
‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలని నిర్మించడంతో పాటు జాతీయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులని సొంతం చేసుకున్న నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు శివ. ధర్మపథ క్రియేషన్స్‌పై రూపొందనున్న ఈ చిత్రంతో శేష సింధురావ్ అనే లేడీ డైరెక్టర్‌ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు రాజ్ కందుకూరి.
దర్శకులు సుకుమార్, క్రిష్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు శేష సింధురావ్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘96’ చిత్రం ఫేమ్ వర్ష ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘మహానటి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ చిత్రానికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: దగ్గుబాటి సురేశ్ బాబు, ‘మధుర’ శ్రీధర్, కెమెరా: వేద వర్మ.
Comments
Please login to add a commentAdd a comment