
యంగ్ జనరేషన్ దర్శకులతో కలిసి పనిచేసేందుకు స్టార్ హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్స్‌తో పనిచేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పిన మహేష్, మరో యంగ్ డైరెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరగుతోంది.
పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో సక్సెస్ సాధించాడు. త్వరలో హీరోగానూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ యువ దర్శకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓ పాయింట్ వినిపించాడట. ఈ పాయింట్ పట్ల సుముఖంగా ఉన్న మహేష్ పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మహేష్, తరుణ్ భాస్కర్ నుంచి ఎలాంటి ప్రకటనా రావటం లేదు.
ప్రస్తుతం తన 25 సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్‌గా అలరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment