Neerja movie
-
100 కోట్ల క్లబ్లో చేరిన మహిళా ప్రాధాన్యత చిత్రాలు ఇవే..
Heroine Oriented Movies That Crossed 100 Crore In Bollywood: హీరో ఒరియెంటెడ్ మూవీస్ సాధారణమే. అవి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా హిట్ కొట్టడం పరిపాటే. కానీ మహిళా ప్రాధాన్యతతో వచ్చే సినిమాలు తక్కువే. ఒకవేళ వచ్చిన హిట్ కొట్టడం అంతా ఈజీ కాదు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వారి చరిష్మా, నైపుణ్యం వారికి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. అయితే ఇటీవల 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియా భట్ నటించిన హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రం 'గంగుబాయి కతియావాడి'. ఈ సినిమాలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్‌వైడ్ కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ. 100 కోట్ల మార్క్ దాటిన మహిళా ప్రాధాన్యత గల పలు బాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా ! 1. గంగుబాయి కతియవాడి- వారం రోజుల్లో రూ. 100 కోట్ల కలెక్షన్లు 2. తను వెడ్స్ మను రిటర్న్స్ - రూ. 255.3 కోట్లు 3. రాజీ- రూ. 195 కోట్లు 4. నీర్జా- రూ. 131 కోట్లు 5. స్త్రీ- రూ. 130 కోట్లు -
పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..!
బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న భామ సోనమ్ కపూర్. కపూర్ ఫ్యామిలీ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనమ్ కెరీర్లో ఒక్క నీర్జా తప్ప ఘన విజయం సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. సినిమా మాట ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం సోనమ్ ఫుల్ యాక్టివ్. తన సినిమాల అప్డేట్స్తో పాటు ఫొటోలను అప్డేట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరును మార్చేసింది. గతంలో ఆనంద్ అహూజాతో వివాహం తరువాత సోనమ్ కపూర్‌గా ఉన్న తన పేరును సోనమ్ కె అహూజాగా మార్చిన సోనమ్, తాజాగా తన పేరును జోయా సింగ్ సోలంకీగా మార్చేసింది. ప్రస్తుతం తన హీరోయిన్గా నటిస్తున్న ది జోయా ఫ్యాక్టర్‌లో సోనమ్ క్యారెక్టర్ పేరు జోయా సింగ్ సోలంకీ అందుకే సినిమా ప్రమోషన్లో భాగంగానే సోనమ్ ఈ పని చేసిందట. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదు!
నీరజ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆ సినిమా విడుదలై.. మంచి సక్సెస్ సాధించిన తర్వాత ఇంతవరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. చేతిలో సినిమాలు లేవని తాను బాగా ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె చెబుతోంది. విమానంలో హైజాకర్ల బారి నుంచి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు తన సొంత ప్రాణాలను పణంగా పెట్టిన నీరజా భానోత్ అనే ఎయిర్ హోస్టెస్ పాత్రలో సోనమ్ నటించిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా సినిమాల్లో మహిళలను చాలా ధైర్యవంతమైన పాత్రలలో చూపిస్తున్నారని, అయినా పారితోషికం విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని వాపోయింది. నీరజ లాంటి సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నా థియేటర్లు దొరకడం లేదని.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి కేవలం 700 స్క్రీన్లలోనే సినిమా విడుదలైందని సోనమ్ చెప్పింది. పరిశ్రమ మనకు ఎంత ఇస్తోందన్నది విషయం కాదని, ప్రేక్షకులు సినిమా చూడాలనుకుంటున్నారా లేదా అనేది చూడాలని అంటోంది. తన సినిమాకు 6 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లు వస్తే.. ఆ డబ్బును నిర్మాత తనకు ఇవ్వాలా అక్కర్లేదా అని అడిగింది. -
'అది తప్ప అంతా సేమ్ టు సేమ్'
ముంబై: చరిత్ర పొడవునా ఒకటిగా ఉండి, 60 ఏళ్ల కిందట విడిపోయిన పాకిస్థానీ, హిందుస్థానీల మధ్య ప్రధాన తేడా ఏంటి? బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మాటల్లో చెప్పాలంటే.. 'రూపం, భాష, వేషం, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం.. అన్నీ సేమ్ టు సేమ్. ఒక్క క్రికెట్ విషయంలోతప్ప! ఇన్ని సిమిలారిటీస్ ఉన్న దేశాల మధ్య కళాసంబంధాలు క్షీణించడానికి రాజకీయపరమైన కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ నిజజీవిత గాథ ఆధారంగా రూపొందించిన 'నీర్ జా' లాంటి సినిమాను పాకిస్థాన్ లో నిషేధించడం దారుణం' అని అంటోదామె. అంతేకాదు, అసలు నీర్ జా సినిమాను ఎందుకు బ్యాన్ చేశారో బాహాటంగా వెల్లడించాలని దాయాది దేశాన్ని డిమాండ్ చేస్తోంది. ఆమె ఆగ్రహం వెనుక బలమైన కారణం ఉంది. అది ఏంటంటే.. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా నీర్ జా ఘన విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సోనమ్.. తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ గంటలుగంటలు లైవ్ చాటింగ్ లు చేస్తోంది. ఆ క్రమంలో పాకిస్థాన్ లోని ఆమె అభిమానులు కూడా 'మేడం.. సినిమా చాలా బాగుంది. మీరు అద్భుతంగా నటించారు' అని కాంప్లిమెంట్లు ఇచ్చారట. పాక్ లో రిలీజ్ కాకున్నా వాళ్లెలా చూశారు చెప్మా? అని ఆరా తీయగా.. ఆ దేశంలో నీర్ జా పైరసీ డీవీడీలు లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్నట్లు తెలుసుకుంది. అంతే.. ప్రెస్ మీట్ పెట్టిమరీ పాక్ ను కడిగేసింది సోనమ్. 'ఇది బాధాకరమైన విషయం. పాకిస్థాన్ తీరు నన్ను నిరాశపర్చింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. రెండువైపులా రాజకీయాలు ఉండొచ్చు. కానీ నేను ముందు నుంచి చెబుతున్నట్లు కళలు, క్రీడా రంగాలకు రాజకీయాలను ముడిపెట్టొద్దు' అని సోనమ్ కపూర్ అభ్యర్థించింది. హైజాకర్ల చెరనుంచి ప్రయాణికులను కాపాడే క్రమంలో తాను ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ హోస్టెస్ నిర్ జా బానోత్ జీవితం ఆధారంగా రూపొందించిన నీర్ జా సినిమా భారత్ లో ఫిబ్రవరి 19న విడుదలైన సంగతి తెలిసిందే. -
'నేను చూసిన మంచి సినిమాల్లో ఇదొకటి'
ముంబై: బాలీవుడ్ సినిమా 'నీర్జా'పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల కాలంలో తాను చూసిన మంచి సినిమాల్లో ఇదొకటి కితాబిచ్చారు. ఈ సినిమా స్ఫూర్తిదాయంగా ఉందని అన్నారు. పరుల హితం కోసం బతకాలి, అవసరమైతే ప్రాణాలు ఫణంగా పెట్టాలన్న సందేశం ఈ సినిమాలో ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తమ పార్టీ నేతలతో కలిసి బుధవారం 'నీర్జా' సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సోనమ్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన 'నీర్జా' సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాపై పాజిటివ్ టాక్ విన్పిస్తోంది. వాస్తవానికి దగ్గర ఉందని, భావోద్వేగాలు కదిలించాయని అంటున్నారు. ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 1986 సెప్టెంబర్ 5న ముంబై-న్యూయార్క్ అమెరికా విమానంలో లిబియా ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించి నీర్జా తన ప్రాణాలు కోల్పోయింది. ఆమె గాథను దర్శకుడు రామ్ మధ్వానీ 'నీర్జా' పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాను పాకిస్థాన్ లో నిషేధించారు. "Neerja" - one of the best movies I have seen in recent past. V inspiring movie. Its msg is - Live for others, die for others — Arvind Kejriwal (@ArvindKejriwal) February 18, 2016