Mahesh Babu Family Vacation in Europe - Sakshi
Sakshi News home page

Mahesh Babu: మరోసారి మహేశ్‌ బాబు ఫ్యామిలీ టూర్‌..

Published Mon, May 23 2022 7:57 AM | Last Updated on Mon, May 23 2022 9:13 AM

Mahesh Babu Family Vacation In Europe - Sakshi

'సర్కారు వారి పాట' సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్న మహేశ్‌ బాబు ఫారిన్‌ టూర్‌ వెళ్లారు. ఫారిన్‌ ట్రిప్‌ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా షూటింగ్‌లో మహేశ్‌బాబు జాయిన్‌ అవుతారని తెలిసింది.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్‌, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. 

అయితే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్న మహేశ్‌ బాబు ఫారిన్‌ టూర్‌ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఆయన యూరప్‌లో ల్యాండ్‌ అయ్యారు. దాదాపు రెండు వారాలు మహేశ్‌ అక్కడే ఉంటారని సమాచారం. ఫారిన్‌ ట్రిప్‌ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా షూటింగ్‌లో మహేశ్‌బాబు జాయిన్‌ అవుతారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏప్రిల్‌ నెలాఖరులో కూడా మహేశ్‌ బాబు ఫారిన్‌ టూర్‌కు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. 

చదవండి: సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్‌ బాబు
సర్కారు వారి పాట విజయంపై సూపర్‌ స్టార్‌ కృష్ణ స్పందన


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement