
ప్రేమికురాలితో ప్రియదర్శి (ఫొటో- ప్రియదర్శి ఫేస్‌బుక్ ఖాతాలోది)
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. తన ప్రేమికురాలు రిచా శర్మను ప్రపంచానికి పరిచయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల లేదా వచ్చేనెలలో ప్రియదర్శి-రిచా శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని, దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు.
‘ఆమె గురించి నా భావాలు, భావోద్వేగాలు పదాల్లో రాయాలని ప్రయత్నించి.. విఫలమయ్యాను. ఆమె అందమైన మనస్సును వర్ణించాలంటే ఎన్నో లక్షల కవితలు రాయాల్సి ఉంటుంది.. నన్ను పూర్తిగా అర్థం చేసుకొని.. నా జీవితంలో తను అడుగుపెట్టబోతుందంటూ’ ఓ అందమైన సందేశంతో ప్రియదర్శి తన ప్రేమికురాలు రిచాశర్మకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ, నీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా కమేడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి అనతికాలంలో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో కౌషిక్‌గా నటించిన ప్రియదర్శి చెప్పిన డైలాగ్ ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి సినిమాలోనూ లాయర్‌గా ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. బాబు బాగా బిజీ, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగి, ఎంసీఏ తదితర సినిమాల్లో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment