Alia Bhatt Watches Gangubai Kathiawadi With Pet Edward On Saturday, Video viral - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఆసక్తికర వీడియో షేర్‌ చేసిన కొత్త పెళ్లి కూతురు ఆలియా

Published Sat, May 7 2022 4:12 PM | Last Updated on Sat, May 7 2022 4:31 PM

Alia Bhatt Watches Gangubai Kathiawadi With Pet Edward On Saturday - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్‌ వికెండ్‌ను ఇంట్లోనే ఎంజాయ్‌ చేస్తుంది. షూటింగ్‌ సెలవు సందర్భంగా తన పెట్‌ క్యాట్‌తో కలిసి ఓటీటీలో గంగూబాయ్‌ కతియవాడి మూవీ చూస్తోన్న వీడియోను తాజాగా షేర్‌ చేసింది.  ఈ సందర్భంగా ఆలియా ‘శనివారం గంగూ, ఎడ్వర్డ్స్‌తో ఇలా’ అంటూ తన టీవీ ఎరియా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా రణ్‌బీర్‌ షూటింగ్‌లో భాగంగా ఇటీవల దుబాయ్‌ వెళ్లాడు. దీంతో కొత్త పెళ్లి కూతురైన ఆలియా ఒంటరిగా వీకెండ్‌ను ఇంట్లోనే ఇలా గడిపేయడంతో ఈ వీడియో ఆసక్తిని సంతరించుకుంది. 

ఇదిలా ఉంటే ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రం గంగూబాయ్‌ కతియావాడి ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 26న నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అజయ్‌ దేవగణ్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న థియేటర్లో రిలీజైంది.

విడుదలైన మూడు వారాల్లోనే ఈమూవీ రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇప్పుడు ఓటీటీలో సైతం ఈ మూవీ దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ నెటిఫ్లిక్స్‌లో అత్యథిక వ్యూస్‌ తెచ్చుకున్న నాన్‌ ఇంగ్లీష్‌ మూవీగా నిలిచింది. ఒక్క వీక్‌లోనే ఈమూవీని 13.81 మిలియన్ల గంటల టాపు వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో(కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలో) ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 చిత్రాల్లో ప్రదర్శించబడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement