ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్ ఈ వేడుకకు వేదికైంది. ఇక పెళ్లి విషయంలో మొదటి నుంచి అత్యంత గోప్యత పాటించిన ఈ జంట ఎట్టకేలకు తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. సోషల్ మీడియా వేదికగా వివాహానికి సంబంధించిన అత్యంత మధురమైన ఫోటోలను ఆలియా పంచుకుంది.
ఇక అనంతరం తొలిసారిగా భార్యాభర్తలుగా ఆలియా-రణ్‌బీర్‌లు మీడియా ముందుకు వచ్చారు.ఎంతో ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం వెనుతిరిగే క్రమంలో రణ్‌బీర్ ఆలియాను స్వయంగా ఎత్తుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఆలియా-రణ్‌బీర్‌లను చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
#WATCH | Actors Alia Bhatt and Ranbir Kapoor make their first public appearance after tying the knot in Mumbai, today. pic.twitter.com/yQP5bTDnvM
— ANI (@ANI) April 14, 2022
Comments
Please login to add a commentAdd a comment