫ్యాన్స్ వెయిటింగ్..
Movie Audience Waiting For These 3 Movie Release In OTT: కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీలు. మహామ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో మూవీ లవర్స్‌కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అద్భుతంగా నటించే పర భాష హీరోలను దేశవ్యాప్తంగా పరిచయం చేశాయి. క్రమక్రమంగా పెద్ద హీరోలు కూడా వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేసే స్థాయికి ఎదిగాయి. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు అనుకూలించిన తర్వాత కూడా థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన పుష్ప, రాధేశ్యామ్, అఖండ వంటి భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ వేదికగా అలరించాయి. మరికొన్ని సినిమాలు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ముచ్చటగా 3 సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దామా ! 1. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం) మూవీ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఓటీటీ రిలీజ్ల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. వెయ్యి కోట్లు సాధించింది. ఇంకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' మేనియా ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా కోసం ఓటీటీ లవర్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అని కాచుకు కూర్చున్నారు. థియేటర్లలో వీక్షించిన వారు కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తే మరిన్ని సార్లు చూడొచ్చని భావిస్తున్నారు. 2. గంగూబాయి కతియావాడి 'ఆర్ఆర్ఆర్'లో సీతగా అలరించింది బాలీవుడ్ క్యూటీ అలియా భట్. ఈ సినిమాకు ముందే విడుదలైంది అలియా లీడ్ రోల్ చేసిన 'గంగూబాయి కతియావాడి' సినిమా. ముంబై మాఫియా క్వీన్‌గా పేరు తెచ్చుకున్న గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలియా భట్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. 'ఆర్ఆర్ఆర్'తో అలియా భట్ తెలుగు ఆడియన్స్‌కు చేరువకావడంతో 'గంగూబాయి కతియావాడి' మూవీ ఓటీటీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. 3. ది కశ్మీర్ ఫైల్స్ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు సృష్టిస్తాయి కొన్ని సినిమాలు. అలాంటి కోవకు చెందినదే 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో 1990 సంవత్సరంలో కశ్మీర్ పండిట్స్పై జరిగిన మారణకాండ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వివాదాస్పద కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ కోసం కూడా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. -
బామ్మ నా మజాకా! గంగూబాయి పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ..
Age is just a number Prove This Dance Video: డ్యాన్సులకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. కొత్త పెళ్లికూతురు వరుడుని ఇంప్రస్చేసే ప్రయత్నంలో వివాహ వేడులకలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా "బుల్లెట్ బండి" పాటకు డ్యాన్స్ చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. అంతెందుకు చిన్న పిలల్లు దగ్గర నుంచి పెద్దల వరకు తమ నాట్య ప్రతిభతో అలరించిన వారెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ డ్యాన్స్ చేసింది. అందులో పెద్ద విశేషమేమిటి అనే కదా! వివరాల్లోకెళ్లే...74 ఏళ్ల బామ్మ గంగూబాయి కతియావాడి చిత్రంలోని ప్రసిద్ధ 'ధోలిడా' పాటకు చక్కగా డ్యాన్స్ చేసింది. ఎంత బాగా చేసిందంటే టీనేజర్ల కంటే కూడా చాలా బాగా ఆ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేసింది. పైగా డ్యాన్స్ చేయాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించింది కూడా. ఈ మేరకు ఆ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు బామ్మ డ్యాన్స్ చూసి ఫిదా అవ్వడమే కాక వావ్ బామ్మ అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఏనుగు ముందు ఎందుకలా పరిగెడుతున్నాడు..? Age is just a number and it is appropriately proven by this 74-year-old woman dancing on the famous 'Dholida' song from the film Gangubai Kathiawadi. #Gangubai #Dholida #Gujarat #AliaBhatt #NewsMo #ITVertical pic.twitter.com/EA5kQWUXIr — IndiaToday (@IndiaToday) March 24, 2022 -
ఆ సినిమా కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తాన్ నటుడు
Pakistani Actor Book Entire Theatre Alia Bhatt Gangubai Kathiawadi: బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ఇటీవల నటించి మెప్పించిన చిత్రం 'గంగూబాయి కతియవాడి'. బీటౌన్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మాఫీయా క్వీన్, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. దీంతో అలియాకు ఉన్న అభిమానులు సంఖ్య ఎల్లలు దాటింది. భారత సరిహద్దులను దాటి మించిపోయింది. ఈ బ్యూటీ నటించిన 'గంగూబాయి కతియవాడి' చిత్రం చూసేందుకు ఒక అభిమాని ఏకంగా థియేటర్‌నే బుక్ చేశాడు. పాకిస్తాన్‌కు చెందిన మోడల్, యాక్టర్ మునీబ్ బట్ అలియా భట్‌కు వీరాభిమాని. ఈ అభిమానంతోనే 'గంగుబాయి కతియవాడి' మూవీని తన భార్యతో కలిసి చూసేందుకు మొత్తం థియేటర్‌నే బుక్ చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. అనంతరం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో అలియా భట్ అనేక ఫ్యాన్ పేజీల్లో ఈ పోస్ట్ దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే కామాఠిపురలోని రెడ్‌లైట్ ఏరియాలో గంగూబాయి అనే యువతి మాఫీయా క్వీన్‌గా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిందే 'గంగూబాయి కతియవాడి' చిత్రం. 'మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై' అనే పుస్తకంలోని 'గుంగూబాయి హర్జీవందాస్' నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఓటీటీలో 'గంగూబాయి కతియావాడి',స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ గంగూబాయి కతియావాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆలియా గంగూబాయి పాత్రను పోషించింది. తన అందం, అభినయం, డైలాగ్ డెలీవరీతో ఆలియా విమర్శకుల ప్రశంసలు పొందింది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఇందుకోసం మేకర్స్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. మార్చి 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
100 కోట్ల క్లబ్లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ?
Alia Bhatt Celebrates Gangubai Kathiawadi Success With Burger And Fries: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతియవాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే మాఫీయ క్వీన్, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్.. ఇటీవలే ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కి అతిపెద్ద ఓపెనింగ్స్ ఇచ్చిన మూడో చిత్రం గంగూబాయి కతియవాడి. అయితే ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది అలియా భట్. అది ఎలా అంటే.. ఒక బర్గర్, ఫ్రైస్ తింటూ ఎంజాయ్ చేసింది అలియా భట్. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో గురువారం (మార్చి 10) షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో '100 కోట్ల మార్క్ దాటినందుకు శుభాకాంక్షలు గంగూబాయి, వేగన్ బర్గర్ + ఫ్రైతో అలియాకు శుభాకాంక్షలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అని క్యాప్షన్ రాసింది. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆలియా భట్
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. గంగూబాయి కతియావాడి సినిమాతో సూపర్ హిట్‌తో దూసుకెళ్తున్న ఆలియా త్వరలోనే హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ థ్రిల్లర్ సినిమాలో ఆలియా నటించనుంది. గాల్ గ్యాడట్‌తో కలిసి ఆలియా స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. డేవిడ్ ఎలిసన్‌తో పాటు . గాల్ గ్యాడెట్, ఆమె భర్త జేరన్ వార్సనో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా గంగూబాయి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆలియా త్వరలోనే నెటిఫ్లిక్స్‌లో హాలీవుడ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. -
100 కోట్ల క్లబ్లో చేరిన మహిళా ప్రాధాన్యత చిత్రాలు ఇవే..
Heroine Oriented Movies That Crossed 100 Crore In Bollywood: హీరో ఒరియెంటెడ్ మూవీస్ సాధారణమే. అవి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా హిట్ కొట్టడం పరిపాటే. కానీ మహిళా ప్రాధాన్యతతో వచ్చే సినిమాలు తక్కువే. ఒకవేళ వచ్చిన హిట్ కొట్టడం అంతా ఈజీ కాదు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వారి చరిష్మా, నైపుణ్యం వారికి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. అయితే ఇటీవల 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియా భట్ నటించిన హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రం 'గంగుబాయి కతియావాడి'. ఈ సినిమాలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్‌వైడ్ కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ. 100 కోట్ల మార్క్ దాటిన మహిళా ప్రాధాన్యత గల పలు బాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా ! 1. గంగుబాయి కతియవాడి- వారం రోజుల్లో రూ. 100 కోట్ల కలెక్షన్లు 2. తను వెడ్స్ మను రిటర్న్స్ - రూ. 255.3 కోట్లు 3. రాజీ- రూ. 195 కోట్లు 4. నీర్జా- రూ. 131 కోట్లు 5. స్త్రీ- రూ. 130 కోట్లు -
'గంగూభాయ్ కథియావాడి'ని వదిలేసుకున్న హీరోయిన్లు వీళ్లే!
పాన్ ఇండియా యాక్టర్ కావాలనే కలకు అప్పుడే పునాదులు వేసుకుంటోంది ఆలియా భట్. శ్రీదేవిలా ప్రతి భాషలోనూ స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్న ఆలియా నటించిన తాజా చిత్రం గంగూభాయ్ కథియావాడి. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. సౌత్‌లో గంగూభాయ్ హడావుడి పెద్దగా కనిపించకపోయినా బాలీవుడ్లో మాత్రం బాగానే సక్సెస్ అయింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.57 కోట్ల దాకా వసూలు చేసింది. కుర్ర హీరోయిన్ మాఫియా క్వీన్‌గా నటించగలదా? అన్న అనుమానాలను సైతం పటాపంచలు చేస్తూ అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నిజానికి గంగూభాయ్ పాత్ర కోసం ముందుగా ఆలియాను అనుకోలేదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. ఈ సినిమాను ముందుగా ముగ్గురు హీరోయిన్లు వదిలేసుకున్నారట! దీపికా పదుకొనేతో తీద్దామనుకుంటే అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టుల్లో ఉండటంతో నో చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రాను సంప్రదిద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ఈ స్టోరీకి మిమ్మల్ని అనుకుంటున్నారట అని ఓ మీడియా ఛానల్ అడగ్గా.. నా దగ్గరకు ఎవరూ ఆ స్టోరీతో రాలేదు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి హిందీ సినిమాలను అంగీకరించలేను అని తేల్చి చెప్పేసింది. ఈ ఇంటర్వ్యూ చూశాక ఆమె దగ్గరకు వెళ్లకుండానే డ్రాప్ అయ్యారట నిర్మాతలు. రాణీ ముఖర్జీకి ఈ పాత్ర పర్ఫెక్ట్గా ఉంటుందని ఆమెను సంప్రదించారట. ఆమె గతంలో సంజయ్ లీలా సినిమాల్లోనూ నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయనని తేల్చేసిందట. అలా చివరగా ఈ అవకాశం ఆలియాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం, గంగూభాయ్‌గా ఆలియా అదరగొట్టేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం రఫ్ఫాడించగలనని నిరూపించుకుంది. -
గంగూభాయ్ కతియావాడి: అలియా భట్‌కు ఓ రేంజ్లో రెమ్యునరేషన్!
ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘గంగూభాయ్ కతియావాడి’ మూవీకి సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అలరించిన స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజా సినిమాతో మరో మెట్టు ఎక్కిందని విశ్లేషకులు చెప్తున్నారు. టాప్ హీరో అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అలియా కళ్లు చెదిరే పారితోషికం తీసుకుందని సమాచారం. ఇండియా టుడే వార్త సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూభాయ్ సినిమాకు అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. దేవ్గన్ రూ.11 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ క్రైం డ్రామా సినిమా బడ్జెట్ రూ.100 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా గంగూభాయ్ తెరకెక్కింది. (చదవండి: ఎనర్జిటిక్ హీరోకు సరైనోడు విలన్.. ఆది రోల్ రివీల్) 1960 కాలంలో ముంబైలోని కామాఠీపుర రెడ్‌లైట్ ఏరియా ప్రధానంగా కథ సాగుతుంది. ఇక స్టార్ కిడ్ అయిన అలియా.. భన్సాలీ దర్శకత్వంలో నటించాలని తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లానని, అయితే ఆ సినిమాలో అవకాశం రాలేదని ఆమె గుర్తు చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా గంగూభాయ్ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్) -
మాటలు సరిపోవట్లేదు, ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి: సమంత
Samantha Lauds Alia Bhatt Performance In Gangubai Kathiawadi: గ్లామర్ రోల్స్‌తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది బాలీవుడ్ క్యూట్గుమ్మ అలియా భట్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో అలరించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో అలియా వేశ్యగా నటించడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఇందులో అలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత అలియా నటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '#గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.' అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది సామ్. ఇంకా అనన్య పాండే, ఆదిత్య సీల్, సోఫీ చౌదరి వంటి తారలు కూడా అలియా నటనపై ప్రశంసలు కురిపించారు. -
బాలీవుడ్ నటి అలియా భట్ ఫోటోలు
-
గంగూబాయ్ కథియావాడి ట్విటర్ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా నటించిన చిత్రం గంగూబాయ్ కథియావాడి. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ నిర్మించారు. ఇదివరకే రిలీజైన ట్రైలర్, సినిమాపై చుట్టుకున్న వివాదాలు ఆలియా సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయ్ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే! రిలీజ్‌ను సైతం అడ్డుకోవాలని చూసినప్పటికీ సినిమా విడుదలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసేసిన పలువురు నెటిజన్లు గంగూబాయ్ మూవీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి మెజారిటీ నెటిజన్లు గంగూబాయ్ను మెచ్చుకుంటున్నారా? ఆలియాకు మంచి మార్కులు పడ్డాయా? ఈ సినిమా తన కెరీర్‌కు ప్లస్ అయిందా? లేదా అనేది కింద చూసేయండి.. గంగూబాయ్ కథియావాడిలో ఆలియా నటన అద్భుతమని కొందరు కీర్తిస్తుంటే ఈ సినిమా పూర్తయ్యేవరకు థియేటర్లో నిద్రపోతూనే ఉన్నామని మరికొందరు అంటున్నారు. ఆ పాత్ర గాంభీర్యానికి ఆలియా గొంతు సెట్ అవ్వలేదన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు మాత్రం సినిమా అదిరిపోయిందని, ఆలియా పర్ఫామెన్స్‌కు మాటల్లేవ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆ రివ్యూలపై మీరూ ఓ లుక్కేయండి.. #OneWordReview...#GangubaiKathiawadi: BRILLIANT. Rating: ⭐️⭐⭐⭐#SLB is a magician, gets it right yet again... Powerful story + terrific moments + bravura performances [#AliaBhatt is beyond fantastic, #AjayDevgn outstanding]... UNMISSABLE. #GangubaiKathiawadiReview pic.twitter.com/pIyaf1MWtv — taran adarsh (@taran_adarsh) February 25, 2022 Saw #GangubaiKathiawadi last night!!! Another magical experience.. #SanjayLeelaBhansali is an absolute master storyteller. Every frame in the film has perfection written all over it. @aliaa08 you are gold! You are a fantastic actor but you have outdone yourself as Gangubai. — Riteish Deshmukh (@Riteishd) February 24, 2022 #GangubaiKathiawadi received 7 minutes standing ovation at the Berlin International film Festival from 700-800 audiences. #AliaBhatt — Indian Box Office (@box_oficeIndian) February 24, 2022 Finally watched most over hyper movie of the decade, I was big Bhasanali movies fan but after watching this i feel like he lost his charm, what a pathetic casting in main lead. If you watch other movies of him like black, HDDCS or Bajirao casting was perfect #GangubaiKathiawadi pic.twitter.com/lqrpcxnD73 — TweetuSultanL (@TweetuSultanL) February 25, 2022 Finished #GangubaiKathiawadi Disappointed from slb Below average performance of Alia Bhatt Slow screen play Over all it was a average movie 2.5/5 — gunjanchaubayofficial (@gunjanchau1993) February 25, 2022 I just Watched A Super Duper Hit Movie #GangubaiKathiawadi What a Amazing Movie 😍😍 Loved it Thank you @aliaa08 #SanjayLeelaBhansali @ajaydevgn for Giving a Wonderful and Blockbuster Movie. My review : ⭐⭐⭐⭐ 5/5#AliaBhatt #AjayDevgn @bhansali_produc ❤️❤️ pic.twitter.com/HxMhT3l14g — Pulkit Moonat (@am_pulkit) February 25, 2022 #PriyankaChopra , the first choice for #GangubaiKathiawadi would have given a 100 times better and Convincing performance than #AliaBhatt. The way she overshadowed M@@l aunty #DeepikaPadukone in BJM despite having a supporting role speaks volume about her acting skills. — Fotia (fire) (@I_am_fighter08) February 25, 2022 #GangubaiKathiawadi Movie : @aliaa08 ’s biggest career risk pays off. She took her acting to a different level and made it tough for her contemporaries to match her standards. #AliaBhatt pic.twitter.com/qWF172pqlJ — dinesh akula (@dineshakula) February 25, 2022 The soundtrack goes well with the mood of the film, but there's a hitch... Barring #Dholida, the remaining songs of #GangubaiKathiawadi are definitely not at par when one compares it with #SLB's earlier accomplished works. #GangubaiKathiawadiReview — Olid Ahmed Razu (@BeingOlidAhmed) February 25, 2022 Don't waste your money on movie like #GangubaiKathiawadi rather save it or serve it to poor.. — ✰Şนຖ (@a12sun) February 25, 2022 #OneWordReview...#GangubaiKathiawadi: BRILLIANT. Rating: ⭐️⭐⭐⭐#SLB is a magician, gets it right yet again... Powerful story + terrific moments + bravura performances [#AliaBhatt is beyond fantastic, #AjayDevgn outstanding]... UNMISSABLE. #GangubaiKathiawadiReview pic.twitter.com/XNuxqbFt9M — Olid Ahmed Razu (@BeingOlidAhmed) February 25, 2022 #GangubaiKathiawadi.. One word review. Flop.... #aliaabhatt looks like a kid.. Wrong casting only thing good is #AjayDevgn.. Will be the biggest flop of the year 1 out 5.. only for ajays performance... — Afzal rocks (@Afzalrocks1) February 25, 2022 you all bow down to the queen! she's here to rule & she's ruling!!! everybody in the theater is clapping and cheering and what not! truly one of a kind experience! loving the vibeeee 🥵😍#GangubaiKathiawadi #AliaBhatt — saurabh (@Saurabhhh_) February 25, 2022 #OneWordReview...from Australia#GangubaiKathiawadi: Engrossing Rating: 🌟🌟🌟🌟#SanjayLeelaBhansali weaves his magic, gets it right yet again. Powerful story #AliaBhatt gives her best, #AjayDevgn is outstanding Songs are good A must watch #GangubaiKathiawadiReview @aliaa08 pic.twitter.com/gw4F3tKJqm — Nitesh Naveen (@NiteshNaveenAus) February 25, 2022 After watching the movie you all sure bow down to her talent. #AliaBhatt born to play it and be a slb heroine.Alia Bhatt helps him with her immaculate acting and attitude. You will definitely miss out on a gem if you don’t watch it on the big screen. @aliaa08 #GangubaiKathiawadi pic.twitter.com/xW1GD4OBv4 — Jeny 🌸 (@Idiotic_luv_) February 25, 2022 చదవండి: జీవితంలో కామాఠిపురను చూడలేదు, తెలీకుండానే గంగూబాయ్‌లా మారిపోయేదాన్ని: ఆలియా -
నా కళ్లలోకి చూసి కచ్చితంగా హీరోయిన్ అవుతానన్నారు
‘‘పాన్ ఇండియా యాక్టర్ కావాలనేది నా కల. ఆ విషయంలో శ్రీదేవిగారు నాకు స్ఫూర్తి. ప్రతి భాషలోనూ స్టార్ అయ్యారామె.. నేనూ అలా కావాలనేదే నా లక్ష్యం. అందుకు భాష సరిహద్దు కాదని నేను నమ్ముతాను’’ అని ఆలియా భట్ అన్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘గంగూబాయ్ కథియావాడి’. భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలఅవుతోంది. ఈ సందర్భంగా ఆలియా భట్ చెప్పిన విశేషాలు... ► నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు (2005) సంజయ్ సార్ ‘బ్లాక్’ సినిమా ఆడిషన్‌కి వెళ్లి, సెలెక్ట్ కాలేదు. కానీ, ఆయన నా కళ్లలోకి చూసి ‘నువ్వు కచ్చితంగా హీరోయిన్ అవుతావు’ అన్నారు. గతంలో నేను పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ‘గంగూబాయ్ కథియావాడి’ లో నా పాత్ర ఉంటుంది. కానీ, నేను చేయగలనని సంజయ్ సార్ నమ్మి, నాకు ధైర్యం చెప్పారు. ► ఈ సినిమా విషయంలో సంజయ్ సర్ చెప్పింది ఫాలో అయ్యాను. వాయిస్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాను. పాత్ర కోసం కొంత బరువుకూడా పెరిగాను. గుజరాతీ యాస పట్టుకోవడం కష్టమయ్యింది. పైగా ఈ చిత్ర కథ 1950ల కాలంలో జరిగింది. అప్పటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని నటించాల్సి వచ్చింది. ► హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ‘గంగూబాయ్ కథియావాడి’ రూపొందింది. నేను పోషించే పాత్రలపై పరిశోధన చేయను. కానీ, డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను.. వాళ్లు చెప్పింది చేస్తాను. ఒక సీన్ చేయడానికి ఒకే పద్ధతి ఉండదనే విషయం ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. ► గంగూబాయ్లాంటి ఎమోషనల్, చాలెంజింగ్ పాత్ర చేయడం కష్టమే. కరోనా వల్ల రెండేళ్లు షూట్ చేశాం.. అందుకే ఇప్పటికీ ఆ పాత్రకి ఎమోషనల్‌గా అటాచ్ అయి ఉన్నాను. ప్రేక్షకులు సినిమా చూశాక కానీ నేను రిలాక్స్ కాలేను. ఈ మూవీ కోసం అజయ్ దేవగన్ వంటి గొప్ప నటుడితో పని చేయడం సంతోషంగా ఉంది. ► నా జీవితంలో కామాఠిపురని చూడలేదు. ముంబైలో వేసిన కామాఠిపుర సెట్‌కి మాత్రమే వెళ్లాను. అక్కడికి వెళ్లగానే ఆలియాలా కాకుండా గంగూబాయ్‌లా మారిపోయేదాన్ని. కొన్నిసార్లు ఇంట్లో కూడా నాకు తెలియకుండానే గంగూబాయ్‌లా ప్రవర్తించేదాన్ని. మనం మనలా కాకుండా వేరొకరిలా మారడం అంత ఈజీ కాదు. నేను మారానంటే ఆ క్యారెక్టర్ ప్రభావం. ► మంచి సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ‘పుష్ప’ సినిమా కలిగించింది. మా ‘గంగూబాయ్ కథియావాడి’ కూడా చాలా మంచి సినిమా కాబట్టి ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి, ఎంజాయ్ చేస్తారనే నమ్మకం పెరిగింది. తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. టాలీవుడ్లో నా ప్రయాణం మరింత ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. -
‘గంగూబాయ్ కతియావాడి’ మూవీ టీంపై గంగూబాయ్ ఫ్యామిలీ ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజాగా నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రోడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్ల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలై ప్రజాదరణ పొందింది. ముంబయిలోని మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వేశ్యగా జీవితం మొదలు పెట్టాల్సి వచ్చినా.. వాటన్నింటిని ఎదుర్కొని మాఫియా డాన్‌గా ఎదిగిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన మోహన్ బాబు, ఆ హీరోలే ఇలా చేయిస్తున్నారంటూ సీరియస్ అయితే ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై గంగూబాయి తనయుడు బాబూ రావుజీ షా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన తల్లిని ఇందులో వేశ్యగా చూపించి అవమానపరిచారంటూ గతేడాది ఈ చిత్రంపై డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ముంబై కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత సినిమా విడుదలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉండగా మూవీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఏం మాయ చేశావే’ నటుడు కన్నుమూత దీంతో గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు రావుజి షా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో బాబూ రావుజీ షా మాట్లాడుతూ.. ‘మీ సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.ఇప్పుడు అనేకమంది మీ అమ్మ అసలు వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. మా కుటుంబ మానసిక స్థితి బాగాలేదు. అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం’ అని వాపోయాడు. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఇక గంగూబాయి మనవరాలు మాట్లాడుతూ.. ‘డబ్బు కోసం మా కుటుంబం పరువు తీశారు. ఈ మూవీ తీసేటప్పుడు కూడా మా కుటుంబం అనుమతి అడగలేదు. వారు పుస్తకం రాసేటప్పుడు కూడా మా దగ్గరికీ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి కావాల్సిందే. మా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను చాలా అభ్యంతరకరంగా చూపిస్తున్నారు’ అంటూ ఆమె బాధపడింది. -
బాలీవుడ్ నుంచి వస్తోన్నగంగూబాయి
-
'గంగూబాయ్' కోసం కాస్ట్లీ చీరల్లో ఆలియా దర్శనం
Alia Bhatt Looks For Gangubai Kathiawadi Promotions: బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ భట్ వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా తన నటనతోనే అభిమానుల్ని సంపాదించుకుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' వంటి సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్న ఆలియా ఇప్పుడు 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్.. ఆలియా నట విశ్వరూపాన్ని చూపించింది. డైలాగ్ డెలివరీలోనూ స్టార్ హీరోలకు సమానంగా సత్తా చాటింది. ఈ సినిమాతో ఆలియా బాలీవుడ్ నెంబర్1 హీరోయిన్గా చక్రం తిప్పుదింటూ ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం భావిస్తున్నారు. ట్రైలర్‌తోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో చీరకట్టుతో మరింత మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ ప్రమోషన్స్ కోసం కేవలం చీరకట్టులో తళుక్కుమంటుంది. ఒక్కో చీర ధర సుమారు 21-29వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఫోటోలను మీరూ చూసేయండి మరి. -
రణ్‌బీర్‌తో నాకు పెళ్లయిపోయింది.. బయటపెట్టిన ఆలియా
Alia Bhatt Reveals Her Marraige With Ranbir Kapoor: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరి పెళ్లి 2020లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అనంతరం గతేడాది డిసెంబర్లో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా సినిమాల కారణంగా కొన్నాళ్లు తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ క్యూట్ కపుల్ పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.తాజాగా గంగూబాయ్ కతియావాడి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా భట్ తొలిసారిగా తన పెళ్లి విషయంపై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రణ్‌బీర్‌తో నా పెళ్లి ఇప్పటికే జరిగిపోయింది. చాలా కాలం క్రితమే నా మైండ్‌లో అతన్ని పెళ్లి చేసేసుకున్నాను(నవ్వుతూ). ఏం జరిగినా దానికి కారణాలుంటాయి. మా పెళ్లి అప్పుడు వాయిదా పడింది. కానీ ఎప్పుడు జరిగినా ఎంతో అందంగా జరుగుతుంది అని భావిస్తున్నా అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆలియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
గంగూబాయి నుంచి న్యూ వీడియో సాంగ్ రిలీజ్
-
ఒట్టేసి చెబుతున్నా, అది చేసి తీరతాను: ఆలియా
‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు.. ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’ అనే డైలాగ్‌తో ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్ విడుదలైంది. ఆలియా భట్ టైటిల్ రోల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘శ్రద్ధగా వినండి.. మీ కంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది.. అదెలా అంటారా? మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్టే.. మేమయితే రోజూ మా మానాన్ని అమ్ముకుంటాం.. అది అంతమే అవదు, ఒట్టేసి చెబుతున్నా.. మా పిల్లలందరికీ చదువులు నేర్పించే తీరతాను’ అంటూ ఆలియా చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘వేశ్యలు, వారి కుటుంబాల హక్కుల కోసం గంగూబాయి చేసిన పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మాఫియా క్వీన్‌గా ఆలియా నటనకు స్టార్ హీరోయిన్స్ ఫిదా
Alia Bhatt Gangubai Kathiawadi Trailer Released: ఆలియా భట్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’.ఇప్పటికే కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే.. ఎందుకంటే అక్కడ గంగూబాయ్ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో గంగూబాయ్‌గా ఆలియా భట్ నట విశ్వరూపం చూపించిందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో నివసించే సాధారణ అమ్మాయి ఒక బలమైన రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగిందన్నదే ఈ కథ. అజయ్ దేవగణ్, హుమా ఖురేషి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. “మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై” పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ బలమైన, సంక్లిష్టమైన గంగూబాయ్ పాత్రలో ఆలియా అద్భుతంగా నటించదని స్పష్టమవుతుంది. ఇప్పటికే సమంత, తమన్నా, జాహ్నవి, అనుష్క శర్మ సహా పలువురు హీరోయిన్స్ ట్రైలర్లో ఆలియా నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మొత్తంగా ఈ సినిమాపై ఇప్పుడు బీటౌన్ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. -
ఆర్ఆర్ఆర్ హీరోయిన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Alia Bhatt Gangubai Kathiawadi Movie Release Date Confirmed: ఆలియా భట్ మోస్ట్ అవైటెడ్ సినిమా 'గంగూబాయి కతియావాడి'. గత కొన్నాళ్లుగా వాయుదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంజయ్ లీలా భన్సాలీ దరకత్వం వహించిన ఈ సినిమాలో ఆలియా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. కాగా ఆలియా ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆలియా సీతగా నటించనుంది. #GangubaiKathiawadi will rise to power in cinemas near you on 25th February, 2022 🤍#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal https://t.co/y0Uab2hh6W — Alia Bhatt (@aliaa08) January 28, 2022 -
షూటింగ్ సమయంలో రెండు తుపాన్లు, లాక్డౌన్లు వచ్చాయి : ఆలియా
సంజయ్ లీలా భన్సాలీ దరకత్వంలో ఆలియా భట్ నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’.ముంబైలోని కామాటిపురకు మకుటం లేని మహారాణిగా పేరొందిన గంగూబాయి పాత్రను అలియా పోషించింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. 2019లో మొదలైన గంగూబాయ్ షూటింగ్ నేడు ముగిసింది. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేసింది. '2019, డిసెంబర్8న గంగూబాయ్ షూటింగ్‌ను ప్రారంభించాము. రెండేళ్లకు ఈ సినిమా పూర్తయ్యింది. ఈ మధ్యలో రెండుసార్లు లాక్డౌన్, రెండు తుఫానులు కూడా వచ్చి వెళ్లాయి. షూటింగ్ టైంలో డైరెక్టర్‌తో సహా కొందరు కరోనా బారిన పడ్డారు. దాంతో పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ వాటన్నింటిలోనూ సంతోషకరమైన విషయం ఏంటంటే..మీతో కలిసి పని చేయడం. భన్సాలీ సర్ దర్శకత్వలో పనిచేయడం అన్నది నా కల. అది ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. మీతో పనిచేయడం నా జీవితాన్ని మార్చేసింది. మీలాంటి వ్యక్తి మరొకరు లేరు. ఐ లవ్ యూ సర్. ఇక సెట్‌కు ఇక గుడ్‌బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. అయితే ఈ రెండేళ్ల ప్రయాణంలో నటిగా చాలా విషయాలు నేర్చుకున్నా. షూటింగ్ అయిపోయిందంటే బాధగా కూడా ఉంది. నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఫైనల్‌గా గంగూ ఐ లవ్ యూ. నిన్ను మిస్సవుతున్నాం. ముఖ్యంగా రెండేళ్ల ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబం, సన్నిహితులు, క్ర్యూ, సిబ్బంది అందరికి ధన్యవాదాలు..మీరు లేకపోతే ఇది అంత సులువుగా అయ్యేది కాదు' అంటూ ఆలియా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. జయంతి లాల్ గడా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్ర బృందం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్! -
ఇక ఆగేదే లేదంటున్న 'గంగూబాయి'..
కోవిడ్ సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత సినిమా షూటింగ్స్‌తో బాలీవుడ్ మళ్లీ ట్రాక్‌లో పడే సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ముంబైలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, కొన్ని ప్రముఖ నిర్మాణసంస్థలు తమ సినిమాలకు సంబంధించిన క్రూ అందరికీ వ్యాక్సినేషన్ చేయించడం వంటి కారణాల వల్ల బీ టౌన్లో షూటింగ్స్ ప్లాన్ మొదలైంది. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ‘గంగూబాయి కతియావాడి’ టీమ్ షూట్‌కి రెడీ అయిందని సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 15న ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారట సంజయ్ లీలా భన్సాలీ. ఆగేది లేదోయీ అంటూ సినిమా ముగిసేవరకూ షూటింగ్ జరపాలనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ ‘గంగూబాయి కతియావాడి’ సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపుతుందా? అనేది వేచి చూడాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’, సల్మాన్‌ఖాన్ ‘టైగర్ 3’ చిత్రబృందాలు కూడా వీలైనంత తొందరగా చిత్రీకరణను ప్రారంభించా లని ప్లాన్ చేస్తున్నాయి. చదవండి : అలియా భట్, భన్సాలీలపై కేసు గంగూబాయి చూపు ఓటీటీ వైపు? -
గంగూబాయి చూపు ఓటీటీ వైపు?
ఆలియా భట్ టైటిల్ రోల్లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే కరోనా ప్రభావంతో ప్రస్తుతం ముంబయ్‌లో థియేటర్స్ క్లోజ్ చేసి ఉండటం, ఒకవేళ మళ్లీ తెరచినా థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యం యాభై శాతమే ఉండే అవకాశం కనిపించడంతో భన్సాలీ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి.. గుంగూబాయి దారి థియేటర్వైపా? ఓటీటీవైపా? అనేది వేచి చూడాల్సిందే. చదవండి: ఫేషియల్ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్ -
ఆలియా @ ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపురా
‘‘కామాటిపురాలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగు ఉంటుంది. గౌరవంతో బతకాలి.. ఎవ్వరికీ భయపడకూడదు. నేను గంగూ బాయి.. ప్రెసిడెంట్ కామాటిపురా. మీరు కుమారి అంటూనే ఉన్నారు... నన్ను ఎవరూ శ్రీమతిని చేసిందే లేదు’’ వంటి డైలాగ్స్ ‘గంగూబాయి కాఠియావాడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కాఠియావాడీ’. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వేశ్యా గృహం నడిపే యజమాని గంగూబాయిగా నటిస్తున్నారు ఆలియా భట్. కాగా ‘వకీల్ సాబ్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘గంగూబాయి కాఠియావాడీ’ తెలుగు టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగారు? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ‘గంగూబాయి కాఠియావాడీ’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
నన్ను కుమారి అంటున్నారు, శ్రీమతిని చేసిందే లేదు..
"కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది.." అన్న పవర్ఫుల్ డైలాగ్‌తో గంగూబాయి కతియావాడి టీజర్ మొదలైంది. ముంబైలోని కామాటిపురకు మకుటం లేని మహారాణిగా పేరొందిన గంగూబాయి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటించింది. ఇటీవల ఈ సినిమా హిందీ టీజర్ రిలీజ్ కాగా తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కొత్త లుక్‌లో కనిపిస్తున్న అలియా... "గౌరవంతో బతకాలి, ఎవ్వరికీ భయపడకూడదు, పోలీస్కైనా, ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా.. వాడి అమ్మ మొగుడు.. ఎవ్వడికీ భయపడకూడదు", "నేను గంగూబాయి.. ప్రెసిడెంట్ కామాటిపుర. మీరు కుమారి అంటూనే ఉన్నారు. నన్ను ఎవరూ శ్రీమతి చేసిందే లేదు" అని చెప్తున్న డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక గంగూబాయి కథ విషయానికి వస్తే.. ఆమె చిన్నప్పుడే ఓ కుర్రాడితో ప్రేమలో పడుతుంది. వాళ్లు ఇంటి నుంచి పారిపోయి ముంబైకి చేరుతారు. అక్కడ కామాటిపురలోని ఒక వేశ్యాగృహంలో గంగూబాయిని రూ.500 రూపాయలకు అమ్మేసి పారిపోతాడా ప్రియుడు. ఆ తర్వాత ఆమె కన్నీళ్లింకేలా ఏడ్చినప్పటికీ చివరకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. ఈ క్రమంలో పెద్ద డాన్ అయిన కరీం లాల్‌కు చెందిన వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయడం, దీన్ని సహించలేకపోయిన గంగూబాయి డాన్‌ను కలవడం, అతడు రాఖీ కట్టించుకుని రక్ష ఇవ్వడం.. తర్వాత ఆమె వేశ్యాగృహాల యజమానిగా ఎదగం చకచకా జరిగిపోతాయి. సంజయ్ లీలా భన్సాలీ ఈ కథను పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. అజయ్ దేవ్‌గణ్ కరీం లాలా పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న రిలీజ్ అవుతోంది. చదవండి: గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. ఖరీదైన ఫోన్ పోగొట్టుకున్న అల్లు అర్జున్! -
ఆలియా భట్‌కి షాకిచ్చిన ముంబై కోర్టు
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. గంగూబాయ్ కతియావాడి టైటిల్ రోల్లో ఆలియాభట్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని ఆమె నలుగురు దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. సినిమా కథాంశం చనిపోయిన తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది. మాఫియా క్వీన్‌గా పేరు పొందిన ముంబయ్‌లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముంబయ్ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్ వేశారు.గంగూబాయ్ పాత్రను ఆలియా చేస్తున్నారు. అయితే ఈనెల ప్రారంభంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చినందున మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. పాట కోసం బ్రేక్ -
గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
గంగుబాయి కథ ఒక సినిమాకు తక్కువ కాదు. అందుకే అది ఇప్పుడు సినిమా అయ్యింది. గుంగుబాయి కతియావాడి ముంబై కామాటిపురాకు మకుటం లేని మహారాణి. కరీం లాలా అనే మాఫియా డాన్‌కు రాఖీ కట్టడంతో అతని అండ దొరికి కామాటిపురాను ఏలింది. అయితే ఆమె జీవితాంతం వేశ్యలకు సాయం చేయడానికే చూసింది. అందుకే నేటికీ ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతుందని టాక్. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన గంగుబాయి బయోపిక్ కూడా అదే డేట్‌కు రిలీజ్ కానుంది. ఆ కలెక్షన్ల క్లాష్ కంటే గుంగుబాయి చరిత్రే ఎక్కువ ఆసక్తికరం. చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో. మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధ పెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియ చేసేవి... ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు. నేడు చరిత్ర నుంచి ఏరుతున్న పుటలు. దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ అలాంటి మరొక పుటను వెతికి పట్టుకున్నాడు. దాని పేరు ‘గుంగుబాయి కతియావాడీ’. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్ నటించింది. ఇంటి నుంచి పారిపోయి గుంగుబాయి కథ ఆసక్తికరమైనది. ఆమెది గుజరాత్‌లోని కతియావాడీ. వాళ్లది లాయర్ల కుటుంబం అని చెబుతారు. గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్‌గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది. ప్రతిఘటన... లొంగుబాటు వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని తుదకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కాని సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్‌వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే నాటి పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమెను చాలారోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది. అయితే మెల్లగా కోలుకుని తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. అంతే కాదు ‘కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా’ అని హెచ్చరించాడు. ఇది గంగుబాయికి పెద్ద వరం అయ్యింది. ఆమె కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది. మహా ప్రాభవం కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. ఆమెకు ఆరోజుల్లోనే బెంట్లి కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. అయితే ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతే కాదు వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో కనిపిస్తాయి. సినిమాలో కథ ఈ సినిమా కథను సంజయ్ లీలా బన్సాలీ పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. ఆలియా భట్ ఈ క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తోంది. అజయ్ దేవ్‌గణ్ ‘కరీం లాలా’ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. సినిమాలూ వచ్చాయి. కాని గుంగుబాయి లాంటి వ్యక్తి గురించి వస్తుండటం వల్ల దీని గురించి కుతూహలం ఏర్పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలను బట్టి జూలై 30న దీనిని విడుదల చేయనున్నారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా అదే రోజు కావచ్చని అంచనా. కనుక రెండు సినిమాలు కలెక్షన్ల పోటీని ఎదుర్కోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
హమ్మయ్యా... ఆలియా!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఆస్పత్రిలో చేరారనే వార్త ఆమె అభిమానులను కలవరపెట్టింది. అస్వస్థతకు గురైన ఆమె ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ‘హమ్మయ్యా..!’ అనుకున్నారు ఫ్యాన్స్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంలో నటిస్తున్నారు ఆలియా భట్. ఈ సినిమా చిత్రీకరణలో ఉన్న ఆలియా హైపర్ అసిడిటీ, అలసట, వికారంతో బాధపడటంతో వెంటనే ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన ఆలియా తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొన్నారట. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్‌కి జోడీగా ఆమె కనిపించనున్నారు. -
ఆసుపత్రి పాలైన 'ఆర్ఆర్ఆర్' భామ..
ముంబై: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ భామ అలియా భట్ స్వల్ప అస్వస్థతకు లోనైంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'గంగూబాయి కతియావాడి' చిత్రీకరణ సందర్భంగా ఆమె హైపరాసిడిటీ, అలసట, వికారంతో బాధపడటంతో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. గంగూబాయి చిత్ర యూనిట్ అందించిన సమాచారం ప్రకారం.. జనవరి 17న ముంబైలో జరిగిన షూటింగ్లో పాల్గొన్న ఆలియా.. స్వల్ప అస్వప్థతకు లోనుకావటంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాధమిక చికిత్స తీసుకున్న అనంతరం, అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, గంగూబాయి చిత్రం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ రాజ్, శాంతను మహేశ్వరి, సీమా పహ్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ గల్లీబాయ్ హీరోయిన్.. గంగూబాయితో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్రా', రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలావుండగా, ఆలియా ఇటీవలే రణబీర్ కపూర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేను ఆస్వాదించి ముంబైకి తిరిగి వచ్చింది. హాలిడేకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. -
దీపావళికి గంగూభాయ్
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొత్త చిత్రం కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారారు ఆలియా భట్. ‘గంగూభాయ్ కతియావాడి’ చిత్రంలో టైటిల్ రోల్లో నటిస్తున్నారు ఆలియా. 80లలో గంగూభాయ్ మాఫియాను ఎలా నడిపారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కోవిడ్ వల్ల ఎక్కువమందితో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను చిత్రీకరించడం కుదర్లేదు. తాజాగా ఆ సన్నివేశాలను ఇప్పుడు షూట్ చేస్తున్నారు. గంగూభాయ్ పవర్ఫుల్ ప్రసంగాలు ఇస్తున్న సన్నివేశాలను ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. హ్యూమా ఖురేషీ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తారని టాక్. ఈ సినిమాను దీపావళికి థియేటర్స్‌లోకి తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
అలియా భట్, భన్సాలీలపై కేసు
గంగూబాయ్ కతియావాడి సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు, టైటిల్ రోల్ పోషిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మీద కేసు నమోదైంది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. ఈ నేపథ్యంలో కథపై అభ్యంతరం తెలుపుతూ గంగూబాయ్ కతియావాడి కుమారుడు బాబూజీ రాజీ షా కోర్టుకెక్కారు. అలియా, సంజయ్‌లతో పాటు 'ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీ, సినిమాకు సహకరించిన రిపోర్టర్ జేన్ బోర్గ్స్ పైన బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం తమ ఆత్మ గౌరవాన్ని, స్వేచ్ఛను దెబ్బ తీయడంతో పాటు పరువుకు భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రచురణలను నిలిపివేయడంతో పాటు దీని ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను సైతం ఆపేయాలని కోరారు. (చదవండి: ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి) ఈ విషయంపై బాబూజీ రాజీ షా తరపు న్యాయవాది నరేంద్ర దూబే మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రోమో రిలీజైనప్పటి నుంచి షా, అతడి కుటుంబం గురించి వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అతడు ఉంటున్న ప్రదేశంలో సైతం వేధింపులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై దాడి జరగ్గా కాలు ఫ్రాక్చర్ అయింది. మరోవైపు వేశ్య కుటుంబం అంటూ షా, అతడి బంధువులను ఎగతాళి చేస్తున్నారు' అని పేర్కొన్నారు. సినిమాలో మహిళను అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. కాగా దీనిపై స్పందించాల్సిందిగా కోరుతూ.. కోర్టు చిత్రయూనిట్‌కు జనవరి ఏడు వరకు గడువునిచ్చింది. (చదవండి: వైరల్: కలిసి నటిస్తున్న మహేశ్, రణ్వీర్!) -
గంగూభాయ్ బిజీబిజీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడీ’. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వివిధ వయసుల్లో ఉన్న పాత్రల్లో ఆలియా కనిపిస్తారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించారు. ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. లాక్డౌన్ ముందు సుమారు 250 మంది యూనిట్‌తో చిత్రీకరణ జరిపారు. తాజాగా వంద కంటే తక్కువ మందితో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఏకధాటిగా రాత్రి పగలు చిత్రీకరణలో గంగూభాయ్ టీమ్ బిజీబిజీగా ఉంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. -
‘డైటింగ్‌లో ఉన్నాను కేక్ వద్దు’
ఆలియా భట్, ఆమె సోదరి షాహీన్ మంగళవారం తమ ఇంట్లో పని చేసే మహిళ రషీదా పుట్టినరోజును జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను రషీదా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిలో ఆలియా, ఇతర సభ్యులతో కలిసి దగ్గరుండి రషీదాతో క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేయడం చూడవచ్చు. ఆలియా, షాహీన్, ఇతరులు రషీదా కేక్ కట్ చేస్తుండగా హ్యాపీ బర్త్ డే పాడారు. అనంతరం రషీదా.. ఆలియాకు కేక్ తినిపించబోతుండగా.. ఆమె వారించి తాను మళ్లీ డైటింగ్ ప్రారంభించానని చెప్పడం వీడియోలో చూడవచ్చు. View this post on Instagram My dream birthday A post shared by Rashida Shaikh (@rashidamd132) on Jun 8, 2020 at 11:46am PDT ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గంగూబాయి ఖథియావాడి’. ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హుస్సైన్ జెదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గంగూభాయిగా టైటిల్ రోల్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని ఇప్పటికే ఆలియా సంతోషం వ్యక్తం చేసింది. లాక్డౌన్ అనంతరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
షూటింగ్లో పాల్గొన్న అక్షయ్ కుమార్
ముంబై: లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు నిలిచిపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవచ్చంటూ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్‌లకు కూడా అనుమతిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆంక్షలు ఎత్తేస్తారా? అని సినీ నటులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఓ చిత్ర యూనిట్ మాత్రం చిత్రీకరణలో పాల్గొంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ఆర్ బల్కీ ముంబైలోని కమలిస్తాన్ స్టూడియోలో దర్శనమిచ్చారు. పరిమిత సిబ్బంది మధ్య రెండు గంటల పాటు షూటింగ్ నిర్వహించారు. కాకపోతే ఇది సినిమా షూటింగ్ కాదు, ప్రభుత్వ ప్రకటన చిత్రీకరణ. (మీ సినిమాలు మాకొద్దు!) ఈ విషయం గురించి ఎఫ్‌డబ్ల్యూఐసీఈ(ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్) జనరల్ సెక్రటరీ అశోక్ దుబే మాట్లాడుతూ.. "గంగూభాయ్ కథియావాడి చిత్రబృందం షూట్ కోసం పోలీసుల దగ్గర అనుమతులను తీసుకుంది. పోలీస్ కమిషనర్‌కు లేఖ రాయగా అందుకు ఆయన అంగీకరించారు. అనంతరం మమ్మల్ని సంప్రదించడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ షూటింగ్‌కు అనుమతించాం. పైగా ఇది ప్రభుత్వ ప్రకటన కాబట్టి ఆటంకం కలిగించలేదు" అని తెలిపారు. అలాగే లాక్డౌన్ తర్వాత మొదలయ్యే తొలి షూటింగ్ గంగూబాయి కథియావాడి చిత్రందే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీని గురించి ఆర్ బల్కీ మాట్లాడుతూ.. 'లాక్డౌన్ తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించేందుకు అక్షయ్‌పై ప్రకటన చిత్రీకరించాం. అన్ని నిబంధనలు పాటిస్తూనే షూటింగ్ పూర్తి చేశాం' అని స్పష్టం చేశాడు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి: కేసీఆర్) View this post on Instagram Back on set! #AkshayKumar takes permission to shoot for a public service film to be directed by #RBalki. A post shared by Filmfare (@filmfare) on May 25, 2020 at 4:27am PDT -
గుంగూబాయి కష్టాలు
గుంగూబాయి ఇరుకుల్లో పడిందని బీ టౌన్ టాక్. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ముంబై మాఫియా క్వీన్, గ్యాంగ్‌స్టర్‌గా చెప్పుకోబడిన గుంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. టైటిల్ పాత్రలో ఆలియాభట్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం 1970 కాలం నాటి ముంబైలోని కామాటిపుర సెట్‌ను ఓ స్టూడియోలో ఏర్పాటు చేశారు చిత్రబృందం. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్‌కు వీలుపడలేదు. కానీ స్టూడియో నిర్వాహకులకు మాత్రం అద్దె చెల్లిస్తూనే ఉన్నారట. ఒకవేళ వచ్చే నెల లాక్డౌన్ ఎత్తివేసినా షూటింగ్స్ వెంటనే స్టార్ట్ అవుతాయన్న గ్యారంటీ లేదు. పరిస్థితులు చక్కబడి చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం అయితే అప్పటివరకు అద్దె కట్టడం, ఒకవేళ వర్షాలు పడి సెట్ పాడైపోతే రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా అవుతుందట. అద్దె కట్టుకుంటూ వెళ్లి, చివరికి వర్షాలకు సెట్ పాడైపోతే మళ్లీ వెయ్యాల్సిందే. అందుకే సెట్‌ను ధ్వంసం చేసి, షూటింగ్ అవసరమనుకున్నప్పుడు సెట్‌ను వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అనుకుంటున్నారట భన్సాలీ. అప్పుడు అద్దె కూడా కట్టాల్సిన పని లేదన్నది ఆయన ఆలోచన అని బాలీవుడ్ వర్గాల కథనం. -
గుంగూబాయ్కి దీపిక స్పెషల్
మాఫియా క్వీన్ గంగూబాయ్ కోసం దీపికా పదుకోన్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని బాలీవుడ్ తాజా వార్త . సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గుంగూబాయ్ కతియావాడి’. ఈ చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్. ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గుంగూబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. కథ రీత్యా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కి స్కోప్ ఉందట. ఈ పాట కోసం దీపికా పదుకోన్‌ను సంప్రదించారట. ఈ సినిమాకు ముందు దీపికా పదుకోన్‌కు ‘పద్మావత్’ రూపంలో మంచి హిట్ ఇచ్చారు భన్సాలీ. అందుకని ‘గుంగూబాయ్’లో ప్రత్యేక పాట చేయడానికి దీపిక సై అంటారని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
కంగారేం లేదు
ఆలియా భట్ తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ చిత్రీకరణలో ఆమె గాయపడ్డారనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఆలియా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ‘త్వరగా కోలుకోండి’ అని సోషల్ మీడియాలో ప్రేమ పరామర్శలు పోస్ట్ చేశారు. ‘‘కంగారేం లేదు. నేను గాయపడలేదు’’ అని స్పష్టం చేశారు ఆలియా. ‘‘నేను సెట్లో గాయపడ్డాననే వార్తల్లో నిజం లేదు. పాత గాయమే మళ్లీ తిరగబెట్టింది. దాంతో ఒక రోజు విశ్రాంతి తీసుకున్నాను’’ అని ఆలియా పేర్కొన్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి...’, రణ్‌బీర్‌తో ‘బ్రహ్మాస్త్ర’, రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సిని మాలు చేస్తున్నారు ఆలియా భట్. -
కొత్తగా వచ్చారు!
కేవలం మన సినిమాల ప్రభావమే కాదు.. మన సంక్రాంతి పండగ ఎఫెక్ట్ బాలీవుడ్‌పై కూడా పడినట్లుంది. కొన్ని హిందీ సినిమాల ఫస్ట్‌లుక్, కొత్త పోస్టర్స్ మన సంక్రాంతి పండగ సమయంలోనే విడుదలై హిందీ సినిమా అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. బాలీవుడ్ యువ కథానాయిక ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. ‘షేర్ షా’ చిత్రం కోసం సైనికుడిగా మారి సరిహద్దుల్లో శత్రువులపై వీరోచిత పోరాటం చేస్తున్నారు సిద్దార్థ్ మల్హోత్రా. విష్ణువర్థన్ దర్శకత్వం. కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన పరమవీర చక్ర కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. గురువారం (జనవరి 16) సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘షేర్ షా’ చిత్రం ఈ ఏడాది జూలై 3న విడుదల కానుంది. దాదాపు 11 ఏళ్ల క్రితం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇంతియాజ్ అలీ. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. వరుణ్ ధావన్ తర్వాతి చిత్రానికి ‘మిస్టర్ లేలే’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కానుంది. మరో సినిమా ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం ‘గో గోవా గాన్’కి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన దినేష్ విజన్ వెల్లడించారు. ఇంకా మరికొన్ని బయోపిక్‌లు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ప్రకటనలు గత మూడు రోజుల్లో వెల్లడి కావడం విశేషం. సిద్ధార్ధ్ మల్హోత్రా అలియాభట్ -
గంగూబాయిగా ఆలియా.. పవర్ఫుల్ ఫస్ట్‌లుక్
ముంబై: క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గంగూబాయి ఖథియావాడి’. ఈ సినిమాలోని ఆలియా ఫస్ట్‌లుక్ పోస్టర్లను తాజాగా చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లలో పవర్ఫుల్ స్టన్నింగ్ లుక్‌తో ఆలియా అదరగొట్టేసింది. ఈ పోస్టర్లలో ఆలియా యంగర్లుక్తోపాటు.. నుదుటను పెద్ద తిలకం ధరించి.. ముక్కుపుడకతో గంభీరంగా కనిపిస్తున్న లుక్‌ను కూడా చూడొచ్చు. సల్మాన్ ఖాన్‌తో అనుకున్న ‘ఇన్షా అల్లా’ సినిమా కొన్ని విభేదాల కారణంగా ఆగిపోవడంతో భన్సాలీ వెంటనే ఆలియాతో ‘గంగూబాయి ఖథియావాడి’. సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హుస్సైన్ జెదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గంగూభాయిగా టైటిల్ రోల్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని ఇప్పటికే ఆలియా సంతోషం వ్యక్తం చేసింది.