30 Weds 21 Web Series
-
'30 వెడ్స్ 21' అనన్య గురించి ఈ విషయాలు తెలుసా?
కొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయినా సినిమాలు, సిరీస్‌లు సూపర్ హిట్ అవుతుంటాయి. అటువంటి ఓ సిరీసే ‘30 వెడ్స్ 21’. ఇందులో అద్భుతంగా నటించి, ఓవర్‌నైట్ యూట్యూబ్ స్టార్‌గా మారింది అనన్య శర్మ. ఆమె గురించి కొన్ని వివరాలు.. ► అనన్య శర్మ జన్మస్థలం వరంగల్. ప్రస్తుతం చెన్నైలోని వీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి సినిమాలపై మక్కువ ఎక్కువ. ఒక రోజు యూట్యూబ్ చానెల్లో నటించే అవకాశం రావడంతో, నటనవైపు అడుగులు వేసింది. అప్పుడు ఏదో సరదాగా నటించింది. కానీ, ప్రేక్షకులు ఆమె అభినయాన్ని మెచ్చి యూట్యూబ్ స్టార్‌ను చేశారు. ‘చాయ్ బిస్కెట్’, ‘బాయిస్ ఫార్ములా’ చానెల్స్‌లోని షార్ట్ ఫిల్మ్స్‌తో బాగా పాపులర్ అయింది. ► ముప్పై ఏళ్ల వయసున్న అబ్బాయిని ఇరవై ఒక్కేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుంటే వచ్చే చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లు, సరదాలతో చిత్రీకరించిన ‘30 వెడ్స్ 21’ అనే సిరీస్‌లో అనన్య చక్కటి ప్రతిభను కనబరచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల అయిన ‘లాలీపాప్’ అనే కవర్ సాంగ్‌తో అలరిస్తోంది. తను నటించిన మరో రెండు సిరీస్‌లూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కానీ, ముందు చదువు పూర్తి చేయాలి. ఆ తర్వాత నా టైమ్ మొత్తం నటనకే కేటాయిస్తాను. – అనన్య శర్మ -
'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీ..
30 Weds 21 Fame Chaitanya Movie With Pelli Chupulu Producer: '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావ్ మాధాడి బంపర్ ఆఫర్ కొట్టేశాడు. గతేడాది యూట్యూబ్‌లో విడుదలై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌లలో ‘30 వెడ్స్ 21’ ఒకటి. ఈ వెబ్‌సిరీస్ ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో చైతన్య రావ్ మాధాడి, అనన్య శర్మ జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌తో వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారాడు చైతన్య. పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, ఏబీసీడీ వంటి పలు హిట్ చిత్రాలకు బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. భారత జాతీయ అవార్డు గుర్తింపుతో మంచి కంటెంట్‌తో చిత్రాలు తీసే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. న్యూ టాలెంట్ డైరెక్టర్లకు అవకాశమిస్తూ సినిమాపై తనకున్న ప్యాషన్ చూపిస్తున్నారు నిర్మాత యశ్ రంగినేని. ఈ క్రమంలోనే 'పిట్ట కథ' మూవీ డైరెక్టర్ చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తోపాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలను తెలియజేస్తామని నిర్మాత పేర్కొన్నారు. Delighted to announce our next 🙏@IamChaitanyarao #ChenduMuddu@GskMedia_PR @YashBigBen pic.twitter.com/LqJ8q6vXrP — BIGBEN Cinemas (@BigBen_Cinemas) March 9, 2022 -
వెల్కమ్ టు అడల్ట్‌హుడ్.. 30 వెడ్స్ 21 సీజన్-2 టీజర్ రిలీజ్
30 Weds 21 Web Series Season 2 Teaser Released: 2021లో యూట్యూబ్‌లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల అమ్మాయితో వివాహం అనే ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ సిరీస్. తొమిదేళ్ల ఏజ్ గ్యాప్‌తో పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో చూపించి ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో దంపతులుగా నటించిన చైతన్య, అనన్య జోడీ నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఎంతో హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సిరీస్‌కు రెండో సీజన్ ఫస్ట్ లుక్‌ను ప్రకటించిన మేకర్స్ సోమవారం 30 వెడ్స్ 21 రెండో సీజన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇక మనిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రావు అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. అనేక భావోద్వేగాల మధ్య కలిసిన మేఘన, పృథ్వీలు జంటగా ప్రేమ పక్షుల్లా విహరించడం, అనుభూతి చెందడం టీజర్లో చూపించారు. 'నాన్న బుజాల మీదెక్కి చూసే ప్రపంచానికి, మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది' అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు అసమర్థుడు, మనోజ్ పీ కథను అందించగా, పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. -
‘30 వెడ్స్ 21’వెబ్‌సిరీస్ సీజన్-2 రెడీ.. ఫస్ట్‌లుక్ రిలీజ్
గతేడాది యూట్యూబ్‌లో విడుదలైన ‘30 వెడ్స్ 21’వెబ్‌సిరీస్ ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్ అప్పట్లో యూట్యూబ్‌ను షేక్ చేసింది. చైతన్య, అనన్య జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసిన ఈ వెబ్‌సిరీస్ ఇప్పుడు రెండో సీజన్‌కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా సీజన్-2 సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్‌ను రేపు(జనవరి31)విడుదల కానుంది. This valentine's month, Meet our most loved married couple, Meghana and Prudhvi again 💝 Presenting the first look of #30Weds21 season 2 Teaser out on 31 Jan@ananyaontweet @IamChaitanyarao @prithvi_vanam@anuragmayreddy @SharathWhat @scaler_official pic.twitter.com/EahWAhhNLh — ChaiBisket (@ChaiBisket) January 30, 2022 -
అరెవ్వా..30 వెడ్స్ 21, సూర్య వెబ్‌సిరీస్‌లు అదరగొట్టాయే...! భారత్‌లోనే..
కరోనా రాకతో దేశవ్యాప్తంగా ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందరు ఇంటికే పరిమితమవ్వడంతో ఓటీటీ యూజర్ల బేస్ అమాంతం అధికమైంది. ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిశాయి. ఇకపోతే యూట్యూబ్‌లో కూడా కంటెంట్ క్రియేటర్లకు భారీగానే డబ్బులు వచ్చాయి. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా యూట్యూబ్ ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగినట్లు యూట్యూబ్ డైరెక్టర్ సత్య రాఘవన్ వెల్లడించారు. 2021లో యూట్యూబ్‌లో వీపరితంగా ట్రెండింగ్ ఐనా అంశాలను యూట్యూబ్ ఇండియా విడుదల చేసింది. భారత్‌లో ట్రెండ్ ఐనవి..! 2021 యూట్యూబ్ ట్రెండింగ్ చాట్‌లో గేమింగ్ తొలిస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో కామెడీ వీడియోలు అత్యంత ప్రజాదరణను పొందాయని యూట్యూబ్ వెల్లడించింది. గేమింగ్, కామెడీ వీడియోలను యూజర్లు అధికంగా చూసారని సత్యరాఘవన్ వెల్లడించారు. మ్యూజిక్, యూట్యూబ్ షార్ట్స్, వెబ్ సిరీస్‌లు కూడా ఎక్కువ మేర ట్రెండ్ అయ్యాయి. వీటితో పాటుగా ప్రాంక్ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. యూట్యూబ్ షార్ట్ వీడియోలో... 2021లో యూట్యూబ్ షార్ట్ వీడియోలో A2 మోటివేషన్ (అరవింద్ అరోరా), మిస్టర్ జ్ఞాని ఫాక్ట్స్ అగ్రస్థానంలో నిలిచారు. టెక్నాలజీ విషయంలో Crazy XYZ , MR. INDIAN HACKER అగ్ర కంటెంట్ క్రియేటర్లుగా ఉన్నారు. కామెడీ విషయంలో 40 నిమిషాల నిడివి గల ‘Round2Hell’ హారర్-కామెడీ జోంబీ అపోకలిప్స్ షార్ట్ ఫిల్మ్ ట్రెండింగ్ వీడియోలో నంబర్ 1గా నిలిచింది. షార్ట్-ఫామ్ వీడియోలో కూడా నంబర్ 1గా భారత్‌లో నిలిచింది. యూట్యూబ్‌లో క్యారీమినాటి, బీబీ కీ వైన్స్, ప్రముఖ టీవీ షో తారక్ మెహతా కా ఊల్తా చష్మా నుంచి ఒక సన్నివేశం మొదటి పది స్థానాల్లోకి వచ్చిన ప్రసిద్ధ కామెడీ వీడియోలుగా నిలిచాయి. వెబ్‌సిరీస్ ట్రెండింగ్‌లో...30 వెడ్స్ 21, సూర్య.. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్, స్క్రిప్ట్ కంటెంట్‌ను యూజర్లు ఎగబడి చూశారు. ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్)రూపొందించిన ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్, డైస్ మీడియా ఆపరేషన్ MBBS, క్లచ్ అత్యంత ఆదరణను పొందాయి. తెలుగులో వచ్చిన వెబ్‌సిరీస్‌లు కూడా తమ సత్తాను చాటాయి. ఈ ఏడాది ట్రెండ్ ఐనా వాటిలో గర్ల్ ఫార్ములా రూపొందించిన 30 వెడ్స్ 21, షణ్ముఖ్ జస్వంత్ నటించిన సూర్య వెబ్‌సిరీస్ కూడా నిలిచాయి. జెన్ జెడ్ వారే ఎక్కువ..! ఈ ఏడాది భారత్‌లో జెన్ జెడ్(1997 నుంచి పుట్టిన వారు) జనరేషన్ యూట్యూబ్‌లో ఎక్కువ మేర వీక్షించినట్లు తెలుస్తోంది. గేమింగ్ చానల్స్‌కు వీరు కాసుల వర్షాన్ని కురిపించారని సత్య రాఘవన్ వెల్లడించారు చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..! -
30 Weds 21: నెలకు 3 లక్షల జీతం.. అయినా వద్దనుకున్నా: చైతన్య
హీరో చైతన్య రావు తెలుసా మీకు.. అబ్బే.. ఈ పేరు ఎక్కడ వినలేదండి అంటారా? ఆగండి అయితే.. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ పేరు విన్నారా? వినడమేంటండి అల్రెడీ 6 ఎపిసోడ్స్ చూసేశాం అంటారా? అందులో 30 ఏళ్ల బ్యాచిలర్ పృథ్వి గుర్తు ఉన్నాడు కదా.. ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తే చైతన్య. తనదైన శైలీలో సహజంగా, అద్భుతంగా నటించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు చైతన్య. తాజాగా ఆయన తన వ్యక్తిగత విషయాలను ఓ మీడియాతో పంచుకున్నాడు. తనకు సినిమాలంటే పిచ్చి అని, అందుకే నెలకు మూడు లక్షలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోని వచ్చానని చెప్పాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. అమ్మ నాన్న మాట కాదనలేక అస్ట్రేలియాకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేశాను. అక్కడే ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగంలో చేరాను. నెలకు మూడు లక్షల జీతం వచ్చేది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. సినిమాలపై పిచ్చితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కి వచ్చాను. అప్పుడు అందరూ నన్ను తిట్టారు. కానీ నేను మాత్రం మొండిగానే సినిమాల కోసం ప్రయత్నించాను. అలా 2016లో ‘బందూక్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. నటనకి మంచి పేరు వచ్చినా అది పెద్దగా ఆడలేదు. అయినా నేను ప్రయత్నాలు ఆపలేదు. ప్రేమమ్, శమంతకమణి, గువ్వా గోరింక, హవా, సినిమాల్లో రెండో హీరోగా వకీల్‌సాబ్‌లో చిన్న పాత్ర చేశాను. ఇక ఇప్పుడు ఈ సిరీస్ హిట్ అవ్వడంతో అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. హీరోగా సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకుంటా’అని చైతన్య చెప్పుకొచ్చాడు. చదవండి: ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ రివ్యూ నేను చిన్నపిల్లని, బ్రేకప్ లాంటివి లేవు: అనన్య -
30 weds 21 వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: 30 వెడ్స్ 21 నటీటులు: చైతన్య రావు, అనన్య, మహేందర్, దివ్య, వీరభద్రం, తదితరులు దర్శకత్వం: పృథ్వీ వనం సంగీతం: జోస్ జిమ్మీ సినిమాటోగ్రఫీ : ప్రత్యక్ష్ రాజు విడుదల తేది : మే 2, 2021(యూట్యూబ్) కరోనా లాక్డౌన్ కారణంగా గత రెండేళ్ల నుంచి తెలుగులో వెబ్ సిరీస్‌లకు, ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరిగిపోయింది. సినిమా థియేటర్లకు తాళం పడడం, కొత్త సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టారు ప్రేక్షకులు. ఇక ఇదే సరైన సమయంగా భావించిన యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఓటీటీ వేదికలు సరికొత్త వినోదంతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నాయి. ఇటీవల యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘30 వెడ్స్ 21’. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ వీడియో క్లిప్స్ వైరల్‌గా మారాయి. ఫేస్బుక్, ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు చాలా వరకు 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ వీడియో క్లిప్స్ కనిపిస్తున్నాయి. యూత్‌ని అంతలా ఆకర్షించిన ‘30 వెడ్స్ 21’ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేమిటంటే.. పృద్వి(చైతన్య రావ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 30 ఏళ్ల బ్యాచిలర్. కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటి నుంచే పని చేస్తుంటాడు. లాక్డౌన్ సమయంలో అనుకోకుండా ఎందరికో పెళ్లిళ్లు అయిపోయినట్టుగానే పృద్వి వివాహం కూడా 21 ఏళ్ల అమ్మాయి మేఘన(అనన్య)తో జరిగిపోతుంది. అయితే తన కన్నా చాలా చిన్న వయసు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే గిల్టీ ఫీలింగ్‌తో బాధపడతాడు పృద్వి. తన పెళ్లి విషయాన్ని కూడా ఫ్రెండ్స్‌తో పంచుకోలేకపోతాడు. కానీ మేఘన మాత్రం వయసు తేడాలేవి పట్టించుకోకుండా నార్మల్‌గా ఉంటుంది. భర్తతో కలిసిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంటుంది. కానీ పృద్వి మాత్రం ఆమె చిన్న పిల్ల అనే ఫీలింగ్‌లోనే ఉండిపోతాడు. మరి ఇలాంటి భిన్న కోణాలు కలిగిన భార్యాభర్తల జీవితం ఎలా సాగింది? ఈ క్రమంలో వారికి ఎదురైన చిలిపి కష్టాలు ఏంటి? పృద్వి మనసులో బలంగా నాటుకుపోయిన ‘ఏజ్‌గ్యాప్’అపోహ ఎలా తొలిగిపోయింది? అని తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో ‘30 వెడ్స్ 21’వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఎలా చేశారంటే.. 30 ఏళ్ల బ్యాచిలర్ పృద్వి పాత్రలో ఒదిగిపోయాడు చైతన్య రావ్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా అద్భుతంగా నటించాడు. పెళ్లి విషయం బయటపెట్టకుండా ఉండేందుకు భార్య చెప్పే పనులు చేస్తూ నవ్వులు పూయించాడు. సహజంగా, అద్భుతంగా నటించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 21 ఏళ్ల మేఘన పాత్రలో అనన్య పరకాయ ప్రవేశం చేసింది. బ్రిలియెంట్ పెర్ఫామెన్స్‌తో ఔరా అనిపించింది. భర్త వీక్నెస్ని ఆసరాగా చేసుకొని ఆమె చేసిన చిలిపి తమషాలు ఈ సిరీస్‌కి హైలెట్ అని చెప్పొచ్చు. వీరితో పాటుగా కార్తీక్ అనే రోల్ కూడా నవ్వులు పూయించింది. మిగతా నటీ, నటులు తన పాత్రల పరిధి మేరకు నటించారు ఎలా తీశారంటే.. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి వివాహం జరిపితే.. వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీసే 30 వెడ్స్ 21. తొలుత 5 ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేసిన దర్శకుడు పృథ్వీ వనం.. తాజాగా ఆరో ఎపిసోడ్‌ని కూడా విడుదల చేశాడు. ఈ ఆరు ఎపిసోడ్స్ కూడా చాలా ఫన్నీగా సాగుతాయి. ముఖ్యంగా మొదటి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. కాన్సెప్ట్ కాస్త పాతదే అయినా.. డీల్ చేసిన విధానం చాలా ఫ్రెష్‌గా ఉంది. మొదటి రెండు ఎపిసోడ్స్‌ని ఎంటర్టైనింగ్గా మలిచిన దర్శకుడు... మిగతా ఎపిసోడ్స్‌ని కాస్త రొటీన్‌గా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినప్పటికీ.. ఎమోషన్స్ సీన్లు మాత్రం అంతగా పండలేదు. అలాగే తాజాగా విడుదలైన ఎపిసోడ్ మరీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఇక సిరీస్‌కి మరో ప్రధాన బలం.. బ్యాగ్రౌండ్ స్కోర్. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే పలు కామెడీ సన్నివేశాలను తనదైన స్పెషల్ బీజీఎంతో నవ్వులు పూయించాడు మ్యూజిక్ డైరెక్టర్ జోస్ జిమ్మీ. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే నిర్మాణ విలువలు సిరీస్‌కి తగ్గట్లుగా ఉన్నాయి. మొత్తంగా డీసెంట్ కామెడీ అండ్ రొమాంటిక్ యాంగిల్లో వచ్చిన ఈ సిరీస్‌ని ఫ్యామిలీతో కలిసి చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్