Heroine Oriented Movies That Crossed 100 Crore In Bollywood: హీరో ఒరియెంటెడ్ మూవీస్ సాధారణమే. అవి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా హిట్ కొట్టడం పరిపాటే. కానీ మహిళా ప్రాధాన్యతతో వచ్చే సినిమాలు తక్కువే. ఒకవేళ వచ్చిన హిట్ కొట్టడం అంతా ఈజీ కాదు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వారి చరిష్మా, నైపుణ్యం వారికి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి.
అయితే ఇటీవల 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియా భట్ నటించిన హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రం 'గంగుబాయి కతియావాడి'. ఈ సినిమాలో అలియా తన అందం, అభినయం, డైలాగ్లతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్వైడ్ కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ. 100 కోట్ల మార్క్ దాటిన మహిళా ప్రాధాన్యత గల పలు బాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా !
1. గంగుబాయి కతియవాడి- వారం రోజుల్లో రూ. 100 కోట్ల కలెక్షన్లు
2. తను వెడ్స్ మను రిటర్న్స్ - రూ. 255.3 కోట్లు
3. రాజీ- రూ. 195 కోట్లు
4. నీర్జా- రూ. 131 కోట్లు
5. స్త్రీ- రూ. 130 కోట్లు
Heroine Oriented Movies: 100 కోట్ల క్లబ్లో చేరిన మహిళా ప్రాధాన్యత చిత్రాలు ఇవే..
Published Sat, Mar 5 2022 6:09 PM | Last Updated on Sat, Mar 5 2022 6:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment