'30 వెడ్స్‌ 21' అనన్య గురించి ఈ విషయాలు తెలుసా? | 30 Weds 21 Fame Ananya Sharma Biography And Film Career | Sakshi
Sakshi News home page

Ananya Sharma : '30 వెడ్స్‌ 21' అనన్య గురించి ఈ విషయాలు తెలుసా?

Published Sun, Apr 30 2023 10:01 AM | Last Updated on Sun, Apr 30 2023 10:12 AM

30 Weds 21 Fame Ananya Sharma Biography And Film Career - Sakshi

కొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయినా సినిమాలు, సిరీస్‌లు సూపర్‌ హిట్‌ అవుతుంటాయి. అటువంటి ఓ సిరీసే ‘30 వెడ్స్‌ 21’. ఇందులో అద్భుతంగా నటించి, ఓవర్‌నైట్‌ యూట్యూబ్‌ స్టార్‌గా మారింది అనన్య శర్మ. ఆమె గురించి కొన్ని వివరాలు..
 

► అనన్య శర్మ జన్మస్థలం వరంగల్‌. ప్రస్తుతం చెన్నైలోని వీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి సినిమాలపై మక్కువ ఎక్కువ. ఒక రోజు యూట్యూబ్‌ చానెల్‌లో నటించే అవకాశం రావడంతో, నటనవైపు అడుగులు వేసింది. అప్పుడు ఏదో సరదాగా నటించింది. కానీ, ప్రేక్షకులు ఆమె అభినయాన్ని మెచ్చి యూట్యూబ్‌ స్టార్‌ను చేశారు. ‘చాయ్‌ బిస్కెట్‌’, ‘బాయిస్‌ ఫార్ములా’ చానెల్స్‌లోని షార్ట్‌ ఫిల్మ్స్‌తో బాగా పాపులర్‌ అయింది.


► ముప్పై ఏళ్ల వయసున్న అబ్బాయిని ఇరవై ఒక్కేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుంటే వచ్చే చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లు, సరదాలతో చిత్రీకరించిన ‘30 వెడ్స్‌ 21’ అనే సిరీస్‌లో అనన్య చక్కటి ప్రతిభను కనబరచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల అయిన ‘లాలీపాప్‌’ అనే కవర్‌ సాంగ్‌తో అలరిస్తోంది. తను నటించిన మరో రెండు సిరీస్‌లూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కానీ, ముందు చదువు పూర్తి చేయాలి. ఆ తర్వాత నా టైమ్‌ మొత్తం నటనకే కేటాయిస్తాను. – అనన్య శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement