Alia Bhatt Looks For Gangubai Kathiawadi Promotions: బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ భట్ వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా తన నటనతోనే అభిమానుల్ని సంపాదించుకుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' వంటి సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్న ఆలియా ఇప్పుడు 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్.. ఆలియా నట విశ్వరూపాన్ని చూపించింది. డైలాగ్ డెలివరీలోనూ స్టార్ హీరోలకు సమానంగా సత్తా చాటింది. ఈ సినిమాతో ఆలియా బాలీవుడ్ నెంబర్1 హీరోయిన్‌గా చక్రం తిప్పుదింటూ ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం భావిస్తున్నారు.
ట్రైలర్‌తోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో చీరకట్టుతో మరింత మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ ప్రమోషన్స్ కోసం కేవలం చీరకట్టులో తళుక్కుమంటుంది. ఒక్కో చీర ధర సుమారు 21-29వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఫోటోలను మీరూ చూసేయండి మరి.
Comments
Please login to add a commentAdd a comment