'నేను చూసిన మంచి సినిమాల్లో ఇదొకటి'
ముంబై: బాలీవుడ్ సినిమా 'నీర్జా'పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల కాలంలో తాను చూసిన మంచి సినిమాల్లో ఇదొకటి కితాబిచ్చారు. ఈ సినిమా స్ఫూర్తిదాయంగా ఉందని అన్నారు. పరుల హితం కోసం బతకాలి, అవసరమైతే ప్రాణాలు ఫణంగా పెట్టాలన్న సందేశం ఈ సినిమాలో ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తమ పార్టీ నేతలతో కలిసి బుధవారం 'నీర్జా' సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు.
సోనమ్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన 'నీర్జా' సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాపై పాజిటివ్ టాక్ విన్పిస్తోంది. వాస్తవానికి దగ్గర ఉందని, భావోద్వేగాలు కదిలించాయని అంటున్నారు. ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 1986 సెప్టెంబర్ 5న ముంబై-న్యూయార్క్ అమెరికా విమానంలో లిబియా ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించి నీర్జా తన ప్రాణాలు కోల్పోయింది. ఆమె గాథను దర్శకుడు రామ్ మధ్వానీ 'నీర్జా' పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాను పాకిస్థాన్ లో నిషేధించారు.
"Neerja" - one of the best movies I have seen in recent past. V inspiring movie. Its msg is - Live for others, die for others
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 18, 2016