
Samantha Lauds Alia Bhatt Performance In Gangubai Kathiawadi: గ్లామర్ రోల్స్తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది బాలీవుడ్ క్యూట్గుమ్మ అలియా భట్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో అలరించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో అలియా వేశ్యగా నటించడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది.
ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఇందులో అలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత అలియా నటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '#గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.' అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది సామ్. ఇంకా అనన్య పాండే, ఆదిత్య సీల్, సోఫీ చౌదరి వంటి తారలు కూడా అలియా నటనపై ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment