Producer Raj Kandukuri
-
ఏనుగు పోయె
ఒక ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో కేవీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పోయే ఏనుగు పో’. పీకేఎ¯Œ క్రియేషన్స్ పతాకంపై ఎం. రాజేంద్ర¯Œ తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. తమిళంలో ‘పో యానైకుట్టియే పో’ పేరుతో రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు టైటిల్ లోగో, బేనర్ లోగోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోయే ఏనుగు పో’ టైటిల్ చాలా కొత్తగా ఉంది. మంచి కథ, మాటలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఎం.రాజేంద్ర¯Œ మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథా చిత్రమిది. ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే మంచి సన్నివేశాలతో మా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్. జి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
కొత్త హీరో... కొత్త డైరెక్టర్
‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలని నిర్మించడంతో పాటు జాతీయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులని సొంతం చేసుకున్న నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు శివ. ధర్మపథ క్రియేషన్స్‌పై రూపొందనున్న ఈ చిత్రంతో శేష సింధురావ్ అనే లేడీ డైరెక్టర్ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు రాజ్ కందుకూరి. దర్శకులు సుకుమార్, క్రిష్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు శేష సింధురావ్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘96’ చిత్రం ఫేమ్ వర్ష ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘మహానటి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ చిత్రానికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: దగ్గుబాటి సురేశ్ బాబు, ‘మధుర’ శ్రీధర్, కెమెరా: వేద వర్మ. -
మెంటల్ మదిలో...
మన మన మెంటల్ మదిలో... పాటను మరచిపోలేం? ‘ఓకే బంగారం’ తర్వాత యూత్ మొత్తం ఈ పాటనే పాడుకుంటోంది. అంత పాపులర్ అయింది. ఇప్పుడు అదే పాటలోని ‘మెంటల్ మదిలో’ అనే పదాలనే టైటిల్‌గా పెట్టి, ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి ఓ సినిమా నిర్మించారు. శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్ జంటగా ధర్మపద క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్S జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలను కుంటున్నారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘పెళ్ళి చూపులు’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. శ్రీ విష్ణు, నివేతాల నటన అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. వివేక్ ఆత్రేయ టేకింగ్ సూపర్. ప్రశాంత్ విహారి పాటలు సినిమాకు హైలైట్. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేదరామన్, ఎడిటింగ్: విప్లవ్ న్యాషాదమ్. -
పెళ్లి చూపులు నిర్మాతకు బి. నాగిరెడ్డి పురస్కారం
తెలుగు ప్రేక్షకులకు పలు చిరస్మరణీయ చిత్రాలను అందించిన సినీ నిర్మాత, విజయ వాహినీ స్టూడియో అధినేత బి. నాగిరెడ్డి. ఆయన పేరు మీద ప్రతి ఏడాది చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసిన నిర్మాతకు బి. నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. విజయ వాహినీ సంస్థ తరపున బి. నాగిరెడ్డి తనయుడు బి. వెంకట్రామిరెడ్డి ఆరేళ్లుగా ఈ పురస్కార వేడుకలను నిర్వహిస్తున్నారు. 2016కుగానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరికి అందజేస్తున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 16న రాజమండ్రిలో ఈ పురస్కార ప్రధానోత్సవం జరగనుందని ఆయన తెలిపారు. ఈ పురస్కారం పట్ల రాజ్ కందుకూరి సంతోషం వ్యక్తం చేశారు.