Pakistani Actor Book Entire Theatre Alia Bhatt Gangubai Kathiawadi - Sakshi
Sakshi News home page

Gangubai Kathiawadi Movie: అభిమానంతో థియేటర్ మొత్తం బుక్‌ చేసిన పాకిస్తాన్‌ మోడల్

Published Thu, Mar 24 2022 3:07 PM | Last Updated on Thu, Mar 24 2022 5:50 PM

Pakistani Actor Book Entire Theatre Alia Bhatt Gangubai Kathiawadi - Sakshi

Pakistani Actor Book Entire Theatre Alia Bhatt Gangubai Kathiawadi: బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌ ఇటీవల నటించి మెప్పించిన చిత్రం 'గంగూబాయి కతియవాడి'. బీటౌన్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. మాఫీయా క్వీన్‌, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్‌ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. దీంతో అలియాకు ఉన్న అభిమానులు సంఖ్య ఎల్లలు దాటింది. భారత సరిహద్దులను దాటి మించిపోయింది. ఈ బ్యూటీ నటించిన 'గంగూబాయి కతియవాడి' చిత్రం చూసేందుకు ఒక అభిమాని ఏకంగా థియేటర్‌నే బుక్‌ చేశాడు. 

పాకిస్తాన్‌కు చెందిన మోడల్‌, యాక్టర్‌ మునీబ్ బట్‌ అలియా భట్‌కు వీరాభిమాని. ఈ అభిమానంతోనే 'గంగుబాయి కతియవాడి' మూవీని తన భార్యతో కలిసి చూసేందుకు మొత్తం థియేటర్‌నే బుక్‌ చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. అనంతరం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అయింది. దీంతో అలియా భట్‌ అనేక ఫ్యాన్‌  పేజీల్లో ఈ పోస్ట్‌ దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే కామాఠిపురలోని రెడ్‌లైట్‌ ఏరియాలో గంగూబాయి అనే యువతి మాఫీయా క్వీన్‌గా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిందే 'గంగూబాయి కతియవాడి' చిత్రం. 'మాఫియా క్వీన్‌ ఆఫ్‌ ముంబై' అనే పుస్తకంలోని 'గుంగూబాయి హర్జీవందాస్‌' నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement