Top Bollywood Actresses Who Rejected Gangubai Kathiawadi Movie - Sakshi
Sakshi News home page

Alia Bhatt: గంగూభాయ్‌ కథియావాడికి నో చెప్పిన హీరోయిన్లు ఎవరంటే?

Published Wed, Mar 2 2022 6:55 PM | Last Updated on Wed, Mar 2 2022 7:40 PM

Gangubai kathiawadi: Three Heroines Rejected This Movie - Sakshi

పాన్‌ ఇండియా యాక్టర్‌ కావాలనే కలకు అప్పుడే పునాదులు వేసుకుంటోంది ఆలియా భట్‌. శ్రీదేవిలా ప్రతి భాషలోనూ స్టార్‌ హీరోయిన్‌ కావాలనుకుంటున్న ఆలియా నటించిన తాజా చిత్రం గంగూభాయ్‌ కథియావాడి. సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసి పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై జయంతీలాల్‌ గడ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. సౌత్‌లో గంగూభాయ్‌ హడావుడి పెద్దగా కనిపించకపోయినా బాలీవుడ్‌లో మాత్రం బాగానే సక్సెస్‌ అయింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.57 కోట్ల దాకా వసూలు చేసింది. కుర్ర హీరోయిన్‌ మాఫియా క్వీన్‌గా నటించగలదా? అన్న అనుమానాలను సైతం పటాపంచలు చేస్తూ అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

నిజానికి గంగూభాయ్‌ పాత్ర కోసం ముందుగా ఆలియాను అనుకోలేదంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. ఈ సినిమాను ముందుగా ముగ్గురు హీరోయిన్లు వదిలేసుకున్నారట! దీపికా పదుకొనేతో తీద్దామనుకుంటే అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టుల్లో ఉండటంతో నో చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రాను సంప్రదిద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ఈ స్టోరీకి మిమ్మల్ని అనుకుంటున్నారట అని ఓ మీడియా ఛానల్‌ అడగ్గా.. నా దగ్గరకు ఎవరూ ఆ స్టోరీతో రాలేదు. ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి హిందీ సినిమాలను అంగీకరించలేను అని తేల్చి చెప్పేసింది.

ఈ ఇంటర్వ్యూ చూశాక ఆమె దగ్గరకు వెళ్లకుండానే డ్రాప్‌ అయ్యారట నిర్మాతలు. రాణీ ముఖర్జీకి ఈ పాత్ర పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఆమెను సంప్రదించారట. ఆమె గతంలో సంజయ్‌ లీలా సినిమాల్లోనూ నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయనని తేల్చేసిందట. అలా చివరగా ఈ అవకాశం ఆలియాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం, గంగూభాయ్‌గా ఆలియా అదరగొట్టేసింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను సైతం రఫ్ఫాడించగలనని నిరూపించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement