Alia Bhatt Celebrates Gangubai Kathiawadi Success With Burger And Fries Deets Here - Sakshi
Sakshi News home page

Alia Bhatt Celebrations: 100 కోట్ల క్లబ్‌లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్‌ చేస్తుందంటే ?

Published Fri, Mar 11 2022 1:18 PM | Last Updated on Fri, Mar 11 2022 4:32 PM

Alia Bhatt Celebrates Gangubai Kathiawadi Success With Burger And Fries - Sakshi

Alia Bhatt Celebrates Gangubai Kathiawadi Success With Burger And Fries: బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ తాజాగా నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతియవాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్‌  లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే మాఫీయ క్వీన్‌, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్‌ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. 

చదవండి:  'ఆర్​ఆర్​ఆర్'​ బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్​..

ఇటీవలే ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కి అతిపెద్ద ఓపెనింగ్స్‌ ఇచ్చిన మూడో  చిత్రం గంగూబాయి కతియవాడి. అయితే ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది అలియా భట్‌. అది ఎలా అంటే.. ఒక బర్గర్, ఫ్రైస్‌ తింటూ ఎంజాయ్‌ చేసింది అలియా భట్‌. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్‌స్టా గ్రామ్‌ హ్యాండిల్‌లో గురువారం (మార్చి 10) షేర్‌ చేసింది. ఈ  పోస్ట్‌లో '100 కోట్ల మార్క్‌ దాటినందుకు శుభాకాంక్షలు గంగూబాయి, వేగన్‌ బర్గర్‌ + ఫ్రైతో అలియాకు శుభాకాంక్షలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అని క్యాప్షన్‌ రాసింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement