succes
-
అంధత్వం అడ్డుకాదంటూ.. ఆమె సాధించిన ఘనత ఇదే!
అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది. కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు. ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్‌లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది. దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం. -
మహేశ్ బాబు ఫారిన్ టూర్.. ఎక్కడికంటే ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న మహేశ్ బాబు ఫారిన్ టూర్ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఆయన యూరప్‌లో ల్యాండ్ అయ్యారు. దాదాపు రెండు వారాలు మహేశ్ అక్కడే ఉంటారని సమాచారం. ఫారిన్ ట్రిప్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా షూటింగ్లో మహేశ్‌బాబు జాయిన్ అవుతారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏప్రిల్ నెలాఖరులో కూడా మహేశ్ బాబు ఫారిన్ టూర్‌కు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. చదవండి: సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్.. డైరెక్టర్ రియాక్షన్
Hero Vishwak Sen Bought Luxurious Car: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. తనకిష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల సాకారం చేసుకున్నాడు విశ్వక్. నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. అయితే ఈ కారు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో దిగిన విశ్వక్ సేన్ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. విశ్వక్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. 'ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా' అని సరదాగా కామెంట్ చేశారు. కాగా కుటుంబా కథా చిత్రమైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతం అందించారు. చదవండి: ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్ View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
100 కోట్ల క్లబ్లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ?
Alia Bhatt Celebrates Gangubai Kathiawadi Success With Burger And Fries: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతియవాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే మాఫీయ క్వీన్, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్.. ఇటీవలే ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కి అతిపెద్ద ఓపెనింగ్స్ ఇచ్చిన మూడో చిత్రం గంగూబాయి కతియవాడి. అయితే ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది అలియా భట్. అది ఎలా అంటే.. ఒక బర్గర్, ఫ్రైస్ తింటూ ఎంజాయ్ చేసింది అలియా భట్. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో గురువారం (మార్చి 10) షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో '100 కోట్ల మార్క్ దాటినందుకు శుభాకాంక్షలు గంగూబాయి, వేగన్ బర్గర్ + ఫ్రైతో అలియాకు శుభాకాంక్షలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అని క్యాప్షన్ రాసింది. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
సంకల్ప లక్ష్మి
సంకల్పం బలంగా ఉంటే విజయం నీ సొంతమవుతుంది అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె. లక్ష్య ఛేదనలో అవరోధాలు అడ్డుకాదని నిరూపించిన క్రీడాకారిణి. పేదరికం వెనక్కి లాగుతున్నా దీక్షా, పట్టుదలతో అనుకున్న గమ్యాన్ని చేరుకుని ఆదర్శ‘లక్ష్మి’గా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా హ్యాండ్‌బాల్‌లో జాతీయస్థాయిలో సత్తాచాటి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. ఓ పక్క ఆటలో రాణిస్తూ మరోపక్క ప్రజలకు సేవలందిస్తున్నారు నిడదవోలు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బుద్దా రాజ్యలక్ష్మి. విజయగాథ ఆమె మాటల్లోనే.. మా సొంతూరు ఏలూరు. నాన్న జూట్ మిల్లులో కార్మికునిగా పనిచేస్తున్నారు. అమ్మ దుర్గా, చెల్లెలు రాజకుమారి ఉన్నారు. నాన్నకు నెలకు వచ్చే రూ.4 వేల జీతంతోనే కుటుంబాన్ని పోషించేవారు. కుటుంబం గడవటం కష్టంగా ఉన్నా నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు. ఏలూరు సెయింట్ థెరిస్సా కళాశాలలో పది, ఇంటర్ పూర్తి చేశాను. ఎన్సీసీ టీం లీడర్‌గా పనిచేశా. సామాజిక సేవ చేయాలంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి పరుగు పందాల్లో పాల్గొంటూ విజేతగా నిలిచేదాన్ని. పదో తరగతి చదువుతున్న సమయంలో స్కూల్‌గేమ్స్ అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి స్కూల్ చాంపియన్ సాధించాను. కళాశాలలో మంచి కోచ్‌లు ఉండటంతో ముందు వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుందామని అనుకున్నా. అయితే పరుగంటే ఇష్టంతో హ్యాండ్‌బాల్ ఎంచుకున్నా. అప్పుడే నిశ్చయించుకున్నా ఎలాగైనా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని. హ్యాండ్‌బాల్ క్రీడలో 40 నిమిషాలు ఏకధాటిగా పరుగు పెట్టాల్సిందే. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో రోజు పరుగు ప్రాక్టీస్ చేసేదాన్ని. కుటుంబ పోషణ కష్టంగా ఉన్న నాన్నకు నేను తీసుకోవాల్సిన డైట్ గురించి చెప్పేదానిని కాదు. అయినా నాన్న గమనించి డైట్ సమకూర్చేవా డు. ‘తల్లీ నువ్వు మా గురించి ఆలోచించకూ మేము తినో తినకో నీకు ఏ లో టు రానివ్వం’ అని ప్రోత్సహించేవారు. బూట్లు కూడా లేని పరిస్థితి పరుగు ప్రాక్టీస్‌కు బూట్లు కూడా కొనుక్కోలేని ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. రెండు నెలలు చెప్పులతోనే ప్రాక్టీస్ చేశాను. పరుగు ప్రాక్టీస్ నుంచి ఇంటికి వచ్చి ఉన్న ఒక్క టీషర్ట్‌ను రాత్రికి ఉతుక్కుని మళ్లీ ఉదయం వేసుకునేదాన్ని. అలా ఏడాది పాటు ఒక్క టీషర్టుతోనే గడిపాను. నాన్న పడుతున్న కష్టాన్ని చూసి ఏమీ చెప్పకుండా బాధను గుండెల్లో దాచుకున్నాను. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాను. 2009లో సీఆర్ రెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో పోలీస్ సెలెక్షన్స్‌లో పాల్గొని క్రీడా కోటాలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడం చా లా ఆనందం కలిగించింది. పదో తరగతి నుంచి ఆటల్లో రాణిస్తూ.. పదో తరగతి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ జాతీయస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొం దాను. 2016లో విశాఖలో జరిగిన జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోలీస్ టోర్నమెంట్లో ఏపీ జట్టులో పాల్గొని సత్తాచాటాను. ఫైనల్లో హర్యానాపై గెలు పొంది మా జట్టు విజేతగా నిలిచింది. ప్రభుత్వం ప్రైజ్ మనీ కింద రూ.3 లక్షల రివార్డును ప్రకటించింది. ఇలా ఆటల్లో రాణిస్తూ.. పోలీస్‌గా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నా. ఎన్ని కష్టాలు ఉన్నా ఏ లోటు రాకుండా ప్రోత్సహించిన నాన్న భరోసాతోనే ఈ స్థాయికి చేరుకున్నా. ముఖ్యంగా యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుంది. అమ్మాయిలు ఏ రంగంలోనూ తీసుపోరు. సమాజంలో పురుషులతో సమానంగా పోటీపడినప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుం టామనే భావంతో ముందుకు సాగిపోవాలి. -
ప్రణాళికతోనే విజయం
♦ జీవన విధానంలో మార్పుతో అవకాశాలు ♦ 'సాక్షి' భవిత గ్రూప్స్ అవగాహన సదస్సులో వక్తలు ♦ కిటకిటలాడిన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం ♦ వేల సంఖ్యలో తరలివచ్చిన నిరుద్యోగులు ఖమ్మం: సరైన ప్రణాళికతోనే విజయం సాధ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ భవిత ఆధ్వర్యంలో ఖమ్మం లోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం గ్రూప్స్‌పై అవగాహన సదస్సు జరి గింది. ఈ సదస్సులో పలువురు మాట్లాడుతూ జీవన విధానంలో మార్పుతోనే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వేలాదిగా వచ్చిన అభ్యర్థులు గ్రూప్స్‌పై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. జీవన విధానంలో మార్పులతోనే గమ్యాన్ని చేరుకుంటామని వక్తలు సూచించారు. వివరాలు వారి మాటల్లోనే.. శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి శక్తి సామర్థ్యాలు కూడగట్టుకొని ముందుకెళ్తే గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రభుత్వం 1.7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది.. వాటిని దక్కించుకునేందుకు నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ఉన్నత పదవులు అలంకరించిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం వారేనని గుర్తెరగాలి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఓ మంచి కార్యక్రమం చేపట్టిన 'సాక్షి'కి అభినందనలు. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పోటీని తట్టుకుని ముందుకెళ్లాలి వయో పరిమితిని 44 ఏళ్లకు సడలించడం వల్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దానిని తట్టుకుని ముందుకెళితే విజయం సిద్ధిస్తుంది. రాష్ట్రంలో ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా.. గ్రూప్స్‌లోనూ ఆ పేరుకు సార్థకత తీసుకురావాలి. సామాజిక స్పృహతో 'సాక్షి'చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. - పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే సామర్థ్యమే గీటురారుయి గ్రూప్స్‌లో విజయూనికి సామర్థ్యమే గీటురాయి. ఉద్యోగుల విభజన, తదితర సమస్యల వల్ల ఉద్యోగాల సంఖ్యపై స్పష్టత కొరవడింది. అందుకే గ్రూప్స్ నోటిఫికేషన్లో జాప్యం ఏర్పడింది. అభ్యర్థులకు అన్ని విషయూల్లో అవగాహన కల్పించేందకు ఇంటర్నెట్ సర్వీసులను వినియోగిస్తున్నాం. ఫేక్ వెబ్సైట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. - బానోత్ చంద్రావతి, టీఎస్పీఎస్సీ సభ్యురాలు పుస్తక పఠనంతోనే పూర్తి సమాచారం పుస్తక పఠనంతోనే పూర్తి సమాచారం అందుతుంది. అభ్యర్థులు తెలంగాణ చరిత్రపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. . గతంలో కొన్ని ముఖ్య తేదీల విషయంలో అభ్యర్థులకు తికమక ఉండేది. ఈ దఫా గ్రూప్స్‌లో తేదీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. - అడపా సత్యనారాయణ, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ప్రతి రోజూ విలువైనదే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ప్రతి రోజూ విలువైనదే. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. కోచింగ్ సెంటర్ల మెటీరియలే కాకుండా సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంశాలవారీగా చదివినప్పుడే సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. రాజ్యాంగాన్ని ఆకళింపు చేసుకోవాలి. - చంద్రశేఖర్‌గౌడ్, గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆటిట్యూడ్‌లో మార్పు రావాలి ఆటిట్యూడ్‌లో మార్పులు వచ్చినప్పుడు విద్యలో రాణించవచ్చు. మనిషి శుభ్రంగా ఉండేలా చూసుకుంటే ఆటోమెటిక్‌గా మెదడూ సక్రమంగా పనిచేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. పాజిటివ్ థింకింగ్‌తో ఉన్నప్పుడు విజయాన్ని చేరుకోవచ్చు. భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. - ప్రొఫెసర్ కె.రామానుజరావు, సోషియూలజీ అధ్యాపకులు ఏకాగ్రత అవసరం ఏకాగ్రతతో చదవడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువవుతుంది. ప్రస్తుతం కొందరు 'గాలి చదువులు, దున్నపోతు చదువులు, నీళ్ల చదువులు' వంటి మూడు రకాల చదువులకు అలవాటుపడుతున్నారు. ఇవి అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసమే పనికొస్తాయి. ఏకాగ్రతతో చదవడం వల్ల జీవితంలో విజయా లను అందుకోవచ్చు. - ప్రొఫెసర్ కనకాచారి, అర్థశాస్త్ర నిపుణులు