ఈ యంగ్ హీరో చేతిలో ఏడు సినిమాలు..! | Vijay Devarakonda Become a Busy Hero in Telugu | Sakshi
Sakshi News home page

ఈ యంగ్ హీరో చేతిలో ఏడు సినిమాలు..!

Published Wed, Mar 1 2017 12:39 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

ఈ యంగ్ హీరో చేతిలో ఏడు సినిమాలు..!

ఈ యంగ్ హీరో చేతిలో ఏడు సినిమాలు..!

పెళ్లిచూపులు సినిమా రిలీజ్ అయ్యే వరకు విజయ్ దేవరకొండ అనే పేరు చాలా మందికి తెలీదు. అంతుకు ముందు ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. వరుస అవకాశాలు మాత్రం రాలేదు. పెళ్లి చూపులు సక్సెస్ విజయ్ లైఫ్ను టర్న్ చేసింది. ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ కిక్తో విజయ్ ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టాడు.

ఈ శుక్రవారం (మార్చి 3) ద్వారక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత గీతా ఆర్ట్స్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో కూడా విజయే హీరోగా నటించనున్నాడు.

దీంతో పాటు పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ విజయ్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తోంది. కళ్యాణవైభోగమే సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన నందిని రెడ్డి కూడా విజయ్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేసింది. సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు సినిమాను పూర్తి చేసిన క్రాంతి మాధవ్ కూడా తన నెక్ట్స్ సినిమాను విజయ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడికి కూడా విజయ్ సినిమా ఓకె చేశాడట. వీటితో పాటు ప్రస్థానం ఫేం దేవాకట్టా కూడా విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement