ముంబై: లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌లు నిలిచిపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవచ్చంటూ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్‌లకు కూడా అనుమతిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆంక్షలు ఎత్తేస్తారా? అని సినీ నటులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఓ చిత్ర యూనిట్ మాత్రం చిత్రీకరణలో పాల్గొంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ఆర్ బల్కీ ముంబైలోని కమలిస్తాన్ స్టూడియోలో దర్శనమిచ్చారు. పరిమిత సిబ్బంది మధ్య రెండు గంటల పాటు షూటింగ్ నిర్వహించారు. కాకపోతే ఇది సినిమా షూటింగ్ కాదు, ప్రభుత్వ ప్రకటన చిత్రీకరణ. (మీ సినిమాలు మాకొద్దు!)
ఈ విషయం గురించి ఎఫ్‌డబ్ల్యూఐసీఈ(ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్) జనరల్ సెక్రటరీ అశోక్ దుబే మాట్లాడుతూ.. "గంగూభాయ్ కథియావాడి చిత్రబృందం షూట్ కోసం పోలీసుల దగ్గర అనుమతులను తీసుకుంది. పోలీస్ కమిషనర్‌కు లేఖ రాయగా అందుకు ఆయన అంగీకరించారు. అనంతరం మమ్మల్ని సంప్రదించడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ షూటింగ్‌కు అనుమతించాం. పైగా ఇది ప్రభుత్వ ప్రకటన కాబట్టి ఆటంకం కలిగించలేదు" అని తెలిపారు. అలాగే లాక్‌డౌన్ తర్వాత మొదలయ్యే తొలి షూటింగ్ గంగూబాయి కథియావాడి చిత్రందే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీని గురించి ఆర్ బల్కీ మాట్లాడుతూ.. 'లాక్‌డౌన్ తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించేందుకు అక్షయ్‌పై ప్రకటన చిత్రీకరించాం. అన్ని నిబంధనలు పాటిస్తూనే షూటింగ్ పూర్తి చేశాం' అని స్పష్టం చేశాడు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి: కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment