
"కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది.." అన్న పవర్‌ఫుల్ డైలాగ్‌తో గంగూబాయి కతియావాడి టీజర్ మొదలైంది. ముంబైలోని కామాటిపురకు మకుటం లేని మహారాణిగా పేరొందిన గంగూబాయి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటించింది. ఇటీవల ఈ సినిమా హిందీ టీజర్ రిలీజ్ కాగా తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో కొత్త లుక్‌లో కనిపిస్తున్న అలియా... "గౌరవంతో బతకాలి, ఎవ్వరికీ భయపడకూడదు, పోలీస్‌కైనా, ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా.. వాడి అమ్మ మొగుడు.. ఎవ్వడికీ భయపడకూడదు", "నేను గంగూబాయి.. ప్రెసిడెంట్ కామాటిపుర. మీరు కుమారి అంటూనే ఉన్నారు. నన్ను ఎవరూ శ్రీమతి చేసిందే లేదు" అని చెప్తున్న డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక గంగూబాయి కథ విషయానికి వస్తే.. ఆమె చిన్నప్పుడే ఓ కుర్రాడితో ప్రేమలో పడుతుంది. వాళ్లు ఇంటి నుంచి పారిపోయి ముంబైకి చేరుతారు. అక్కడ కామాటిపురలోని ఒక వేశ్యాగృహంలో గంగూబాయిని రూ.500 రూపాయలకు అమ్మేసి పారిపోతాడా ప్రియుడు. ఆ తర్వాత ఆమె కన్నీళ్లింకేలా ఏడ్చినప్పటికీ చివరకు వృత్తిని అంగీకరించక తప్పలేదు.
ఈ క్రమంలో పెద్ద డాన్ అయిన కరీం లాల్‌కు చెందిన వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయడం, దీన్ని సహించలేకపోయిన గంగూబాయి డాన్‌ను కలవడం, అతడు రాఖీ కట్టించుకుని రక్ష ఇవ్వడం.. తర్వాత ఆమె వేశ్యాగృహాల యజమానిగా ఎదగం చకచకా జరిగిపోతాయి. సంజయ్ లీలా భన్సాలీ ఈ కథను పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. అజయ్ దేవ్‌గణ్ కరీం లాలా పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న రిలీజ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment