
Alia Bhatt Gangubai Kathiawadi Trailer Released: ఆలియా భట్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’.ఇప్పటికే కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే.. ఎందుకంటే అక్కడ గంగూబాయ్ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.
ఇందులో గంగూబాయ్‌గా ఆలియా భట్ నట విశ్వరూపం చూపించిందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో నివసించే సాధారణ అమ్మాయి ఒక బలమైన రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగిందన్నదే ఈ కథ. అజయ్ దేవగణ్, హుమా ఖురేషి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
“మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై” పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ బలమైన, సంక్లిష్టమైన గంగూబాయ్ పాత్రలో ఆలియా అద్భుతంగా నటించదని స్పష్టమవుతుంది. ఇప్పటికే సమంత, తమన్నా, జాహ్నవి, అనుష్క శర్మ సహా పలువురు హీరోయిన్స్ ట్రైలర్‌లో ఆలియా నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మొత్తంగా ఈ సినిమాపై ఇప్పుడు బీటౌన్ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment