Richa Sharma
-
సంజయ్‌దత్ కుటుంబానికి క్యాన్సర్ శాపం
‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’లో రోగాన్ని మందులతో కంటే మాటలతో ఎక్కువ నయం చేయాలంటాడు సంజయ్‌దత్. ఇప్పుడు ఆ నటుడు మందులకు అంతగా లొంగని కేన్సర్ బారిన పడ్డాడు. సంజయ్‌దత్‌కు లంగ్ కేన్సర్ నిర్థారితం అయ్యిందని మీడియాలో వార్తలు వచ్చాయి. సంజయ్‌దత్ కుటుంబానికి క్యాన్సర్ ఒక శాపం అనవచ్చు. తల్లి, ఇద్దరు భార్యలు దాని బారిన పడ్డారు. కొందరు దానిని జయించారు. సంజయ్‌దత్ కూడా జయిస్తాడనే ఆశ. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చేసి ఉండకపోతే సంజయ్‌దత్ భారతీయ ప్రేక్షకులకు ఇంత ఇష్టుడై ఉండేవాడు కాదు. ఆ తర్వాత వచ్చిన ‘లగేరహో మున్నాభాయ్’తో అతడు తన పాత ఇమేజ్ను అంతా చెరిపేసుకోని బాలీవుడ్లో అత్యంత ముఖ్యమైన నటుడు అయ్యాడు. ‘ఖల్నాయక్’ సమయంలో అతడు టాడా కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లినప్పుడు చిలువలు పలువలుగా కథనాలు రాసిన మీడియా తర్వాతి కాలంలో శిక్ష పూర్తి చేయడానికి సంజయ్‌దత్ పూణె జైలులో ఉన్నప్పుడు ఎంతో సానుభూతితో రాశాయి. సాధారణ జనం సంజయ్‌దత్ అనుభవించింది చాలు అతణ్ణి తొందరగా విడుదల చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కూడా. 2014లో జైలు నుంచి విడుదలైన సంజయ్‌దత్ మునుపటి సంజయ్‌దత్ ఎంతకీ కాలేకపోయాడనే చెప్పాలి. ఆ ఉడుకు, వేగం తగ్గాయి. సినిమాల సంఖ్య కూడా తగ్గింది. ఫ్యామిలీతోటి ఎక్కువ గడుపుతూ అతడు చేసిన సినిమాలలో తాజాగా ‘సడక్2’ ఈ నెలాఖరున డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. సంజయ్‌దత్‌ను మరోసారి ఏదో ఒక తెర మీద చూడాలని అభిమానులు అనుకుంటున్నప్పుడు హటాత్తుగా ఆయన అనారోగ్యం వార్త బయటకు వచ్చింది. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 8 నుంచి సంజయ్‌దత్ వార్తలు రావడం మొదలయ్యాయి. ఛాతీలో అసౌకర్యం వల్ల ఆయన ముంబైలో లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే ఆగస్టు 10 సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. తనకు కోవిడ్ నెగెటివ్ వచ్చిందని, కాని పని నుంచి కొంత బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశాడు. ఆ తర్వాతి నుంచి ఆయన లంగ్ కేన్సర్ వార్తలు బయటకు వచ్చాయి. ప్రసిద్ధ సినిమా జర్నలిస్ట్ కోమల్ నహతా ‘సంజయ్‌దత్‌కు లంగ్ కేన్సర్ నిర్థారితం అయ్యింది. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం’ అని ట్వీట్ చేశాడు. సంజయ్‌దత్‌కు కేన్సర్ స్టేజ్ 3 లెవల్లో ఉందని చెబుతున్నారు. ఆయన కుటుంబం వైద్యం కోసం అతి త్వరలో అమెరికా వెళ్లనుంది. నర్గీస్‌దత్ నుంచి సంజయ్‌దత్‌కు తల్లి నర్గిస్ దత్తో ఎక్కువ అనుబంధం. కొడుకును సూపర్‌స్టార్‌గా చూడాలని ఆ నటి అనుకుంది. సంజయ్‌దత్ ఆ ప్రయత్నాల్లో ఉండి సినిమా మొదలెడుతుండగా ఆమె 1980లో పాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడింది. ఇది సంజయ్‌దత్‌ను చాలా డిస్ట్రబ్ చేసింది. తను డ్రగ్స్ బారిన పడటానికి తల్లి అనారోగ్యం కూడా ఒక కారణం అని అతడు చెప్పుకున్నాడు. భర్త సునీల్‌దత్ అమెరికాలో ఆమెకు వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. 1981లో నర్గిస్ మరణించింది. ఆ తర్వాతే సంజయ్‌దత్ తొలి సినిమా ‘రాకీ’ విడుదలైంది. తల్లి పడ్డ క్యాన్సర్ బాధ సంజయ్‌దత్‌ను చాలాకాలం వెన్నాడింది. తర్వాత భార్య రిచాశర్మ సంజయ్‌దత్ నటి రిచా శర్మను 1987లో వివాహం చేసుకున్నాడు. రిచా శర్మ చాలా హిట్ సినిమాలలో నటించింది. ఆమె కుటుంబం ఆమెరికాలో స్థిరపడి ఉంది. అయితే కూతురు త్రిశాల పుట్టిన కొన్నాళ్లకు రిచా శర్మకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. రిచాశర్మ వైద్యం కోసం సంజయ్ దత్ కుమార్తెతో కలిసి అమెరికాకు అనేకసార్లు రాకపోకలు సాగించాడు. కాని ఫలితం దక్కలేదు. 1996లో 32 ఏళ్ల వయసులో రిచాశర్మ మరణించింది. కూతురు త్రిశాల అమ్మమ్మ, నాయనమ్మల దగ్గరే పెరగడానికి అమెరికాలో ఉండిపోయింది. సంజయ్‌దత్, మాన్యత, ఇద్దరు పిల్లలు ఆ తర్వాత మాన్యత నటి మాన్యతను 2008లో సంజయ్‌దత్ పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకు వారికి ట్విన్స్ పుట్టారు. అబ్బాయి. అమ్మాయి. ఆ తర్వాత ఒకవైపు టాడా కేసు నడుస్తూ ఉంటే మరోవైపు సినిమాల్లో నటిస్తూ సంజయ్ బిజీగా ఉన్నాడు. తీర్పు వెలువడ్డాక జైలు శిక్ష అనుభవించడానికి వెళ్లిపోయాడు. అయితే ఈలోపు 2013లో మాన్యత లివర్ ట్యూమర్‌తో బాధ పడిందనే వార్తలు వచ్చాయి. ఆమె దానితో పోరాడే సమయంలో సంజయ్‌దత్ భార్య అనారోగ్య కారణంగా పరోల్ పొందేవాడు. అయితే మాన్యత ఆ ట్యూమర్ నుంచి బయటపడింది. ఇప్పటి పరిస్థితి సంజయ్‌దత్ జీవితం అనూహ్య పరిణామాల జీవితం. నాటకీయ జీవితం. అందుకే అతని జీవితం ఆధారంగా రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘సంజూ’ సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. సంజయ్‌దత్ కోసం బాలీవుడ్ ఎన్నో కేరెక్టర్లు రాస్తోంది. సంజయ్‌దత్ చేయాల్సిన సినిమాలూ చాలానే ఉన్నాయి. 61 ఏళ్లు అంటే ఇంకా పదేళ్లపాటు నటించవచ్చు. కాని ఈలోపు ఈ అనారోగ్య వార్త. సంజయ్ తన శరీరాన్ని చాలా అబ్యూస్ చేసుకున్నాడు. డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్... ఇవన్నీ ఏళ్ల తరబడి అతడి దశలవారీ వ్యసనాలుగా ఉన్నాయి. వాటి పర్యవసానమే ఇప్పటి అనారోగ్యం కావచ్చు. కాని సంజయ్ ఎన్నో పోరాటాలు కూడా చేశాడు. వచ్చిన ప్రతికూలతలకు ఎదురొడ్డి నిలిచాడు. క్యాన్సర్‌ను జయించి తిరిగి వస్తాడనే ఆశ. అతని భార్య కూడా అదే ట్వీట్ చేసింది. ‘మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. అన్ని చెడుకాలాలు వెళ్లినట్టే ఈ చెడుకాలం కూడా వెళ్లిపోతుంది’ అని ప్రకటన చేసింది. నిజంగా ఈ చెడుకాలం గడిచిపోయాలనే ప్రతి ఒక్క సినీ అభిమాని ఆకాంక్ష. – సాక్షి ఫ్యామిలీ -
ప్రేమలో అర్జున్‌రెడ్డి యాక్టర్..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. తన ప్రేమికురాలు రిచా శర్మను ప్రపంచానికి పరిచయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల లేదా వచ్చేనెలలో ప్రియదర్శి-రిచా శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని, దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. ‘ఆమె గురించి నా భావాలు, భావోద్వేగాలు పదాల్లో రాయాలని ప్రయత్నించి.. విఫలమయ్యాను. ఆమె అందమైన మనస్సును వర్ణించాలంటే ఎన్నో లక్షల కవితలు రాయాల్సి ఉంటుంది.. నన్ను పూర్తిగా అర్థం చేసుకొని.. నా జీవితంలో తను అడుగుపెట్టబోతుందంటూ’ ఓ అందమైన సందేశంతో ప్రియదర్శి తన ప్రేమికురాలు రిచాశర్మకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, నీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా కమేడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి అనతికాలంలో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో కౌషిక్గా నటించిన ప్రియదర్శి చెప్పిన డైలాగ్ ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి సినిమాలోనూ లాయర్‌గా ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. బాబు బాగా బిజీ, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగి, ఎంసీఏ తదితర సినిమాల్లో నటించాడు. -
స్వర్గంలో ఒక ఫోన్ ఉంటే!
త్రిషాలాదత్కు అమ్మంటే ప్రేమ. ప్రాణం. తనకు ఎనిమిదేళ్ల వయసులో అమ్మ రీచాశర్మ శాశ్వతంగా దూరం అయింది. ఆ బాధను ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. నాన్న సంజయ్‌దత్ ఎంత ఓదార్చినా ఆ దుఃఖం నుంచి కోలుకోలేక పోయింది. మొన్న డిసెంబర్ 10కి త్రిషాలా అమ్మను కోల్పోయి 21 ఏళ్లు. ఆ విషాదాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఒక పువ్వు ఫొటోను పెట్టి, దాని కింద.. ‘స్వర్గంలో ఉన్న మా అమ్మ జ్ఞాపకార్థం ఈ పువ్వును పెడుతున్నాను. ఆమె గురించి ఆలోచించకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు’ అని ఎంతో ఎమోషనల్‌గా రాసింది. ఈ ఏడాది ‘మదర్స్ డే’ రోజు కూడా త్రిషాలా తన మాతృమూర్తికి పంపిన సందేశం చాలామందికి కన్నీళ్లు తెప్పించింది. ‘స్వర్గంలో ఒక ఫోన్ ఉంటే.. నీతో మాట్లాడతానమ్మా’ అంటూ అమ్మ ఫొటోను షేర్ చేసింది. రీచాశర్మ సంజయ్‌దత్ మొదటి భార్య. రియా పిళ్లై రెండో భార్య. మాన్యత ప్రస్తుత జీవిత భాగస్వామి. రీచాను దత్ న్యూయార్క్‌లో పెళ్లి చేసుకున్నాడు. దత్ ఇండియా వచ్చేశాడు. త్రిషాలా అమ్మతోనే న్యూయార్క్‌లో ఉండిపోయింది. ప్రస్తుతం యు.ఎస్.లోనే అమ్మ వైపు వాళ్లతో ఉంటోంది. యు.ఎస్‌లో ఉన్నప్పుడే రీచాశర్మ 1996లో బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయారు. రెండో భార్య రియా పిళ్లై 2005లో దత్ నుంచి విడాకులు తీసుకున్నారు. -
..అలాగైతే మేం దేశద్రోహులమే : కన్హయ్య
దేశంలో మోదీస్వామ్యం: కన్హయ్య కుమార్ * అణగారిన వర్గాల గురించి గళం విప్పుతుంటే మాపై జాతి వ్యతిరేక ముద్ర * బీఫ్ తినే వారిపై జంతు సంరక్షణ పేరుతో దాడులు, హత్యలు * వర్సిటీల్లో వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం కోసం కృషి * హైదరాబాద్‌లో ‘థీమాటిక్ సోషల్ ఫోరం’ వర్క్‌షాప్ ప్రారంభం * వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థి నేతల హాజరు సాక్షి, హైదరాబాద్: మతోన్మాదాన్ని వ్యతిరేకించడమే దేశద్రోహమైతే తామంతా దేశద్రోహులమేనని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు. ప్రధాని పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పతనమై మోదీస్వామ్యం నడుస్తోందని... మహిళలు, దళితులు, ముస్లింల అణచివేత విధానాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. అఖిల భారత థీమాటిక్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో (ఆర్టీసీ కల్యాణ మండపంలో) ప్రారంభమైన రెండ్రోజుల వర్క్‌షాప్ (డిగ్నిటీ, డైవర్సిటీ, డెమోక్రసీపై)లో, విలేకరుల సమావేశంలో కన్హయ్య ఇదే అంశంపై మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే ప్రయత్నం చే స్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారినవర్గాల గురించి గళం విప్పే వాళ్లందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, కానీ తాము ఆ ‘బిరుదు’ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తిండి విషయంలోనూ ప్రజలకు స్వేచ్ఛ లేని పరిస్థితి దేశంలో నెలకొందని విమర్శించారు. చనిపోయిన జంతువుల కోసం కొందరు మనుషుల ప్రాణాలను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తినడం ఒక ఆహారపు అలవాటు అని, ప్రపంచంలోని అనేక దేశాల్లో బీఫ్ తింటున్నా దేశంలో మాత్రం ధర్మం, జంతు సంరక్షణ పేరుతో బీఫ్ తినే వారిపై దాడులు జరుగుతున్నాయన్నారు. హెచ్‌సీయూ పరిస్థితుల్లో మార్పు రాలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని కన్హయ్య పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జాతి వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం తెచ్చేలా కృషి చే యాలన్నారు. హెచ్‌సీయూలో మీడియానూ అడ్డుకుంటున్నారని, రోహిత్ ఆత్మహత్య తరువాత కూడా వర్సిటీలోని పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. విద్యావ్యవస్థలో అవినీతి దేశవ్యాప్తంగా ఉందని, ఎంసెట్-2 పేపర్ లీకేజీ అందులో భాగమేనని కన్హయ్య పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయకపోవడం మన వ్యవస్థలోని అసమానత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఎందరో వివక్ష ఎదుర్కొంటున్నారు: రాధిక వేముల అంతకుముందు థీమాటిక్ సోషల్ ఫోరం కార్యక్రమాన్ని రోహిత్ వేముల తల్లి రాధిక ప్రారంభిస్తూ దేశంలో తన కొడుకు లాంటి బిడ్డలెందరో వివక్ష ఎదుర్కొంటున్నారని, వారందరి పక్షాన పోరాడేందుకు తాను సిద్ధమన్నారు. కార్యక్రమానికి మోహన్ ధరావత్ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే తదితరులు ప్రసంగించారు. కశ్మీర్ లోయలో ఇటీవలి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారితోపాటు ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, రోహిత్ వేముల, ఇతర అమరవీరులకు సభ నివాళులర్పించి రెండు నిముషాల పాటు మౌనం పాటించింది. హిందుత్వ శక్తుల నుంచి వివక్ష: రిచాశర్మ మహిళలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను హిందుత్వ శక్తులు వివక్షకు, అణచివేతకు గురిచేస్తున్నాయని అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం తొలి అధ్యక్షురాలు రిచాశర్మ విమర్శించారు. ఇదే జాతీయతైతే దాన్ని ప్రతిఘటించడానికి తామంతా సిద్ధమన్నారు. ఐశ్వర్యం, అధికారంకన్నా స్వాభిమానం కోసమే పోరాటమని చాటిన అంబేడ్కర్ ఆదర్శాల దారిలో తమ ఉద్యమ ప్రస్థానం సాగుతోందని హెచ్‌సీయూ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంత ప్రశాంత్ పేర్కొన్నారు. దేశంలో వేల సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు, వెలివాడల మధ్య సమరం జరుగుతోందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నలిగంటి శరత్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు సుధాన్యాపాల్, పుణే ఫిల్మ్ యూనివర్సిటీ విద్యార్థి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ రాసిన ఆఖరి ఉత్తరం
ముంబై: జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ దత్ తన కుటుంబసభ్యులతో గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల సంజయ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సంజయ్ జైలు నుంచి బయటకు రావడం ఆయన కూతురు త్రిషాలకు అమిత సంతోషాన్ని కలిగించింది. త్రిషాల తల్లిదండ్రులతో తన అనుబంధాన్ని ట్విటర్లో పంచుకుంది. సంజయ్, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిషాల. రిచా కేన్సర్ వ్యాధితో 33 ఏళ్ల వయసులో మరణించింది. చిన్న వయసులోనే తల్లి దూరంకావడం, తండ్రి జైలుపాలు కావడం త్రిషాలను కలచివేసింది. రిచా శర్మ చనిపోయే ముందు రాసిన ఆఖరి ఉత్తరాన్ని త్రిషాల ట్విటర్లో పోస్ట్ చేసింది. 'అందరం కలసి జీవిస్తాం. ప్రతి ఒక్కరూ ఎవరిదారి వారు చూసుకుంటారు. నేను నా దారి చూసుకున్నా. అయితే నేనూ ఎటూ దారితోచని స్థితిలోకి వెళ్లిపోయా. వెనక్కు ఎలా రావాలో? మరో అవకాశం ఉంటుందా? వీటన్నంటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఎంతకాలమైనా ఎదురు చూస్తా. వెనక్కు వచ్చే దారి లేదని నా మనసుకు తెలుసు. అయినా ఇప్పటికీ ఆశ ఉంది. ఓ దైవధూతా నా కలలు ఎదురుచూస్తున్న ప్రదేశానికి నన్ను తీసుకువెళ్లు. ఎంతో జాగ్రత్తగా నాకు స్వాగతం పలుకుతారు' అని రిచా తన చివరి లేఖ రాసింది. తన తల్లి చనిపోయినపుడు ఈ ఉత్తరాన్ని చూశానని త్రిషాల నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. '21 సంవత్సరాల క్రితం ఈ ఉత్తరాన్ని చూశా. రైటింగ్ స్కిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయో ఇప్పుడు తెలుస్తోంది. జీవితం చాలా చిన్నది. అమ్మను మిస్సయ్యా' అని త్రిషాల ట్వీట్ చేసింది. రిచా మరణాంతరం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంజయ్.. మాన్యతను రెండో వివాహం చేసుకున్నాడు.