Alia Bhatt Get Paid Shocking Remuneration For Gangubai Kathiawadi Report Says - Sakshi
Sakshi News home page

Alia Bhatt Remunareation: అలియా రెమ్యునరేషన్‌ అంత మొత్తమా? టాప్‌ హీరో కంటే చాలా ఎక్కువ!

Published Tue, Mar 1 2022 6:39 PM | Last Updated on Tue, Mar 1 2022 8:16 PM

Alia Bhatt Get Paid Shocking Remuneration For Gangubai Kathiawadi: Report - Sakshi

ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘గంగూభాయ్‌ కతియావాడి’ మూవీకి సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అలరించిన స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తాజా సినిమాతో మరో మెట్టు ఎక్కిందని విశ్లేషకులు చెప్తున్నారు. టాప్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అలియా కళ్లు చెదిరే పారితోషికం తీసుకుందని సమాచారం. 

ఇండియా టుడే వార్త సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూభాయ్‌ సినిమాకు అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంది. దేవ్‌గన్‌ రూ.11 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నాడు. సీనియర్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్‌ క్రైం డ్రామా సినిమా బడ్జెట్‌ రూ.100 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రచయిత హుస్సేన్‌ జైదీ ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ పుస్తకం ఆధారంగా గంగూభాయ్‌ తెరకెక్కింది. 
(చదవండి: ఎనర్జిటిక్​ హీరోకు సరైనోడు విలన్​.. ఆది రోల్​ రివీల్​)

1960 కాలంలో ముంబైలోని కామాఠీపుర రెడ్‌లైట్‌ ఏరియా ప్రధానంగా కథ సాగుతుంది. ఇక స్టార్‌ కిడ్‌ అయిన అలియా.. భన్సాలీ దర్శకత్వంలో నటించాలని తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్‌’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లానని, అయితే ఆ సినిమాలో అవకాశం రాలేదని ఆమె గుర్తు చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా గంగూభాయ్‌ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
(చదవండి: రాధేశ్యామ్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement