పెళ్లి చూపులు నిర్మాతకు బి. నాగిరెడ్డి పురస్కారం | B. Nagi Reddy Award goes to pellichupulu producer | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులు నిర్మాతకు బి. నాగిరెడ్డి పురస్కారం

Published Sun, Mar 19 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

పెళ్లి చూపులు నిర్మాతకు బి. నాగిరెడ్డి పురస్కారం

పెళ్లి చూపులు నిర్మాతకు బి. నాగిరెడ్డి పురస్కారం

తెలుగు ప్రేక్షకులకు పలు చిరస్మరణీయ చిత్రాలను అందించిన  సినీ నిర్మాత, విజయ వాహినీ స్టూడియో అధినేత బి. నాగిరెడ్డి. ఆయన పేరు మీద ప్రతి ఏడాది చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసిన నిర్మాతకు బి. నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. విజయ వాహినీ సంస్థ తరపున బి. నాగిరెడ్డి తనయుడు బి. వెంకట్రామిరెడ్డి ఆరేళ్లుగా ఈ పురస్కార వేడుకలను నిర్వహిస్తున్నారు.

2016కుగానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్‌ కందుకూరికి అందజేస్తున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో ఈ పురస్కార ప్రధానోత్సవం జరగనుందని ఆయన తెలిపారు. ఈ పురస్కారం పట్ల రాజ్‌ కందుకూరి సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement