దీపావళికి గంగూభాయ్‌ | Gangubai Kathiawadi Released in Diwali 2021 | Sakshi
Sakshi News home page

దీపావళికి గంగూభాయ్‌

Published Sun, Jan 17 2021 1:01 AM | Last Updated on Sun, Jan 17 2021 1:01 AM

Gangubai Kathiawadi Released in Diwali 2021 - Sakshi

దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ కొత్త చిత్రం కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారారు ఆలియా భట్‌.  ‘గంగూభాయ్‌ కతియావాడి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు ఆలియా. 80లలో గంగూభాయ్‌ మాఫియాను ఎలా నడిపారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కోవిడ్‌ వల్ల ఎక్కువమందితో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను చిత్రీకరించడం కుదర్లేదు. తాజాగా ఆ సన్నివేశాలను ఇప్పుడు షూట్‌ చేస్తున్నారు. గంగూభాయ్‌ పవర్‌ఫుల్‌ ప్రసంగాలు ఇస్తున్న సన్నివేశాలను ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. హ్యూమా ఖురేషీ ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తారని టాక్‌. ఈ సినిమాను దీపావళికి థియేటర్స్‌లోకి తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement