బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న భామ సోనమ్ కపూర్. కపూర్ ఫ్యామిలీ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనమ్ కెరీర్‌లో ఒక్క నీర్జా తప్ప ఘన విజయం సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. సినిమా మాట ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం సోనమ్ ఫుల్ యాక్టివ్. తన సినిమాల అప్‌డేట్స్‌తో పాటు ఫొటోలను అప్‌డేట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.
తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్‌లలో తన పేరును మార్చేసింది. గతంలో ఆనంద్ అహూజాతో వివాహం తరువాత సోనమ్ కపూర్‌గా ఉన్న తన పేరును సోనమ్ కె అహూజాగా మార్చిన సోనమ్, తాజాగా తన పేరును జోయా సింగ్ సోలంకీగా మార్చేసింది. ప్రస్తుతం తన హీరోయిన్‌గా నటిస్తున్న ది జోయా ఫ్యాక్టర్‌లో సోనమ్ క్యారెక్టర్ పేరు జోయా సింగ్ సోలంకీ అందుకే సినిమా ప్రమోషన్‌లో భాగంగానే సోనమ్ ఈ పని చేసిందట. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment