
Hero Vishwak Sen Bought Luxurious Car: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. తనకిష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల సాకారం చేసుకున్నాడు విశ్వక్. నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్.
అయితే ఈ కారు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో దిగిన విశ్వక్ సేన్ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. విశ్వక్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. 'ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా' అని సరదాగా కామెంట్ చేశారు. కాగా కుటుంబా కథా చిత్రమైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతం అందించారు.
చదవండి: ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్
Comments
Please login to add a commentAdd a comment