
ఆలియా భట్, ఆమె సోదరి షాహీన్ మంగళవారం తమ ఇంట్లో పని చేసే మహిళ రషీదా పుట్టినరోజును జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను రషీదా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిలో ఆలియా, ఇతర సభ్యులతో కలిసి దగ్గరుండి రషీదాతో క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేయడం చూడవచ్చు. ఆలియా, షాహీన్, ఇతరులు రషీదా కేక్ కట్ చేస్తుండగా హ్యాపీ బర్త్ డే పాడారు. అనంతరం రషీదా.. ఆలియాకు కేక్ తినిపించబోతుండగా.. ఆమె వారించి తాను మళ్లీ డైటింగ్ ప్రారంభించానని చెప్పడం వీడియోలో చూడవచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గంగూబాయి ఖథియావాడి’. ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హుస్సైన్ జెదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గంగూభాయిగా టైటిల్ రోల్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని ఇప్పటికే ఆలియా సంతోషం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ అనంతరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment