Pelli Chupulu
-
'పెళ్లి చూపులు' కోసం ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.ప్రస్తుత సమయంలో విజయ్‌కు ఒక భారీ హిట్ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి టైమ్‌లోనే విజయ్‌కి ఒక చక్కటి కథను తరుణ్‌భాస్కర్ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఒక యాక్షన్ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్. అయితే, ఫైనల్‌గా విజయ్ ఈ ప్రాజెక్ట్‌పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్‌తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్, మలయాళంలో రీమేక్ అయింది. -
'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీ..
30 Weds 21 Fame Chaitanya Movie With Pelli Chupulu Producer: '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావ్ మాధాడి బంపర్ ఆఫర్ కొట్టేశాడు. గతేడాది యూట్యూబ్‌లో విడుదలై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌లలో ‘30 వెడ్స్ 21’ ఒకటి. ఈ వెబ్‌సిరీస్ ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో చైతన్య రావ్ మాధాడి, అనన్య శర్మ జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌తో వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారాడు చైతన్య. పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, ఏబీసీడీ వంటి పలు హిట్ చిత్రాలకు బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. భారత జాతీయ అవార్డు గుర్తింపుతో మంచి కంటెంట్‌తో చిత్రాలు తీసే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. న్యూ టాలెంట్ డైరెక్టర్లకు అవకాశమిస్తూ సినిమాపై తనకున్న ప్యాషన్ చూపిస్తున్నారు నిర్మాత యశ్ రంగినేని. ఈ క్రమంలోనే 'పిట్ట కథ' మూవీ డైరెక్టర్ చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తోపాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలను తెలియజేస్తామని నిర్మాత పేర్కొన్నారు. Delighted to announce our next 🙏@IamChaitanyarao #ChenduMuddu@GskMedia_PR @YashBigBen pic.twitter.com/LqJ8q6vXrP — BIGBEN Cinemas (@BigBen_Cinemas) March 9, 2022 -
పెళ్లిచూపులు దర్శకుడితో మహేష్..!
యంగ్ జనరేషన్ దర్శకులతో కలిసి పనిచేసేందుకు స్టార్ హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్స్‌తో పనిచేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పిన మహేష్, మరో యంగ్ డైరెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరగుతోంది. పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో సక్సెస్ సాధించాడు. త్వరలో హీరోగానూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ యువ దర్శకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓ పాయింట్ వినిపించాడట. ఈ పాయింట్ పట్ల సుముఖంగా ఉన్న మహేష్ పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మహేష్, తరుణ్ భాస్కర్ నుంచి ఎలాంటి ప్రకటనా రావటం లేదు. ప్రస్తుతం తన 25 సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్గా అలరించనుంది. -
కొత్త హీరో... కొత్త డైరెక్టర్
‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలని నిర్మించడంతో పాటు జాతీయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులని సొంతం చేసుకున్న నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు శివ. ధర్మపథ క్రియేషన్స్‌పై రూపొందనున్న ఈ చిత్రంతో శేష సింధురావ్ అనే లేడీ డైరెక్టర్ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు రాజ్ కందుకూరి. దర్శకులు సుకుమార్, క్రిష్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు శేష సింధురావ్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘96’ చిత్రం ఫేమ్ వర్ష ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘మహానటి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ చిత్రానికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: దగ్గుబాటి సురేశ్ బాబు, ‘మధుర’ శ్రీధర్, కెమెరా: వేద వర్మ. -
‘మిత్రోం’ ఇది తగునా..?
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డిఫరెంట్ కామెడీతో ఆకట్టుకున్న పెళ్లిచూపులు తరుణ్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టడమే కాదు. దర్శకుడిగా రచయితగా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిపెట్టింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో మిత్రోం పేరుతో రీమేక్ చేశారు. సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. నేటివిటీ పరంగా మార్పులు చేసిన ట్రైలర్లో ప్రతీ సీన్ ఒరిజినల్ వర్షన్లో కనిపించిందే. అయితే టైటిల్ లో మాత్రం ఎక్కడా తరుణ్ భాస్కర్ ప్రస్తావన్ లేదు. కథా కథనాలు పెళ్లి చూపులు నుంచే తీసుకున్నారు కాబట్టి తప్పుకుండా తరుణ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒరిజినల్‌గా కథా కథనాలు తయారు చేసిన తరుణ్‌భాస్కర్‌కు క్రెడిట్ ఇవ్వకపోగా రచయితగా శరిబ్ హష్మీ పేరు వేశారు. దీంతో హిందీలో రీమేక్ చేసిన దర్శక నిర్మాతలు క్రెడిట్ ఇవ్వకపోవటం అన్యాయం అన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై మిత్రోం చిత్ర దర్శకుడు నితిన్ కక్కర్, నిర్మాత విక్రమ్ మల్హోత్ర ఎలా స్పందిస్తారో చూడాలి. -
చెల్లి కోసం వచ్చి పెళ్లయిన అక్కని తీసుకెళ్లాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లిచూపులకు వెళ్లడం, అమ్మాయి నచ్చితే వివాహం చేసుకోవడం, లేకుంటే మరో సంబంధానికి వెళ్లడం మగవారికి మామూలే. అయితే ఓ ప్రబుద్ధుడు చిన్నకూతురిని చేసుకునేందుకు పెళ్లిచూపులకు వచ్చి పెళ్లయి బిడ్డ తల్లయిన పెద్దమ్మాయిని లేపుకెళ్లాడు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న ఆయన సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో అన్నాదురై (28) అనే వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి అమ్మాయిని చూశాడు. ఇదే సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపి వెళ్లిపోయాడు. పెళ్లిచూపుల గురించి అమ్మాయి తండ్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే పెద్దమ్మాయితో టచ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో అక్క ఇల్లు వదిలి లేచిపోయింది. పెద్దకుమార్తె అన్నాదురైతో లేచిపోయిందని ఆలస్యంగా తెలుసుకున్న తండ్రి మైలాపూరు పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశాడు. తన చిన్నకుమార్తె పెళ్లిచూపులకు వచ్చిన అన్నాదురైతో పెద్ద కుమార్తె లేచిపోయిందని, వెళ్తూ వెళ్తూ ఇంటిలోని ఐదు సవర్ల నగలు, రూ.2లక్షలు నగదును తీసుకుని మూడేళ్ల కుమారుడితో సహా పారిపోయిందని పేర్కొన్నాడు. ప్రేమజంట కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
‘ఈ నగరానికి ఏమైంది?’ మోషన్ పోస్టర్
పెళ్లి చూపులు మూవీతో చిన్న సినిమా స్టామినా ఏంటో నిరూపించాడు ఆ చిత్ర దర్శకుడు తరుణ్ బాస్కర్. తీసిన ఆ ఒక్క సినిమాతో పెద్ద సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా... ఇంకో సినిమాను తెరకెక్కించలేదు ఈ యువ దర్శకుడు. ఈ నగరానికి ఏమైంది అంటూ సాగే ఒకప్పటి ఫేమస్ యాడ్‌లోని ఫస్ట్ లైన్‌ను తన సినిమా టైటిల్‌గా ఎంచుకున్నాడు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కు రా చూస్కుందాం అంటూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిగా రేకెత్తెలా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంట్లో సినిమాలోని నలుగురు కుర్రాళ్లను పరిచయం చేశాడు. మీరంతా గ్యాంగ్‌తో రండి... ఈ సమ్మర్లో మిమ్మల్ని గోవాకు తీసుకెళ్తాం అంటూ పోస్టర్‌ను రిలీజ్చేశారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈ నగరానికి ఏమైంది.. మోషన్ పోస్టర్ విడుదల
-
‘డియర్ కామ్రేడ్’ అంటున్న అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్, ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రేపు (మే 9న) రిలీజ్ అవుతున్న మహానటిలో కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ, మరో సినిమా టాక్సీవాలా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నోటా’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ మధ్యే ప్రారంభించాడు. నోటా చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్. పెళ్లిచూపులు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన యాష్ రంగినేని నిర్మాణంలో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ లీడ్ రోల్లో నటించనున్నాడు. ఈ సినిమాకు డియర్ కామ్రేడ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేసిట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
ప్రియదర్శి ఇంట ‘పెళ్లి సందడి’
పెళ్లిచూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఫ్రెండ్‌గా దాదాపు అన్నిసినిమాల్లో కనిపిస్తున్నాడు ఈ హాస్యనటుడు. తెలంగాణ యాసలో తనదైన కామెడీ టైమింగ్‌తో దూసుకుపోతున్నాడు. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ప్రియదర్శి కొత్త బంధాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే జీవిత భాగస్వామి రిచాను అభిమానులకు పరిచయం చేశాడు ప్రియదర్శి. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వార్తలు ఫిలిం నగర్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్‌లో ప్రియదర్శి వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేవలం ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే పాల్గొననున్నారు. తరువాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం 26న గ్రాండ్ గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. -
ప్రేమలో అర్జున్‌రెడ్డి యాక్టర్..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. తన ప్రేమికురాలు రిచా శర్మను ప్రపంచానికి పరిచయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల లేదా వచ్చేనెలలో ప్రియదర్శి-రిచా శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని, దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. ‘ఆమె గురించి నా భావాలు, భావోద్వేగాలు పదాల్లో రాయాలని ప్రయత్నించి.. విఫలమయ్యాను. ఆమె అందమైన మనస్సును వర్ణించాలంటే ఎన్నో లక్షల కవితలు రాయాల్సి ఉంటుంది.. నన్ను పూర్తిగా అర్థం చేసుకొని.. నా జీవితంలో తను అడుగుపెట్టబోతుందంటూ’ ఓ అందమైన సందేశంతో ప్రియదర్శి తన ప్రేమికురాలు రిచాశర్మకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, నీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా కమేడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి అనతికాలంలో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో కౌషిక్గా నటించిన ప్రియదర్శి చెప్పిన డైలాగ్ ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి సినిమాలోనూ లాయర్‌గా ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. బాబు బాగా బిజీ, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగి, ఎంసీఏ తదితర సినిమాల్లో నటించాడు. -
పెళ్లి చూపులు దర్శకుడి కొత్త సినిమా అప్డేట్
గత ఏడాది సంచలన విజయం సాధించిన చిన్న సినిమా పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో ఘనవిజయం సాధించిన తరుణ్ తన రెండో సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అంతా కొత్తవారితో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకు ‘ఈ నగరానికి ఏమైంది’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను వేసవి కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లిచూపులు సినిమాకు సంగీతమందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. త్వరలో చిత్రయూనిట్ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. -
పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది
సదువు సక్కంగా బుర్రకు ఎక్కని ఓ ఆవారా కుర్రాడు బీటెక్ పూర్తి చేస్తాడు. షెఫ్ కావాలనేది అతడి కోరిక. పిల్లను సూడనీకి ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్తాడు. ఆ పిల్లేమో ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. మరక మంచిదే అన్నట్టు... రాంగ్ అడ్రస్‌కు వెళ్లడం వల్ల ఇద్దరికీ మేలు జరిగింది. విభిన్న వ్యక్తిత్వాలు గల ఇద్దరూ కలసి ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తర్వాత ప్రేమలో పడతారు. చిన్న సంఘర్షణ తర్వాత ఒక్కటవుతారు – తరుణ్ భాస్కర్ దర్శకునిగా పరిచయమైన ‘పెళ్ళి చూపులు’ చిత్రకథ సాదాసీదాగానే అనిపిస్తుంది. మరి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఒకటి, ఉత్తమ సంభాషణలకు గాను తరుణ్ భాస్కర్‌కి మరొకటి... రెండు నేషనల్ అవార్డులు ఎందుకొచ్చాయి? అనడిగితే... ‘పెళ్లి చూపులు’లో సహజత్వం ఉంది. ‘నా సావు నేను సస్తా... నీకెందుకు?’ వంటి మాటలు నుంచి మొదలుపెడితే... ఇప్పటి యువతీయువకుల ఆలోచనా ధోరణి వరకూ ప్రతి అంశంలోనూ దర్శకుడు సహజత్వం చూపించాడు. ఏదో మన పక్కింట్లో, మనింట్లో జరిగే కథగా అనిపిస్తుంది. అందుకే, సూపర్ హిట్టయ్యింది. కంటెంట్ ఈజ్ కింగ్ సినిమా సక్సెస్, ఇప్పటివరకూ వచ్చిన అవార్డులు ఒకెత్తు అయితే... నేషనల్ అవార్డు రావడం మరో ఎత్తు. సూపర్ స్టార్స్ చేసిన చిత్రమా? కొత్తవాళ్లు చేసిన చిత్రమా? అని ఆలోచించకుండా... సినిమా హైప్‌తో, బడ్జెట్‌తో సంబంధం లేకుండా... మా చిత్రాన్ని గౌరవించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నా. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని మేము ఏ నమ్మకంతో అయితే సినిమా తీశామో? ప్రేక్షకులు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. ‘పెళ్లి చూపులు’కు భారీ విజయాన్ని అందించారు. దీనివల్ల నేను లేదా మరో కొత్త నిర్మాత... ఎవరైనా కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీయడానికి ముందుకొస్తారు. ఈ ప్రోత్సాహాన్ని మరో పదిమంది స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నా. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందిస్తే... మిగతా అంశాలు ఏవీ చూడకుండా ఓటు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ‘పెళ్లి చూపులు’ టీమ్, నిర్మాత డి. సురేశ్‌బాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – నిర్మాత రాజ్ కందుకూరి ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమైంది! ‘‘సూపర్ హ్యాపీ. ‘పెళ్ళి చూపులు’కు నేషనల్ అవార్డు వస్తుందని ఊహించలేదు. ఈ సినిమా రిలీజవుతుందా? లేదా? అని భయపడేవాణ్ణి. ప్రతి ఒక్కరి (ప్రేక్షకుల) ప్రశంసలతో ఇంత దూరం వచ్చింది. 2015లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఆశీస్సులతోనే ఇవన్నీ దక్కుతున్నాయని అనుకుంటున్నా. నాన్నగారు ఉండుంటే ఈ సంతోషం వేరేలా ఉండేదేమో. పైనుంచి ఆయన చూసి, ఆశీర్వదిస్తున్నారనే నమ్మకంతో హ్యాపీగా ఉన్నాను. ఇది పక్కన పెడితే... మా నిర్మాతలు నా ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశారు. మంచి ప్రయత్నం చేద్దామనుకున్నాం తప్ప... డబ్బులొస్తాయి, వందరోజులు ఆడుతుంది, నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. దీన్నో గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. – దర్శకుడు తరుణ్ భాస్కర్ -
పెళ్లి చూపులు నిర్మాతకు బి. నాగిరెడ్డి పురస్కారం
తెలుగు ప్రేక్షకులకు పలు చిరస్మరణీయ చిత్రాలను అందించిన సినీ నిర్మాత, విజయ వాహినీ స్టూడియో అధినేత బి. నాగిరెడ్డి. ఆయన పేరు మీద ప్రతి ఏడాది చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసిన నిర్మాతకు బి. నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. విజయ వాహినీ సంస్థ తరపున బి. నాగిరెడ్డి తనయుడు బి. వెంకట్రామిరెడ్డి ఆరేళ్లుగా ఈ పురస్కార వేడుకలను నిర్వహిస్తున్నారు. 2016కుగానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరికి అందజేస్తున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 16న రాజమండ్రిలో ఈ పురస్కార ప్రధానోత్సవం జరగనుందని ఆయన తెలిపారు. ఈ పురస్కారం పట్ల రాజ్ కందుకూరి సంతోషం వ్యక్తం చేశారు. -
ఈ యంగ్ హీరో చేతిలో ఏడు సినిమాలు..!
పెళ్లిచూపులు సినిమా రిలీజ్ అయ్యే వరకు విజయ్ దేవరకొండ అనే పేరు చాలా మందికి తెలీదు. అంతుకు ముందు ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. వరుస అవకాశాలు మాత్రం రాలేదు. పెళ్లి చూపులు సక్సెస్ విజయ్ లైఫ్‌ను టర్న్ చేసింది. ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ కిక్‌తో విజయ్ ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ శుక్రవారం (మార్చి 3) ద్వారక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత గీతా ఆర్ట్స్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో కూడా విజయే హీరోగా నటించనున్నాడు. దీంతో పాటు పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ విజయ్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తోంది. కళ్యాణవైభోగమే సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన నందిని రెడ్డి కూడా విజయ్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేసింది. సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు సినిమాను పూర్తి చేసిన క్రాంతి మాధవ్ కూడా తన నెక్ట్స్ సినిమాను విజయ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడికి కూడా విజయ్ సినిమా ఓకె చేశాడట. వీటితో పాటు ప్రస్థానం ఫేం దేవాకట్టా కూడా విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
కథ చెప్పమంటే లేదన్నాడు
‘‘యూట్యూబ్‌లో ‘అను కోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్ చూసి, తరుణ్‌కి కాల్ చేశా. వచ్చి కలిశాడు. ఓ ప్రేమకథ ఉంటే చెప్పమన్నాను. కథ లేదని చెప్పాడు. ఇప్పుడు ‘పెళ్లి చూపులు’తో దర్శకుడిగా మారి సక్సెస్ అందుకున్నాడు. తరుణ్‌తో సినిమా చేయాలని ఉంది’’ అన్నారు అఖిల్. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. ఆదివారం జరిగిన ఈ చిత్రం విజయోత్సవంలో అఖిల్ పాల్గొన్నారు. ‘‘గత పదేళ్లలో నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తై ఈ సినిమా మరో ఎత్తు’’ అని రాజ్ కందుకూరి అన్నారు. దర్శకులు నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, హీరో రాజ్ తరుణ్, చిత్రనాయకా నాయికలు విజయ్ దేవరకొండ, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేశ్ బాబు. -
రానా ఆ అవకాశం ఇస్తాడో... లేదో?!
‘‘నాకు సిగ్గు ఎక్కువ. ‘పెళ్లి చూపులు’ అంటే మా స్నేహితుడి ఇంటికి అమ్మాయిని రమ్మని చెప్పాను. రమ్మన్నానే కానీ మాట్లాడాలంటే మొహమాటం. తను రావడం.. నేను మాట్లాడకపోవడం.. మూడు రోజులూ ఇదే తంతు. కనీసం హలో.. కూడా చెప్పలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఇప్పుడలా కాదు, పరిస్థితులు చాలా మారాయ్’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఆయన సమర్పణలో విజయ్ దేవరకొండ, రితూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన సినిమా ‘పెళ్లి చూపులు’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా సురేశ్ బాబు చెప్పిన సంగతులు... ♦ విద్యావంతులు ఎక్కువ కావడం, ఎకనమిక్ ఇండిపెండెన్స్ పెరగడంతో ఈరోజుల్లో ‘పెళ్లి చూపులు’ చూసేవారి సంఖ్య తగ్గుతోంది. ‘కులం, ఆర్థిక స్థితి’ చూసి చాలా ప్లాన్డ్గా లవ్ చేసే యువత కొందరయితే.. మరికొందరు సహజంగా ప్రేమలో పడుతున్నారు. ♦ దర్శకుడు తరుణ్‌భాస్కర్ ఈ కథను ముందు నాకే చెప్పాడు. క్రమశిక్షణ గల ఓ అమ్మాయి, బద్ధకస్తుడైన అబ్బాయికి ‘పెళ్లి చూపులు’. ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. ఇద్దరూ తమ గతం గురించి చెప్పుకోవడం మొదలుపెడతారు. అదీ సినిమా. రాజ్ కందుకూరి ఈ కథ గురించి చెప్పగానే.. మంచిదని సలహా ఇచ్చాను. ♦ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత హ్యాపీ ఫీలయ్యా. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని విభిన్నంగా తీర్చిదిద్దాడు. నాకు ఏ కథనైతే చెప్పాడో.. దాన్నే తెరపై చూపించాడు. బౌండ్ స్క్రిప్ట్, స్టోరీ బోర్డ్, సింక్ సౌండ్.. అన్నిటికీ మించి అనుకున్న బడ్జెట్లో ఫర్ఫెక్ట్గా తీశాడు. సినిమా తీసిన విధానం నాకు నచ్చడంతో భాగస్వామినయ్యా. తరుణ్ భాస్కర్‌తో మా సంస్థలో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాను. రెండు మూడు ఐడియాలు చెప్పాడు. ♦ మా సంస్థలో సినిమా నిర్మించి ఏడాదిన్నర కావొస్తోంది. కథ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఏ సినిమా పడితే అది తీస్తే.. డబ్బులు పోతాయేమో? పరువు పోతుందేమోనని నాకు భయం ఎక్కువ. వెంకటేశ్, రానా, నాగ చైతన్యలతో ఒక్కో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాను. వెంకీ, రానాలతో మల్టీస్టారర్ కూడా ప్లానింగ్‌లో ఉంది. అన్నీ కథాచర్చల్లో ఉన్నాయి. ♦ రెండేళ్లలో రానా పెళ్లి చేయాలనుకుంటున్నాం. పెళ్లి చూపులు ఏర్పాటు చేసే అవకాశం ఇస్తాడో! ప్రేమించానంటూ తనే ఓ అమ్మాయిని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తాడో (నవ్వుతూ). -
పెళ్లిచూపుల్లో...
మోడ్రన్ టచ్‌తో సాగే ట్రెడిషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న చిత్రం ‘పెళ్లి చూపులు’. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా, రీతూ వర్మ కథానాయికగా రూపొందనున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, బిగ్‌బెన్ సినిమాస్ కలసి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అశోక్ కుమార్ స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి.సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. మొత్తం 42 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి మిగిల్చేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్.