దుబాయ్‌లో జరుగుతున్న ఐఫా-2023 అవార్డుల కార్యక్రమంలో ఆలియా భట్ మూవీ సత్తా చాటింది. ఆలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' అవార్డులు కొల్లగొట్టింది. ముంబయిలోని కామాటిపుర నేపథ‍్యంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఐఫా అవార్డుల్లో మూడు విభాగాల్లో ఎంపికైంది. ఈ సినిమా తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా-2 రెండు అవార్డులు దక్కించుకుంది.
(ఇది చదవండి: 15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి)
దుబాయ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. దక్షిణాది నుంచి కమల్ హాసన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సల్మాన్‌ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి పాల్గొన్న ఈ వేడుకలో టెక్నికల్ అవార్డులను అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అవార్డులను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి దక్కించుకుంది.
(ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ)
Comments
Please login to add a commentAdd a comment