
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు నాన్‌వెజ్ వండటం బాగా వచ్చని చెప్పాడు. తనకు ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదన్నాడు.
విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రౌడీ హీరో తనకు వైల్డ్ కార్డ్ లాంటివాడని చెప్పుకొచ్చాడు. తనకు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ వచ్చాక విజయ్ దేవరకొండ వైల్డ్ కార్డ్‌లాగా వాడతానన్నాడు. చదువులో తాను బ్యాక్ బెంచర్ అని, తాను కట్టిన సప్లిమెంటరీ ఫీజులతో ఒక బిల్డింగ్‌నే కట్టొచ్చని తెలిపాడు. సుమారు 23 సప్లీలు ఉండొచ్చన్నాడు. విజయ్ మాల్యా కూతురు పెళ్లికి వెళ్లానని, కాకపోతే ఓ కెమెరా పట్టుకుని దీపికా పదుకోణ్‌ను ఫాలో అవమని చెప్పారని, తానదే చేశానని పేర్కొన్నాడు.
పెళ్లి చూపులు సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను పంచుకున్నాడు. 'ట్రక్కు బ్రేకులు ఫెయిలవగానే అప్పటిదాకా భయపడ్డ విజయ్ దేవరకొండ సడన్‌గా రిలాక్స్ అయిపోయాడు. దర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టడంతో అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్నదానికంటే విజయ్ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్ ఉన్నవని అడిగితే.. ఫస్ట్ స్టార్టింగ్‌ల భయం వేశింద్రా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది.. అని ఆన్సరివ్వడంతో ఒక్కసారిగా షాకయ్యా' అన్నాడు తరుణ్ భాస్కర్.
చదవండి 👇
భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్
నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment