Deepika Padukone To Play Parvati In Brahmastra 2 Movie | Ranbir Kapoor | Alia Bhatt - Sakshi
Sakshi News home page

Brahmastra 2 Movie: పార్వతిగా దీపికా పదుకొణె, ఏ సినిమాలో అంటే..

Published Tue, Jul 19 2022 9:16 AM | Last Updated on Tue, Jul 19 2022 9:43 AM

Deepika Padukone To Play Parvati In Brahmastra 2 Movie - Sakshi

రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. పౌరాణిక పాత్రలతో ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగం ‘బ్రహ్మస్త్ర’: శివ’. సెప్టెంబర్‌ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌ దర్శకుడు రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపిస్తారు. అలాగే ఈ చిత్రం చివర్లో దీపికా పదుకోన్‌ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఈ పాత్ర ‘బ్రహ్మస్త్ర’ రెండో భాగంలోనూ కొనసాగుతుందని సమాచారం.

తొలి భాగంలో రణ్‌బీర్‌–ఆలియా చేసిన శివ–ఇషా పాత్రలు కీలకంగా ఉంటాయి. వీటితో పాటు రెండో భాగంలో మరో రెండు పాత్రలు మహాదేవ్‌–పార్వతి కూడా కీలకంగా నిలుస్తాయట. పార్వతి పాత్రకు దీపికా పదుకోన్‌ని ఎంపిక చేశారని భోగట్టా. గతంలో అయాన్‌ దర్శకత్వంలో ‘ఏ జవానీ హై దివానీ’ (2013)లో కథానాయికగా నటింన దీపికా ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్‌ 2 కథ విని, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఆమె చేయనున్న పార్వతి పాత్రకు  సంబంధించి త్వరలో లుక్‌ టెస్ట్‌ జరగనుందని బాలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement