
Alia Bhatt Reveals Her Marraige With Ranbir Kapoor: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరి పెళ్లి 2020లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
అనంతరం గతేడాది డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా సినిమాల కారణంగా కొన్నాళ్లు తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ క్యూట్ కపుల్ పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.తాజాగా గంగూబాయ్ కతియావాడి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా భట్ తొలిసారిగా తన పెళ్లి విషయంపై స్పందించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రణ్‌బీర్‌తో నా పెళ్లి ఇప్పటికే జరిగిపోయింది. చాలా కాలం క్రితమే నా మైండ్‌లో అతన్ని పెళ్లి చేసేసుకున్నాను(నవ్వుతూ). ఏం జరిగినా దానికి కారణాలుంటాయి. మా పెళ్లి అప్పుడు వాయిదా పడింది. కానీ ఎప్పుడు జరిగినా ఎంతో అందంగా జరుగుతుంది అని భావిస్తున్నా అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఆలియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment