
త్రిషాలాదత్‌కు అమ్మంటే ప్రేమ. ప్రాణం. తనకు ఎనిమిదేళ్ల వయసులో అమ్మ రీచాశర్మ శాశ్వతంగా దూరం అయింది. ఆ బాధను ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. నాన్న సంజయ్‌దత్ ఎంత ఓదార్చినా ఆ దుఃఖం నుంచి కోలుకోలేక పోయింది. మొన్న డిసెంబర్ 10కి త్రిషాలా అమ్మను కోల్పోయి 21 ఏళ్లు. ఆ విషాదాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఒక పువ్వు ఫొటోను పెట్టి, దాని కింద.. ‘స్వర్గంలో ఉన్న మా అమ్మ జ్ఞాపకార్థం ఈ పువ్వును పెడుతున్నాను. ఆమె గురించి ఆలోచించకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు’ అని ఎంతో ఎమోషనల్‌గా రాసింది. ఈ ఏడాది ‘మదర్స్ డే’ రోజు కూడా త్రిషాలా తన మాతృమూర్తికి పంపిన సందేశం చాలామందికి కన్నీళ్లు తెప్పించింది.
‘స్వర్గంలో ఒక ఫోన్ ఉంటే.. నీతో మాట్లాడతానమ్మా’ అంటూ అమ్మ ఫొటోను షేర్ చేసింది. రీచాశర్మ సంజయ్‌దత్ మొదటి భార్య. రియా పిళ్లై రెండో భార్య. మాన్యత ప్రస్తుత జీవిత భాగస్వామి. రీచాను దత్ న్యూయార్క్‌లో పెళ్లి చేసుకున్నాడు. దత్ ఇండియా వచ్చేశాడు. త్రిషాలా అమ్మతోనే న్యూయార్క్‌లో ఉండిపోయింది. ప్రస్తుతం యు.ఎస్.లోనే అమ్మ వైపు వాళ్లతో ఉంటోంది. యు.ఎస్‌లో ఉన్నప్పుడే రీచాశర్మ 1996లో బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయారు. రెండో భార్య రియా పిళ్లై 2005లో దత్ నుంచి విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment