Performance appraisal
-
ఉత్తముల లక్షణం
తమ ప్రతిభని ఎవరు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రదర్శిస్తారు ఉత్తములు. అంతే కాని తమకి ఉన్న పాండిత్యాన్ని అంతా ఎవరి వద్ద పడితే వారి వద్ద ప్రదర్శించరు.ఒకటవ తరగతి చదివే పిల్లలకి వ్యాకరణం బోధిస్తే కంగారు పడి మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి ఇష్టపడరు. వారికి అక్షరాలు చాలు. అంత మాత్రానికే తమకి ఎంతో తెలుసు అనుకుంటారు. తనకి ఎంత తెలుసు అని కాదు, ఎదుటివారికి ఏమి కావాలి? ఎంత వరకు అర్థం చేసుకోగలరు? అన్నది ప్రధానం. ఈ మాట తుంబురుడి గాన విద్యా ప్రావీణ్యం చూసిన నారదుడు అనుకున్నది. ఒక పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల కోసం పాడ మంటే రాగం, తానం, పల్లవి ఆలపిస్తే వారు జన్మలో శాస్త్రీయ సంగీతం జోలికి వెళ్లరు. అయినా ప్రతివారి వద్ద తమ ప్రతిభని ప్రదర్శించ వలసిన అవసరం లేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదితే కొరుకుడు పడటం లేదా? సహాయం చేయనా? అని అడుగుతాడు. అంతేకాదు ఎవరి వద్ద క్లుప్తంగా చె΄్పాలి, ఎవరి వద్ద వివరంగా చె΄్పాలి అన్నది కూడా తెలియ వలసిన అవసరం ఉంది. మాట నేర్పరితనంలో ఇది ప్రధానమైన అంశం. దీనికి హనుమ గొప్ప ఉదాహరణం. సీతాదేవిని చూచి వచ్చిన హనుమ తన కోసం ఎదురు చూస్తున్న అంగదాదులతో ముందుగా ‘చూడబడినది నా చేత సీత’ అని క్లుప్తంగా చెప్పి, సావకాశంగా కూర్చొన్న తరువాత వారి కోరిక పైన తాను బయలుదేరిన దగ్గరనుండి ఆ క్షణం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చె΄్పాడు. అందులో తన ప్రతాపం చాలా ఉంది. అది అంతా సత్యమే! అది విని ముఖ్యంగా యువరాజు, ఈ బృందనాయకుడు అయిన అంగదుడు, తన శక్తిని గుర్తించి, గుర్తు చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించిన జాంబవంతుడు, కపులు సంతోషిస్తారు. పైగా కపివీరులు అవన్నీ తామే చేసినట్టు ΄÷ంగి ΄ోయారు. అదే విషయం సుగ్రీవ శ్రీరామచంద్రులతో క్లుప్తంగా చె΄్పాడు. వారు తన యజమానులు. వారి వద్ద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి సమయం విలువైనది. పైగా రాజుల వద్ద దాసులు తమ ఘనత చెప్పుకోకూడదు. అది రాచమర్యాద కాదు. అందుకే తన ప్రతాపం ఎక్కడా మాటల్లో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక్క మాటలో సముద్రం లంఘించి వెళ్ళాను అని తేల్చి వేశాడు. అది మర్యాద మాత్రమే కాదు, వినయశీలత. విరాటరాజు కొలువులో ప్రవేశించటానికి వెడుతున్న పాండవులకు వారి పురోహితుడు ఇచ్చిన సూచనలు అందరికీ ఉపయోగ పడేవే. రాజుకన్న విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించ కూడదు, రాజుగారి భవనాని కన్న పెద్ద, ఎతై ్తన భవనంలో ఉండ కూడదు అన్నవి ఇక్కడ పేర్కొన దగినవి. తమ ఘనత సందర్భానుసారం ప్రకటించాలి. ఎదగటం లేదా ఒదగటం పరిస్థితులను అనుసరించి ఉండాలి. పిడుగుకి బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు ఉండరు తెలివైన వారు. దీనికి చక్కని ఉదాహరణ చెపుతాడు పింగళి సూరన.‘‘ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ’’ అని. చెరువులో నీటి మట్టం పెరిగితే తామర కాడ చుట్లు విచ్చుకొని, పువ్వు గాని, మొగ్గ గాని ఆకు గానీ ఉపరితలం మీద తేలుతాయి. నీరు తగ్గితే కాడ చుట్టలు చుట్టుకొని పువ్వు మాత్రమే నీటి ఉపరితలం మీద ఉంటుంది. నీరు ఎండి΄ోతే దుంపలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి ముడుచుకొని ΄ోయి ఉంటుంది. నీరు నిండితే చిగురిస్తుంది. ఉత్తముల గొప్పతనం కూడా అంతే! – డా. ఎన్. అనంతలక్ష్మి -
మాటలు సరిపోవట్లేదు, ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి: సమంత
Samantha Lauds Alia Bhatt Performance In Gangubai Kathiawadi: గ్లామర్ రోల్స్తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది బాలీవుడ్ క్యూట్గుమ్మ అలియా భట్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో అలరించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో అలియా వేశ్యగా నటించడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఇందులో అలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత అలియా నటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '#గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.' అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది సామ్. ఇంకా అనన్య పాండే, ఆదిత్య సీల్, సోఫీ చౌదరి వంటి తారలు కూడా అలియా నటనపై ప్రశంసలు కురిపించారు. -
మేమేమైనా పిల్లలమా?
వార్షిక పరీక్షలు, పనితీరు మదింపుపై మండిపడుతున్న మంత్రులు ఏపీ సీఎం తీరుపై తీవ్ర అసంతృప్తి హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మంత్రుల్లో తీవ్రఅసహనం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. వార్షిక పరీక్షలు, పనితీరు మదింపు చేస్తామనడంపై ‘మేమేమైనా చిన్న పిల్లలమా?’ అంటూ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మంత్రులందరూ వాపోతున్నారు. మంత్రులు ఏడాది పనితీరుపై స్వీయ నివేదికలను రూపొందించి ముఖ్యమంత్రి ఓఎస్డీ అభీష్టకు పంపించాలనడంపైనా వారు మండిపడుతున్నారు. అభీష్టకు స్వీయ నివేదికలను పంపిస్తే, ఆయనతోపాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పరిశీలించి నివేదిక రూపొందిస్తారా? వాటి ఆధారంగా లోకేష్ మార్కులు వేస్తారా? ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రులు భాగస్వాములు. మంత్రిమండలిలో ముఖ్యమంత్రితోపాటు సమిష్టి నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని మంత్రులకు రాజ్యాంగం దాఖలు పరి చింది. మంత్రిమండలి సమావేశంలో సీఎం, మంత్రులు అనే తారతమ్యాలు ఉండవు. అలాంటి వారిని స్వీయ నివేదికలు అడగడంతోపాటు ఎలాంటి సంబంధం లేని లోకేశ్, ఓఎస్డీ, విశ్రాంత ఐఏఎస్ అధికారి పనితీరు మదింపు చేస్తామనడం జీర్ణించుకోలేకపోతున్నారు. కేబినెట్ సాగే తీరిదేనా? విధానపరమైన నిర్ణయాలతోపాటు ప్రజలకు ప్రయోజనం కార్యక్రమాలు చేపట్టడానికి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. అయితే, సోమవారం కేబినెట్ సాగిన తీరు అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని మంత్రులే వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలపైనా మంత్రులు, ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ సమావేశాలు నిర్వహించడం, మళ్లీ వారం తిరగకుండా అదే అంశంపై సమీక్ష నిర్వహించడం వల్ల సమయమంతా వృధా అవుతోంది. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసి ఫలితాలు సాధించడానికి సమయమే దొరకడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమావేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు ఏ మాత్రం దోహదపడటం లేదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.