AHA Unveils Ardhamaindha Arun Kumar Web Series Trailer, Know Streaming Date - Sakshi
Sakshi News home page

Ardhamaindha Arun Kumar: ‘అర్థమైందా అరుణ్ కుమార్’... ట్రైలర్ విడుదల చేసిన ‘ఆహా’

Published Thu, Jun 22 2023 5:30 PM | Last Updated on Thu, Jun 22 2023 6:59 PM

Ardhamaindha Arun Kumar Trailer Aha - Sakshi

ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ అనే వెబ్ సిరీస్ జూన్ 30న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా, ఆలోచింప‌చేసేలా ఈ సిరీస్ రూపొందింది. ఓ యువ‌కుడు కార్పొరేట్ ప్ర‌పంచంలో త‌నకు ఎదుర‌య్యే అనేక అనుభ‌వాల‌ను ఇందులో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. అందులో ప్రేమ‌, క‌ష్ట‌న‌ష్టాలతో పాటు ఏదో సాధించాల‌నుకునే ఆ యువ‌కుడు స‌వాళ్ల‌ను ఎదుర్కొని త‌న‌దైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడ‌నే విష‌యాల‌ను ఇందులో చ‌క్క‌గా చూపించారు.

(ఇదీ చదవండి: పాన్‌ ఇండియా స్థాయిలో ‘ఓ సాథియా’)

ఇన్ని అంశాల మేళ‌వింపుగా రూపొందిన ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ జూన్ 30 నుంచి ప్రేక్షకులను మెప్పించనుంది. అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై రూపొందింది. హ‌ర్షిత్ రెడ్డి, అన‌న్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌దివాడ త‌దిత‌రులు త‌మ‌దైన న‌ట‌న‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. ‘అఫిషియల్ చౌక్యాగిరి’ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. దీని కార‌ణంగా ఈ కార్పొరేట్ డ్రామాలో ఓ కొత్త అనుభూతి క‌లుగుతుంది. 

ట్రైలర్ లాంచ్ ముఖ్య అతిథి, యాక్టర్ ప్రియదర్శి, మాట్లాడుతూ 'ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం చాలా ఆనందంగా ఉంది. ఇదొక వైవిధ్య‌మైన క‌థాంశం. బ‌య‌ట‌కు ఎంతో అందంగా క‌నిపించే కార్పొరేట్ ప్ర‌పంచం ఎలా ఉంటుంది. ఏదో సాధించాల‌నే ల‌క్ష్యంతో ఎంతో మంది యువ‌కులు ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగుపెడ‌తారు. అయితే వారికి ఎదుర‌య్యే స‌వాళ్లు.. వాటిని ఎలా అధిగ‌మించాల‌నే విష‌యాల‌ను సిరీస్‌లో ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. త‌ప్ప‌కుండా వెబ్ సిరీస్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతుందని' అన్నారు.

ఆహా కంటెంట్, నాన్ స‌బ్స్ రెవెన్యూ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. 'కార్పొరేట్ ప్రపంచంలో  ఉండే ఇబ్బందుల‌ను ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాం. అరుణ్ కుమార్ అనే యువ‌కుడు త‌న జీవితంలో ఏదో సాధించాల‌నే ల‌క్ష్యంతో సిటీలోని కార్పొరేట్ కంపెనీలోకి ఇంట‌ర్న్ ఎంప్లాయ్‌గా జాయిన్ అవుతారు. త‌న ప్ర‌యాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల‌ను, సాధించిన ఉన్న‌తి అన్నింటినీ ఇందులో చూపిస్తున్నాం. ప్ర‌స్తుతం ఉన్న కార్పొరేట్ ప్ర‌పంచంలోని ఉద్యోగులంద‌రూ ఈ క‌థ‌కు క‌నెక్ట్ అవుతారు. అంతే కాకుండా వారిని వారి ల‌క్ష్యం వైపు అడుగులు వేసేలా ఈ ఒరిజిన‌ల్ ప్రేరేపిస్తుంది' అని అన్నారు. 

(ఇదీ చదవండి: టాప్‌ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)

అర్రె స్టూడియోస్ ప్ర‌తినిధి మాట్లాడుతూ 'మాకెంతో ఇష్టమైన షోస్‌లో ‘అఫిషియల్ చౌక్యాగిరి’ ఒకటి. ఈ  షో మూడు సీజన్స్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. దాన్ని తెలుగులో అర్థమైందా అరుణ్ కుమార్ పేరుతో రూపొందించంటం చాలా ఆనందంగా ఉంది. రీమేక్ కంటెంట్‌లో క‌థ‌, పాత్ర‌లు చాలా బ‌ల‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇత‌ర భాష‌లోకి మా కంటెంట్ రావ‌టం మాకెంతో ఆనందంగా ఉంది. అహాతో పాటు లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి ప‌నిచేయ‌టం ఈ ఫ్రాంచైజీకి ఓ కొత్త ఎన‌ర్జీనిచ్చింది' అని  అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement