హీరో చైతన్య రావు తెలుసా మీకు.. అబ్బే.. ఈ పేరు ఎక్కడ వినలేదండి అంటారా? ఆగండి అయితే.. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ పేరు విన్నారా? వినడమేంటండి అల్రెడీ 6 ఎపిసోడ్స్ చూసేశాం అంటారా? అందులో 30 ఏళ్ల బ్యాచిలర్ పృథ్వి గుర్తు ఉన్నాడు కదా.. ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తే చైతన్య. తనదైన శైలీలో సహజంగా, అద్భుతంగా నటించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు చైతన్య. తాజాగా ఆయన తన వ్యక్తిగత విషయాలను ఓ మీడియాతో పంచుకున్నాడు. తనకు సినిమాలంటే పిచ్చి అని, అందుకే నెలకు మూడు లక్షలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోని వచ్చానని చెప్పాడు.
‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. అమ్మ నాన్న మాట కాదనలేక అస్ట్రేలియాకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేశాను. అక్కడే ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగంలో చేరాను. నెలకు మూడు లక్షల జీతం వచ్చేది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. సినిమాలపై పిచ్చితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కి వచ్చాను. అప్పుడు అందరూ నన్ను తిట్టారు. కానీ నేను మాత్రం మొండిగానే సినిమాల కోసం ప్రయత్నించాను.
అలా 2016లో ‘బందూక్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. నటనకి మంచి పేరు వచ్చినా అది పెద్దగా ఆడలేదు. అయినా నేను ప్రయత్నాలు ఆపలేదు. ప్రేమమ్, శమంతకమణి, గువ్వా గోరింక, హవా, సినిమాల్లో రెండో హీరోగా వకీల్‌సాబ్‌లో చిన్న పాత్ర చేశాను. ఇక ఇప్పుడు ఈ సిరీస్ హిట్ అవ్వడంతో అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. హీరోగా సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకుంటా’అని చైతన్య చెప్పుకొచ్చాడు.
చదవండి:
‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ రివ్యూ
నేను చిన్నపిల్లని, బ్రేకప్ లాంటివి లేవు: అనన్య
Comments
Please login to add a commentAdd a comment