Tarun Bhasker
-
పల్లె బాట పట్టిన టాలీవుడ్ హీరోలు.. హిట్ కొట్టేనా?
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం. పల్లె ఆట రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.తెలంగాణ కుర్రాడు తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు. బచ్చల మల్లి కథ వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. పల్లె బాటలో తొలిసారి... హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ. పల్లెటూరి పోలీస్ పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అమ్మాయి కథ యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది. పోస్ట్‌మ్యాన్ స్టోరీ‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
ట్రక్కు బ్రేకులు ఫెయిల్, అందరం చచ్చిపోతామన్న విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు నాన్‌వెజ్ వండటం బాగా వచ్చని చెప్పాడు. తనకు ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదన్నాడు. విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రౌడీ హీరో తనకు వైల్డ్ కార్డ్ లాంటివాడని చెప్పుకొచ్చాడు. తనకు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ వచ్చాక విజయ్ దేవరకొండ వైల్డ్ కార్డ్‌లాగా వాడతానన్నాడు. చదువులో తాను బ్యాక్ బెంచర్ అని, తాను కట్టిన సప్లిమెంటరీ ఫీజులతో ఒక బిల్డింగ్‌నే కట్టొచ్చని తెలిపాడు. సుమారు 23 సప్లీలు ఉండొచ్చన్నాడు. విజయ్ మాల్యా కూతురు పెళ్లికి వెళ్లానని, కాకపోతే ఓ కెమెరా పట్టుకుని దీపికా పదుకోణ్ను ఫాలో అవమని చెప్పారని, తానదే చేశానని పేర్కొన్నాడు. పెళ్లి చూపులు సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను పంచుకున్నాడు. 'ట్రక్కు బ్రేకులు ఫెయిలవగానే అప్పటిదాకా భయపడ్డ విజయ్ దేవరకొండ సడన్‌గా రిలాక్స్ అయిపోయాడు. దర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టడంతో అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్నదానికంటే విజయ్ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్ ఉన్నవని అడిగితే.. ఫస్ట్ స్టార్టింగ్ల భయం వేశింద్రా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది.. అని ఆన్సరివ్వడంతో ఒక్కసారిగా షాకయ్యా' అన్నాడు తరుణ్ భాస్కర్. చదవండి 👇 భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్ నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన -
కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్.. డైరెక్టర్ రియాక్షన్
Hero Vishwak Sen Bought Luxurious Car: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. తనకిష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల సాకారం చేసుకున్నాడు విశ్వక్. నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. అయితే ఈ కారు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో దిగిన విశ్వక్ సేన్ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. విశ్వక్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. 'ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా' అని సరదాగా కామెంట్ చేశారు. కాగా కుటుంబా కథా చిత్రమైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతం అందించారు. చదవండి: ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్ View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
కరోనా వచ్చింది ఫ్రెండ్స్.. సీరియస్‌గా తీసుకోండి : డైరెక్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కరోనాను సీరియస్‌గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వెంకటేశ్‌తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు. -
దిగ్దర్శకులుగా క్రిష్, తరుణ్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుంది. అంతేకాదు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులైన మహానటుల పాత్రల్లో ఈ తరం నటీనటులు దర్శనమివ్వనున్నారు. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కు సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. తెలుగు సినిమా ఖ్యాతీని పెంచిన దిగ్గజ దర్శకులు కెవీ రెడ్డి పాత్రలో ఈ తరం దర్శకుడు క్రిష్, మాయాబజార్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పాత్రలో పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. వీరితో ఇతర కీలక పాత్రల్లో సమంత, రాజేంద్ర ప్రసాద్, షాలినీ పాండే లు నటిస్తున్నారు. -
పెళ్లిచూపులు దర్శకుడి కొత్త సినిమా..!
2016లో రిలీజ్ అయిన పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయం సాదించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు రెండో సినిమా కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఫైనల్ తన రెండు సినిమాను ప్రారంభించాడు తరుణ్. పెళ్లిచూపులు సినిమా ప్రమోషన్ లో రిలీజ్ విషయంలో ఎంతో తోడ్పాటు అందించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే రెండో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథా కథనాలు ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కొత్త నటీనటులతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా..!
ప్రస్తుతం పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు నాలుగు వారాలకు మించి నడిచే పరిస్థితిలేదు. చాలా రోజులుగా సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడింది అన్న లెక్కలతో కాకుండా, ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో చెపుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా.. కేవలం కథా కథనాలను నమ్ముకొని తెరకెక్కించిన పెళ్లి చూపులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లోనూ చరిత్ర సృష్టించింది. గతంలో మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని విధంగా అమెరికాలో 50 రోజులుగా ఈ సినిమా ప్రదర్శితమౌతూనే ఉంది. అది కూడా పది సెంటర్లలో కావటం మరో విశేషం. టాప్ స్టార్లకు కూడా సాధ్యం కానీ ఈ అరుదైన రికార్డ్ సృష్టించిన పెళ్లి చూపులు టీంకు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈసినిమాను ధర్మపత్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ కందుకూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.