విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుత సమయంలో విజయ్‌కు ఒక భారీ హిట్ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి టైమ్‌లోనే విజయ్‌కి ఒక చక్కటి కథను తరుణ్‌భాస్కర్ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఒక యాక్షన్ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్. అయితే, ఫైనల్‌గా విజయ్ ఈ ప్రాజెక్ట్‌పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్‌తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్, మలయాళంలో రీమేక్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment