ఓటీటీకి తెలుగు వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Telugu Web Series Ardhamaindha Arun Kumar Season 2 Streaming In OTT | Sakshi
Sakshi News home page

Ardhamaindha Arun Kumar: ఓటీటీకి తెలుగు వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Wed, Oct 16 2024 1:49 PM | Last Updated on Wed, Oct 16 2024 1:51 PM

 Telugu Web Series Ardhamaindha Arun Kumar Season 2 Streaming In OTT

'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన అలరించిన టాలీవుడ్ వెబ్ సిరీస్‌. గతేడాది జూన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార‍్పొరేట్ వరల్డ్‌లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర‍్కొన్నాడనేదే అసలు కథ. తొలి సీజన్‌ ఐదు ఎపిసోడ్‌లుగా తెరకెక్కించారు.

తాజాగా ఈ వెబ్ సిరీస్‌ సీజన్-2 అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. కాగా.. ఈ సిరీస్‌ మొదటి సీజన్‌లో హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ బ్యానర్లపై బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ నిర్మించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement