30 Weds 21 Fame Chaitanya Movie With Pelli Choopulu Producer Deets Inside - Sakshi
Sakshi News home page

30 Weds 21 Fame Chaitanya: '30 వెడ్స్‌ 21' ఫేమ్‌ చైతన్య హీరోగా ఇంట్రెస్టింగ్‌ మూవీ..

Published Wed, Mar 9 2022 1:01 PM | Last Updated on Wed, Mar 9 2022 1:35 PM

30 Weds 21 Fame Chaitanya Movie With Pelli Chupulu Producer - Sakshi

30 Weds 21 Fame Chaitanya Movie With Pelli Chupulu Producer: '30 వెడ్స్‌ 21' వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ చైతన్య రావ్‌ మాధాడి బంపర్‌ ఆఫర్ కొట్టేశాడు. గతేడాది యూట్యూబ్‌లో విడుదలై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న వెబ్‌ సిరీస్‌లలో  ‘30 వెడ్స్ 21’ ఒకటి. ఈ వెబ్‌సిరీస్‌ ఎంతలా హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ రెండో సీజన్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో చైతన్య రావ్‌ మాధాడి, అనన్య శర్మ జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌తో వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారాడు చైతన్య. 

పెళ్లి చూపులు, డియర్‌ కామ్రేడ్‌, దొరసాని, ఏబీసీడీ వంటి పలు హిట్ చిత్రాలకు బిగ్‌బెన్‌ సినిమాస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. భారత జాతీయ అవార్డు గుర్తింపుతో మంచి కంటెంట్‌తో చిత్రాలు తీసే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. న్యూ టాలెంట్‌ డైరెక్టర్‌లకు అవకాశమిస్తూ సినిమాపై తనకున్న ప్యాషన్‌ చూపిస్తున్నారు నిర్మాత యశ్  రంగినేని. ఈ క్రమంలోనే 'పిట్ట కథ' మూవీ డైరెక్టర్‌ చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తోపాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలను తెలియజేస్తామని నిర్మాత పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement